సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు కార్యక్రమం క్షేత్రస్థాయి క్యాంప్‌ల నిర్వహణ విజయవంతంగా జరుగుతుండటంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొదటి రెండు రోజుల్లో 3.87 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 97,335 మందికి కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కంటి వెలుగు అమలుపై శనివారం ఆమె బీఆర్‌కేఆర్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం. రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి ఇందులో పాల్గొన్నారు. కాగా, అన్ని జిల్లాల్లోని బఫర్ టీమ్స్‌ను ఉపయోగించి ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కోర్టు భవన సముదాయాలు, పోలీస్ బెటాలియన్లు, జర్నలిస్టుల కోసం ప్రెస్‌క్లబ్‌ల వద్ద ప్రత్యేక కంటి వెలుగు క్యాంప్‌లను నిర్వహించాలని శాంతి కుమారి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment