పెళ్లి పెటాకులు చేసిన చాటింగ్ | Saudi man dumps bride 2 hrs after wedding due to Snapchat | Sakshi
Sakshi News home page

పెళ్లి పెటాకులు చేసిన చాటింగ్

Published Tue, Oct 25 2016 6:07 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

పెళ్లి పెటాకులు చేసిన చాటింగ్ - Sakshi

పెళ్లి పెటాకులు చేసిన చాటింగ్

దుబాయ్: సోషల్ మీడియా పుణ్యమా అని సౌదీ అరేబియాలో ఓ పెళ్లి రెండు గంటల్లోనే పెటాకులైంది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆ అమ్మాయి ఉల్లంఘించినందుకు అతడు ఆమెను రెండు గంటల్లోనే వద్దన్నాడు. వెంటనే పెళ్లి రద్దు చేసుకొని విడాకులు కోరాడు. ఇంతకీ ఆ అమ్మాయితో ఆ అబ్బాయి కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటంటారా.. మరేంలేదు.

వారి వివాహానికి సంబంధించిన ఫొటోలను ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా యాప్ల ద్వారా స్నేహితులకు పంపొద్దని అతడు షరతు విధించాడు. అందుకు ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది. అయితే, ఆ విషయాన్ని అంతగా పట్టించుకోని ఆ పెళ్లి కూతురు పెళ్లయిన ఆనందంలో వారి వివాహ ఫొటోలను స్నాప్ చాట్ ద్వారా తన స్నేహితులకు పంపించింది. ఈ విషయం తెలుసుకున్న వరుడు కాస్త ఆగ్రహానికి లోనై వివాహం వెంటనే రద్దన్నాడు. విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని పెళ్లి కూతురు సోదరుడు స్వయంగా మీడియాకు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement