వైయస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో YSR కేడర్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగనన్నకు శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ నాయకులు వై ఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి, గుడివాడ అమర్‌నాథ్, శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, కుంచె రమణారావు లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలతో ఎప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి సాధనలను గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కృషిని ప్రశంసించారు.
ఆస్ట్రేలియా - టీం మెల్‌బోర్న్ సభ్యులు కృష్ణా రెడ్డి, భరత్, బ్రాహ్మ రెడ్డి, రామంజి, నాగార్జున.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. జగనన్న స్ఫూర్తి అందరికీ మార్గదర్శకంగా నిలవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment