rihanna
-
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Rihanna Photos: అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్‌లో జోష్ నింపిన రిహాన్నా (ఫోటోలు)
-
అంబానీకి కాబోయే కోడలిని అలా అనేసిందేంటి!
అంబానీ ఇంట పెళ్లంటే ఎలా ఉండాలి? దేశమంతా మార్మోగిపోవాలి. కలకాలం చరిత్రలో నిలిచిపోయేంత ఘనంగా సెలబ్రేషన్స్ జరగాలి. ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్సే అందుకు సాంపుల్. పెళ్లికి నాలుగు నెలల ముందే హడావుడి మొదలుపెట్టేశారు. మార్చి 1 నుంచి 3 వరకు అనంత్-రాధికల ప్రీవెడ్డింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చేరుకుని వేడుకల్లో భాగమయ్యారు. అంబానీ ఫ్యామిలీకి థ్యాంక్స్ మొదటి రోజు పాప్ సింగర్ రిహాన్నా తన పర్ఫామెన్స్తో అల్లాడించేసింది. భారత్‌లో ఇదే తన తొలి లైవ్ పర్ఫామెన్స్ కావడం విశేషం. ఇక స్టేజీపై మైక్ అందుకుని మాట్లాడిన రిహాన్నా.. 'నన్ను ఇక్కడికి ఆహ్వానించిన అంబానీ కుటుంబానికి కృతజ్ఞతలు. అలాగే కాబోయే కొత్త జంట అనంత్- రాధికిలకు ఆల్‌ద బెస్ట్' అని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంబానీ కుటుంబంతో డ్యాన్స్ ఇది చూసిన నెటిజన్లు ఆమెకు పెళ్లికూతురి పేరు కూడా పలకడానికి రావడం లేదని సెటైర్లు వేస్తున్నారు. కోట్లు అందుకున్నప్పుడు కనీసం ఆ జంట పేర్లయినా బట్టీ పట్టాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే స్టేజీపై పోర్ ఇట్ అప్, వైల్డ్ థింగ్స్, డైమండ్స్ సాంగ్స్ పాడిన రిహాన్నా.. చివర్లో ఇషా అంబానీ, ముఖేశ్ అంబానీతో కలిసి డ్యాన్స్ చేసింది. ఒక్క రోజు పర్ఫామెన్స్ కోసం ఆమె ఏకంగా రూ.70 కోట్ల పైనే పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by RihannaHT (@twintwins17) చదవండి: భర్తను అన్‌ఫాలో చేసిన నయనతార.. ఆగమైన ఫ్యాన్స్! -
అనంత్, రాధిక ప్రీవెడ్డింగ్ ఈవెంట్: పాప్ సింగర్ ఒక్క పర్ఫామెన్స్కే అన్ని కోట్లా?
రిలయన్స్ అధినేత 'ముఖేష్ అంబానీ' చిన్న కుమారుడు అనంత్, ఎన్కోర్ హెల్త్‌కేర్ అధినేత 'వీరెన్ మర్చంట్' కుమార్తె రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలైపోయాయి. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నారు. ఇందులో గ్లోబల్ సెన్సేషన్, పాప్ క్వీన్ 'రిహాన్నా' కూడా ఉన్నారు. రిహాన్నా గురువారమే జామ్‌నగర్ చేరుకుంది. ఈమె అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో పర్ఫామెన్స్ కూడా చేయనుంది. ఈ పర్ఫామెన్స్ కోసం అంబానీ ఫ్యామిలీ ఈమె కోసం 8 నుంచి 9 బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 66 కోట్ల నుంచి రూ. 74 కోట్లు. జామ్‌నగర్ చేరుకున్న సమయంలో రిహాన్నా లగేజ్ ఎంతో మందికి ఆశ్చర్యానికి ఆశ్చర్యం కలిగించింది. ఈమెతో పాటు పలువురు సింగర్స్, ఇతర కళాకారులు ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ రోజు ప్రారంభమైన ప్రీ వెడ్డింగ్ వేడుకలు మరో రెండు రోజులు (మార్చి 3) జరగనున్నాయి. ఇదీ చదవండి: అంబానీకి కాబోయే కోడలి గురించి ఈ విషయాలు తెలుసా? అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్డ్, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్, బొలీవియా మాజీ అధ్యక్షుడు జార్జ్ క్విరోగా, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చైర్పర్సన్ క్లాస్ వంటి వారితో పాటు దిగ్గజ కంపెనీల సీఈఓలు మొదలైనవారు ఉన్నారు. View this post on Instagram A post shared by 𝑹𝒖𝒑𝒆𝒔𝒉 𝑺𝒖𝒓𝒗𝒆 (@rupesh.surve07) -
స్టార్ సింగర్ మెడలో డైమండ్ వాచ్.. ఎన్ని కోట్లో తెలుసా?
మీరు వాచీ ఎక్కడ కట్టుకుంటారు? అని అడగ్గానే ఇదేం పిచ్చి ప్రశ్న అని కిందనుంచి పైవరకు చూసి.. చేతికి కట్టుకుంటాం అని చెబుతారు. కానీ కొన్ని గడియారాలు ఉంటాయి. వాటిని బాడీలో ఎక్కడపడితే అక్కడ కట్టుకోవచ్చు! ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఓ ప్రముఖ పాప్ సింగర్ తన మెడకు ఓ డైమండ్ వాచ్ ధరించి కనిపించింది. ఇప్పుడు ఆ వాచ్, దాని ధర సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. (ఇదీ చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 28 సినిమాలు!) మన దగ్గర పెద్దగా ఉండదు కానీ పాశ్చాత్య దేశాల్లో పాప్ కల్చర్ చాలా ఎక్కువ. పాప్ సాంగ్స్ పాడే సింగర్స్ ని పిచ్చిపిచ్చిగా అభిమానిస్తారు. అలా ఫేమస్ అయింది రిహానా. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీతో ఉంది. తాజాగా తన భాయ్ ఫ్రెండ్ రాకీతో కలిసి ఓ చోట కనిపించింది. అయితే ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు కానీ ఆమె మెడకు వాచ్ ఉండటం కాస్త వింతగా అనిపించింది. అది వజ్రాలతో పొదిగిన గడియారం కావడం మరింత ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ వాచ్ ధర గురించి మాట్లాడుకుంటే రూ.5.7 కోట్లు రూపాయలని తెలుస్తోంది. జాకబ్ & కో కంపెనీ.. పాప్ సింగర్ రిహానా కోసం ప్రత్యేకంగా ఈ వజ్రాల గడియారాన్ని డిజైన్ చేశారు. మెడపై ఓ వాచ్ ధరించడం ఇదే తొలిసారి అని చెప్పుకొచ్చింది. తమ కంపెనీ ఇన్ స్టా పేజీలో రిహానా వాచ్ తో ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వాచ్, దాని కాస్ట్ చూసిన నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు. View this post on Instagram A post shared by JACOB & CO. (@jacobandco) (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!) -
పెళ్లి కాకుండానే గర్భవతైన టాప్ సింగర్! 'ఆ దేవుడే కాపాడాలి'
అమెరికన్ పాప్ సింగర్ రిహాన్నా పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది. తన బాయ్‌ఫ్రెండ్ రాకీతో కలిసి త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అయితే పెళ్లి చేసుకోకుండా గర్భం దాల్చడం సరికాదంటూ నైజీరియన్ ఇన్‌ఫ్లూయన్సర్ డేనియల్ రెఘా విమర్శలు గుప్పించాడు. ఇదేమీ పొగడాల్సినంత గొప్ప విషయం కాదని అభిప్రాయపడ్డాడు. సెలబ్రిటీలు అయినా, మామూలువాళ్లైనా వివాహం చేసుకున్నాక పిల్లల్ని కనడం సరైన పని అని చెప్పుకొచ్చిన ఆయన బేబీ మా అండ్ బేబీ డాడీ పదాలను ఈ ప్రపంచం నార్మలైజ్ చేస్తోందన్నాడు. ఈ పరిస్థితి నుంచి బయటపడేసేందుకు మనల్ని ఆ దేవుడే కాపాడాలంటూ ట్వీట్ చేశాడు. 'ఏ అమ్మాయైనా సరే, పెళ్లికి ముందే గర్భం దాల్చేందుకుకు పురుషుడికి అనుమతిస్తుందంటే తన విలువ తనకు తెలీనట్లే. ఒక వ్యక్తి నిజంగా ప్రేమిస్తే ముందు ఎదురుకట్నమిచ్చి మరీ పెళ్లి చేసుకుని ఆ తర్వాతే కుటుంబాన్ని ప్రారంభించాలి' అని మరో ట్వీట్లో చెప్పుకొచ్చాడు. ఈయన ట్వీట్లపై రిహాన్నా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 'నిన్నెవరు అడిగారు?. రిహాన్నాకు 30 ఏళ్లు. ఎప్పుడేం చేయాలో, ఏం చేయకూడదో ఆమెకు తెలుసు' అని చురకలంటిస్తున్నారు. Rihanna getting pregnant for ASAP Rocky w!thout getting married first, on a real !sn't worth applauding; Celebrity or not, the right thing to do is to get married before having kids. The world has normalised "baby mama & baby daddy" like its a d!gnifying status. God help us all. — Daniel Regha (@DanielRegha) January 31, 2022 కాగా తన ప్రతిభతో సింగర్గానేగాక, మంచి వ్యాపారవేత్తగా కూడా రాణిస్తూ వందల కోట్లు ఆర్జిస్తోంది. రిహాన్నా పాటలకు ఆడియెన్స్ ఆదరణతోపాటు అనేక అవార్డులు వరించాయి. వీటిలో గ్రామీ, అమెరికన్ మ్యూజిక్, బిల్బోర్డ్ మ్యూజిక్, బీఆర్‌ఐటీ వంటి అవార్డులను పదుల సంఖ్యలో అందుకుంది. బిల్బోర్డ్ రిహాన్నాకు 2000 దశాబ్దపు ‘డిజిటెక్ సాంగ్స్ ఆర్టిస్ట్’ అనే బిరుదును ప్రదానం చేసింది. Any lady who allows a man deliberately impregnate her before marriage d¤esn't know her worth; It makes absolutely n¤ sense. If a man truly loves u, he should go pay for ur bride price or walk u down the aisle before starting a family with u cos "baby mama" is a degrad!ng status. — Daniel Regha (@DanielRegha) January 31, 2022 -
రిహాన్నా ఫోర్బ్స్ సంపన్న గాయని
ప్రతిభ ఉండాలేగానీ ఏ రంగంలోనైనా ఎదగవచ్చు అన్న మాటకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది పాప్ సింగర్ రిహాన్నా. అమెరికన్ పాప్ సింగర్‌గా ప్రపంచానికి తెలిసిన రిహాన్నా ‘బ్యూటీ ప్రోడక్ట్స్’ వ్యాపారాన్ని లాభాల్లో నడిపిస్తూ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన ఓ నివేదికలో ఫోర్బ్స్ ‘రిచెస్ట్ లేడీ మ్యూజీషియన్’గా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఎప్పడూ హాట్ హాట్ డ్రెస్సులతో హాట్ ఐకాన్‌గా నిలిచే రిహాన్నా తన ప్రతిభతో సింగర్గానేగాక, మంచి వ్యాపారవేత్తగా కూడా రాణిస్తూ ఏకంగా ప్రపంచంలోనే ‘అత్యంత సంపన్న సంగీత విద్వాంసురాలిగా’ నిలిచింది. కేవలంసం గీతంతోనే ఆమెకు వందల కోట్ల ఆదాయం రాలేదు. ఆమె ఎంత చక్కగా పాడగలదో అంతే సమర్థవంతంగా వ్యాపారం చేస్తూ.. రిచెస్ట్ మ్యూజీషియన్‌గా నిలిచింది సంగీత ప్రపంచంలో బాగా పాపులర్ అయిన రాబిన్ రిహాన్నా ఫెంటీ 1988లో బార్బడాస్లోని మోనికా ఫేంటీ, రోనాల్డ్ దంపతులకు మూడో సంతానంగా పుట్టింది. ఆమెకు పద్నాలుగేళ్లున్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. దీంతో చిన్న వయసులోనే రిహన్నా అనేక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ పుట్టుకతో వచ్చిన మధురమైన గొంతుతో ఈ స్థాయికి ఎదిగింది. రిహాన్నా స్కూల్లో చదివేటప్పుడు తన స్నేహితులతో కలిసి సరదాగా పాటలు పాడేది. 2003లో క్రిస్టమస్ వెకేషన్లో భాగంగా ప్రముఖ మ్యూజిక్ నిర్మాత ఇవాన్ రోజర్స్ కుటుంబంతో బార్బడోస్ సందర్శించారు. ఆ సమయంలో రిహాన్నా గొంతు విన్న ఆయన ఆమెతో కలిసి కొన్ని పాటలు రికార్డు చేద్దామని న్యూయార్క్ ఆహ్వానించాడు. అప్పుడు న్యూయార్క్ వెళ్లి రోజర్స్‌తో కలిసి డజన్ల సంఖ్యలో పాటలను కంపోజ్ చేసింది. తరువాత తన పాటలను ఎవరు కొనుగోలు చేస్తారా అని ఎదురుచూస్తున్న సమయంలో ఈ రిహాన్నా పాటలు, పనితీరు నచ్చడంతో బాగా పేరొందిన జేజడ్ రికార్డింగ్స్ కంపెనీవారు .. ‘పొన్డి రిప్లే’ పేరిట డెబ్యూ ఆల్బమ్‌ను 2005లో విడుదల చేశారు. అది బాగా హిట్ అవడంతో.. మరిన్ని పాటలను పాడి ఆల్బమ్స్ రూపంలో విడుదల చేసింది. ఈ క్రమంలో రిçహాన్నా పాడిన 50 మిలియన్ల ఆల్బమ్స్, 190 మిలియన్ల సింగిల్ ఆల్బమ్స్‌ను ప్రపంచవ్యాప్తంగా విక్రయించింది. రిహాన్నా పాటలు ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ సెల్లింగ్ సింగిల్స్‌గా నిలిచాయి. వీటిలో ‘అంబ్రెల్లా’, ‘టేక్ ఏ బౌ’, ‘డిస్టర్బియా’, ‘లవ్ ద వే యూ లై’ లు చాలా పాపులర్ అయ్యాయి. డిజిటెక్ సాంగ్స్ ఆర్టిస్ట్ రిహాన్నా పాటలకు ఆడియెన్స్ ఆదరణతోపాటు అనేక అవార్డులు వరించాయి. వీటిలో గ్రామీ, అమెరికన్ మ్యూజిక్, బిల్బోర్డ్ మ్యూజిక్, బీఆర్‌ఐటీ వంటి అవార్డులను పదుల సంఖ్యలో అందుకుంది. బిల్బోర్డ్ రిహాన్నాకు 2000 దశాబ్దపు ‘డిజిటెక్ సాంగ్స్ ఆర్టిస్ట్’ అనే బిరుదును ప్రదానం చేసింది. ఫెంటీ బ్యూటీ... ప్రముఖ గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న రాబిన్ రిహాన్నా ఫెంటీ 2017లో ‘ఫెంటీæ బ్యూటీ’ పేరిట కంపెనీని ప్రారంభించింది. మహిళలు ఎక్కడకు వెళ్లినా వాడుకోగల బ్యూటీ ఉత్పత్తులను విక్రయించడంతో ఈ కంపెనీ బాగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ సుమారు 1.7 బిలియన్ డాలర్లుగా ఉండడంతో, ఫోర్బ్స్ జాబితాలో ఓప్రా విన్ఫ్రే తరువాత రిహాన్నా రెండో స్థానంలో నిలిచింది. ఫెంటీ బ్యూటీలో ఆమెకు యాభై శాతం వాటా ఉంది. అదే 1.4 బిలియన్ డాలర్లకు సమానం అని ఫోర్బ్స్ అంచనా. మిగతా విలువంతా ‘సావెజ్ ఎక్స్ ఫెంటీ’ అనే లోదుస్తుల బ్రాండ్ వల్ల వస్తోంది. సావెజ్ కంపెనీ మార్కెట్ అంచనా విలువ 270 మిలియన్ డాలర్లుగా ఉంది. వివిధ రకాల బ్యూటీ ఉత్పత్తులు, లోదుస్తులను ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లల్లో విక్రయిస్తూ సక్సెస్‌పుల్ బ్యూటీ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 101 మిలియన్ ఫాలోవర్స్, ట్విటర్లో 102.5 మిలియన్ ఫాలోవర్స్‌తో దూసుకుపోతూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. -
దుమారం రేపుతోన్న రిహన్నా టాప్‌లెస్ ఫోటో
భారతీయ మీడియాలో గత కొన్ని రోజులుగా హాలీవుడ్ పాప్ ఐకాన్ రిహన్నా పేరు మార్మోగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఉద్యమం చేస్తోన్న రైతులకు రిహన్నా మద్దతు తెలిపారు. నాటి నుంచి ఈ పాప్ ఐకాన్ పేరు దేశంలో మార్మోగిపోతుంది. ఈ క్రమంలో తాజాగా రిహన్నా చేసిన ఓ ఫోటో షూట్ సంచలనం సృష్టించడమే కాక విమర్శలు ఎదుర్కొంటుంది. రిహన్న తాజా ట్వీట్‌పై నెటిజనులు.. ముఖ్యంగా భారతీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దూమారం రేపిన ఆ ఫోటో షూట్ వివరాలు.. తాజాగా రిహన్నా తన లో దుస్తుల బ్రాండ్ ‘‘సెవేజ్ ఎక్స్ ఫెంటీ’’ ప్రమోషన్ కోసం షూట్ చేసిన ఓ ఫోటోని ట్విట్టర్లో షేర్ చేశారు. టాప్‌లెస్‌గా దిగిన ఈ ఫోటోలో రిహన్నా తన మెడలో వినాయకుడి పెండెంట్ ఉన్న చైన్ ధరించారు. ఇలాంటి అశ్లీల ఫోటో షూట్ కోసం రిహన్నా తన మెడలో గణేషుడి లాకెట్ ధరించడం పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ‘‘రిహన్నా దయచేసి ఇలాంటి చెత్త పనులు ఆపు. నా మతాన్ని నీవు అలంకరణ వస్తువుగా.. అది కూడా ఇలాంటి అసభ్య ఫోటో కోసం వాడటం కరెక్ట్ కాదు. నీ చైన్ చివర్లో ఉన్న గణేష్ పెండెంట్‌ని మా దేశంలో ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాం. దయచేసి మా దేవుళ్లని నీవు ఇలాంటి పనికి మాలిన ఫోటోల కోసం వాడి అవమానించడం మానుకో’’ అని కోరారు. మరో ట్విట్టర్ యూజర్ ‘‘మా దేశంలో ప్రతి ఏడాది కొన్ని మిలియన్ల మంది ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని జరుపుకుంటారు. అలాంటి పవిత్రమైన గణేషుడి పెండెంట్‌ని నీవు ఇంత అసభ్యకరమైన ఫోటో కోసం ధరించడం కరెక్ట్ కాదు. నీవు మమ్మల్ని చాలా అవమానించావు.. నిరాశ పరిచావు. నీ నుంచి ఇలాంటి పనులు ఊహించలేదు’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. మా సెంటిమెంట్లను హర్ట్ చేశావ్: షెహజాద్ పూనవాలా ఇక రిహన్నా టాప్‌లెస్ ఫోటోషూట్‌పై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు షెహజాద్ పూనవాలా స్పందించారు. మా సెంటిమెంట్లను హర్ట్ చేశావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘‘నేను ముస్లింని. అయినప్పటికి ఓ భారతీయుడిగా.. ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా నేను వినాయకుడిని ఎంతో ప్రేమిస్తాను. అలాంటి గణేష్ పెండెంట్‌ని నీవు ఇలాంటి అసభ్య ఫోటో కోసం వాడటం సరైంది కాదు. నీ చర్యలు నా మనోభావాలను, సెంటిమెంట్లను గాయపరిచింది. భారతదేశంలో రిహన్నాకు మద్దతిచ్చేవారు దీన్ని అంగీకరిస్తారా?’’ అంటూ ట్వీట్ చేశారు. I am a Muslim but as an Indian and Maharashtrian I love Lord Ganesha ji - sorry this misuse of Ganesha ji image hurts my feelings & sentiments - will Rihanna Backers in India accept this also? #GaneshaInsulted pic.twitter.com/ueHOS9UMZF — Shehzad Jai Hind (@Shehzad_Ind) February 16, 2021 చదవండి: రిహన్నా ట్వీట్.. గూగుల్‌లో ఏం సెర్చ్ చేశారంటే? -
నాటి రాళ్లు నేటి పూలు.. మన్నించు మారియా!
ఆరేళ్ల క్రితం.. ‘సచిన్ ఎవరో నాకు తెలీదు’ అని టెన్నిస్ తార మారియా షరపోవా అన్నందుకు ఆగ్రహించిన సచిన్ అభిమానులు ఇప్పుడు ఆ షరపోవాకే.. ‘మన్నించు మారియా, నువ్వన్నది కరెక్టే. అతడు నీకు తెలిసి ఉండాల్సినంత మనిషి కాదు’ అని ఆమె ఫేస్బుక్లో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఆమెకు లైకుల మీద లైకులు కొడుతున్నారు. రైతు ఉద్యమానికి మద్దతుగా నిలిచిన విదేశీ ప్రముఖుల్ని హెచ్చరిస్తూ.. ‘ఇది మా సొంత విషయం’ అని సచిన్ ట్వీట్ చేయడమే ఇందుకు కారణం. ఢిల్లీ సరిహద్దులలో కొన్ని నెలలుగా రైతు ఉద్యమం జరుగుతోంది. ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలు తమ మెడకు ఉరి వంటివి కనుక వాటిని రద్దు చేయాలని రైతుల డిమాండ్. ప్రభుత్వానికి, రైతులకు మధ్య ఎన్ని విడతలుగా చర్చలు జరిగినా ఒక ఫలవంతమైన ముగింపు రావడం లేదు. ఈలోపు వివిధ కారణాల వల్ల కనీసం 170 మంది ఉద్యమ రైతులు మరణించారని వస్తున్న వార్తలతో ప్రపంచం నలుమూలల నుంచి రైతుల డిమాండ్‌కు ట్వీట్ల ద్వారా మద్దతు లభిస్తోంది. స్వీడన్ నుంచి పర్యావరణ పరిరక్షణ ఉద్యమ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, బార్బడోస్ పాప్ గాయని రిహాన్నా వంటివారు రైతులకు తమ సంఘీభావం ప్రకటించారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. విదేశీ సానుభూతి పరులకు వ్యతిరేకం గా పెట్టిన ట్వీట్ ఆయన అభిమానుల ఆగ్రహానికి కారణం అయింది. ‘భారత్ తన సార్వభౌమాధికారం విషయంలో రాజీకి రానవసరం లేదు. బయటి శక్తులు వీక్షకులుగా ఉండొచ్చు కానీ, భాగస్వాములు కాదగరు’ అని థన్‌బర్గ్, రిహాన్నాలను ఉద్దేశించే సచిన్ ఆ ట్వీట్ పెట్టారు. ∙∙ నిప్పు జ్వాల గాలి దిశను బట్టి వ్యాíపిస్తుంది. ఆగ్రహ జ్వాల ఎటువైపు అధాటున మళ్లుతుందో ఎవరూ ఊహించలేరు. సచిన్‌ను ‘క్రికెట్ దేవుడు’ అని ఆరాధించిన ఆయన అభిమానులు.. రైతులకు మద్దతు ఇస్తున్న విదేశీయుల్ని సచిన్ ‘హద్దుల్లో ఉండండి’ అని అర్థం వచ్చేలా హెచ్చరించినందుకు ఆయనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిరసన నేరుగా లేదు. పరోక్షంగా ఉంది. పరోక్షంగా ఉన్నప్పటికీ శక్తిమంతంగా ఉంది. రష్యన్ టెన్నిస్ దిగ్గజం మారియా షరపోవా ఆరేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా ‘సచిన్ ఎవరో నాకు తెలియదు’ అని అన్నందుకు ఆగ్రహోదగ్రులైన భారతీయులు, ముఖ్యంగా మలయాళీలు షరపోవా ఫేస్బుక్ వాల్‌పై కూర్చొని ఆనాడు ఆమెను అనరాని మాటలు అన్నారు. చాలావరకు అవి భారతీయ భాషల్లో ఉన్నాయి కనుకు షరపోవాకు అర్థమయ్యే అవకాశం లేదు. ఇంగ్లిష్‌లో ఉన్న కామెంట్స్నైనా ఆమె పట్టించుకున్న దాఖలాలు లేవు. కాని ఇప్పుడు అదే సచిన్ అభిమానులు.. అదే షరపోవా ఫేస్ బుక్ వాల్ మీదకు వెళ్లి ఆమెకు సారీ చెబుతున్నారు. ‘మన్నించు మారియా, నువ్వన్నది కరెక్టే. అతడు మీకు తెలిసి ఉండాల్సినంత మనిషి కాదు’ అని పోస్ట్‌ల మీద పోస్ట్‌లు