రూ. 900 కోట్లు ఆవిరయ్యాయి | Offensive Rihanna Ad Lands Snapchat In Huge Loss | Sakshi
Sakshi News home page

రూ. 900 కోట్లు ఆవిరయ్యాయి

Mar 18 2018 5:48 PM | Updated on Mar 18 2018 7:12 PM

Offensive Rihanna Ad Lands Snapchat In Huge Loss - Sakshi

రిహన్నా, స్నాప్‌చాట్‌ సహవ్యవస్థాపకుడు ఇవాన్‌

న్యూఢిల్లీ : సోషల్‌మీడియా యాప్‌ స్నాప్‌ చాట్‌ సంపద భారీగా ఆవిరయ్యింది. కొద్దిరోజుల క్రితం పాప్‌ సింగర్‌ రిహన్నాపై ఉద్దేశించిన ఓ యాడ్‌ను స్నాప్‌చాట్‌ ప్రచురించింది. దీంతో రిహాన్నా ఫ్యాన్స్‌ స్నాప్‌చాట్‌ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అంతేకాదు రిహన్నాపై యాడ్‌ తర్వాత స్నాప్‌ చాట్‌ రూ. 9 వేల కోట్ల నష్టపోయింది. తాజాగా స్నాప్‌చాట్‌ సహవ్యవస్థాపకుడు, సీఈవో ఇవాన్‌ సంపద రూ. 900 కోట్ల మేర ఆవిరయ్యింది.

ఈ విషయాన్ని ఫోర్బ్‌ వెల్లడించింది. ప్రసుత్తం ఇవాన్‌ సంపద 3.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2009లో రిహన్నాపై ఆమె బాయ్‌ఫ్రెండ్‌ బ్రౌన్‌ దాడి చేయడాన్ని ఆధారంగా చేసుకొని స్నాప్‌చాట్‌ యాడ్‌ను రూపొందించారు. దీనిపై రిహన్నా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్నాప్‌చాట్‌ యాప్‌ను డిలీట్‌ చేయాల్సిందిగా ఆమె తన అభిమానులకు పిలుపునిచ్చారు. కాగా యాడ్‌పై స్నాప్‌చాట్‌ ఇప్పటికే రిహన్నాకు క్షమాపణలు చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement