వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు ఆస్ట్రేలియాలోని ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. సిడ్నీ మెల్బోర్న్ బ్రిస్బేన్ లలో జరిగిన కార్యక్రమాల్లో ఆయా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్నారైలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ రాష్ట్రానికి అనేక మేలు చేసినటువంటి వైఎస్ జగనన్న వెంట ఎల్లవేళలా ఉంటామని ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఆయన మార్గాన్ని విడవబోమని ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు పునరుద్ఘాటించారు. అలాగే కూటమి ప్రభుత్వం చేసే దుర్మార్గపు చర్యలను ఆటవిక రాజ్యపు పోకడలను ప్రజలలోకి విరివిగా తీసుకెళ్తామని ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా జగనన్న వెంట ఉంటామని తెలియజేశారు.
తెలుగుదేశం జనసేన కార్యకర్తల కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, ప్రవర్తించాలని ఈ సందర్భంగా ఎన్నారైలు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ జూమ్ కాల్ ద్వారా అనుబంధ విభాగాల అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు రోజా, శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరే శ్యామల, ఎన్నారై లతో మాట్లాడి వారు చేస్తున్నా ఈ కార్యక్రమాలను కొనియాడారు. ఈ సందర్భంగా చేసే పోరాటంలో ఎన్నారైలు అందరూ సహకరిస్తున్నందుకు వారికి అన్ని విధాలుగా రుణపడి ఉంటామని నాయకులు తెలియజేశారు.
అంకుఠిత దీక్షతో మద్దతుగా నిలుస్తున్న ఎన్నారైలు అందరికీ వైసీపీ నాయకులు జూమ్ కాల్ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. బిస్మిన్ లో జరిగిన కార్యక్రమంలో వైసీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, ఇరువురి బ్రహ్మారెడ్డి, వంశీ చాగంటి, జస్వంత్ రెడ్డి బొమ్మిరెడ్డి, ఏరువ చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఎన్‌ఆర్‌ఐ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
Comments
Please login to add a commentAdd a comment