‘ఎక్స్’ ద్వారా విషెస్ తెలిపిన 37 లక్షల మందికిపైగా పార్టీ శ్రేణులు, అభిమానులు
గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం దేశ, విదేశాల్లో ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు.
అమెరికా నార్త్ కరోలినా, సెయింట్ లూయిస్, కెనడా, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, బ్రిస్బేన్, సిడ్నీ, ఖతార్‌లోని దోహా, కువైట్, న్యూజిలాండ్ దేశాల్లో అభిమానులు కేక్‌లు కట్ చేసి, సామాజిక మాధ్యమాల్లో ఫొటోలను షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా, వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకొని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విటర్)లో ‘హ్యాపీ బర్త్‌డే వైఎస్ జగన్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో రికార్డు సృష్టించింది.
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్ డే వేడుకలు ఆస్ట్రేలియాలోని ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు..
సిడ్నీ మెల్‌బోర్న్ బ్రిస్బేన్ లలో జరిగిన కార్యక్రమాల్లో ఆయా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్నారైలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
ఈ సందర్భంగా పలువురు… pic.twitter.com/AKWOid47tq— Jagananna Connects (@JaganannaCNCTS) December 20, 2024
దోహా ఖతార్ లో ఎన్నారైలు పెద్ద ఎత్తున పాల్గొని మన ప్రియతమ నేత మాజీ ముఖ్య మంత్రివర్యులు శ్రీ @ysjagan గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.#HBDYSJagan #YSJaganMohanReddy #JaganannaConnects pic.twitter.com/LA3niEnfUC
— Jagananna Connects (@JaganannaCNCTS) December 20, 2024
ఆస్ట్రేలియాలోని , సిడ్నీలో మన ప్రియతమ నేత శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించిన ఎన్నారైలు..
ఈ సందర్భంగా వారు జగనన్న చేసిన గొప్ప కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు.#HBDYSJagan #YSJaganMohanReddy #JaganannaConnects pic.twitter.com/yPskG9grXo— Jagananna Connects (@JaganannaCNCTS) December 20, 2024
అమెరికాలోని చార్లోట్టే, నార్త్ కారోలినలో తెలుగు ఎన్నారైలు, కేక్ కట్ చేసి జగనన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహా దారులు శ్రీ పొతిరెడ్డి నాగార్జున రెడ్డి హాజరయ్యారు.… pic.twitter.com/mJbMzMvTt0— Jagananna Connects (@JaganannaCNCTS) December 21, 2024
అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జగనన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన @YSRCParty నాయకులు మరియు అభిమానులు.
ఈ కార్యక్రమానికి జూమ్ ద్వారా తమ సందేశాలను పంచుకున్న వైస్సార్సీపీ ఎంపీ @MithunReddyYSRC గారు, మాజీ మంత్రి @AmbatiRambabu గారు .#HBDYSJagan #YSJagan… pic.twitter.com/kLutnIxDjW— Jagananna Connects (@JaganannaCNCTS) December 21, 2024
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ లో జరిగిన జగనన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన వైఎస్సార్‌సీపీ నాయకులు మరియు అభిమానులు
ఈ కార్యక్రమానికి జూమ్ ద్వారా తన సందేశాన్ని పంచుకున్న నంద్యాల మాజీ ఎమ్మెల్యే @SilpaRaviReddy గారు.#HBDYSJagan #YSJagan #JaganannaConnects pic.twitter.com/jyKNd7uJnN— Jagananna Connects (@JaganannaCNCTS) December 21, 2024
డిసెంబర్ 20వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఇండియా టాప్ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 24 గంటల్లో 18 గంటలకుపైగా టాప్ వన్ పొజిషన్‌లో నిలిచింది. ఎక్స్ వేదికగా వైఎస్ జగన్‌కు ఏకంగా 37 లక్షల మందికిపైగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు ఇవ్వాలి. ప్రజా సేవలో సుదీర్ఘకాలం ఉండాలి’ అంటూ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
కెనడాలో జగనన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన వైఎస్సార్‌సీపీ నాయకులు మరియు అభిమానులు
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అనేక మేలు చేసినటువంటి వైఎస్ జగన్ గారి వెంట ఎల్లవేళలా ఉంటామని, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఆయన మార్గాన్ని విడువబోమని పునరుద్ఘాటించారు.#HBDYSJagan #YSJagan… pic.twitter.com/NDWJ3ykVqj— Jagananna Connects (@JaganannaCNCTS) December 21, 2024
Comments
Please login to add a commentAdd a comment