పెడుతున్నారు. ఒకరైతే.. ‘మారియా, ఇండియా రండి. నా రెస్టారెంట్లో మీ కోసం ప్రత్యేకంగా షవర్మా, కుళిమంతీ (బిర్యానీ) చేయించి పెడతాను’ అని ఆమెను ఆహ్వానించారు. నాడు మారియాపై పడిన రాళ్లే, ఇప్పుడు పూలుగా మారుతున్నాయి. ‘డియర్ మారియా, వి ఆర్ సారీ. సచిన్‌కి సపోర్ట్ చేస్తూ ఆనాడు మీపై సైబర్ అటాక్ చేసినందుకు బాధపడుతున్నాం’ అని ఒకరు; ‘మారియా, ఆరోజు నాకు పరిణతి లోపించింది. సచిన్ తెలియదు అన్నందుకు నిన్ను నానా మాటలు అన్నాను. నన్ను క్షమించు’ అని ఇంకొకరు పోస్టు పెట్టారు. ఒక మహిళ అయితే.. ‘సారీ సిస్టర్, యువర్స్ ట్రూలీ’ అంటూ షరపోవాకు లైకుల మీద లైకులు కొట్టారు. ఈ ప్రేమ జ్వాల అంతకంతకూ పెరిగిపోయి, సచిన్ ఉండే ముంబై మీదుగా రైతులు పోరాడుతున్న ఢిల్లీ వరకు వ్యాపించేలా మారియాపై పూల వర్షం కురుస్తోంది. ఆ పూల వానను రైతుల పోరాటానికి ఆశీస్సులనే అనుకోవాలి. రిహాన్నా, గ్రెటా థన్‌బర్గ్ -
రిహన్నా ట్వీట్.. గూగుల్‌లో ఏం సెర్చ్ చేశారంటే?
రైతుల నిరసనలపై స్పందించిన్పటి నుంచి ప్రముఖ పాప్ సింగర్ రిహన్నా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారారు. ప్రపంచ గాయని, నటి రిహన్నా భారత్‌లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు తెలుపుతున్న రైతులకు మద్దతుగా మంగళవారం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. "మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకోకూడదు?" అంటూ ఫార్మర్స్ ప్రొటెస్ట్ హ్యాష్ ట్యాగ్‌ను, ఓ మీడియాలో ప్రచురితమైన వార్తను జోడిస్తూ పోస్ట్ పెట్టారు. ఇక ఈ ట్వీట్ చేయడంతో రిహన్నా వైరల్‌గా మారారు. ఆమె ట్వీట్ చాలా సేపు ట్విట్టర్లో ట్రెండ్ అయ్యింది. కొంతమంది ఆమెకు మద్దతు తెలిపితే.. పూర్తి స్థాయి అవగాహన తర్వాత స్పందించాలని మరికొంతమంది హితవు పలికారు. చదవండి: కంగనాకు ట్విటర్ మరోసారి షాక్ ఇదిలా ఉండగా అన్నదాతల ఆందోళనలపై స్పందించడంతో రిహాన్నా గూగుల్లోనూ ట్రెండింగ్ మారారు. ఈ గాయని గురించి అనేకమంది నెటిజన్లు మొదటిసారి వినడంతో తన గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతతో గూగుల్‌లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. రిహన్నా ఎవరనే విషయంతోపాటు ఆమె మతం ఏంటని ఎక్కువగా శోధించారు. రిహన్నా పాకిస్తానీనా? ముస్లిమా కాదా అన్న విషయాన్ని ఎక్కువగా సెర్చ్ చేశారు. రిహన్నాతో పాటు, రైతుల నిరసనల గురించి ట్వీట్ చేసిన అనేక ఇతర అంతర్జాతీయ వ్యక్తులు గ్రేటా థన్‌బెర్గ్, హసన్ మిన్హాజ్, లిల్లీ సింగ్, జాన్ కుసాక్, అమండా సెర్నీ, మియా ఖలీఫా గురించి సెర్చ్ చేశారు. చదవండి: సెలబ్రిటీలపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా మాజీ అడల్ట్ స్టార్ మియా ఖలీఫా, ప్రముఖ పాప్ సింగర్ రిహానా, యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బర్గ్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మేనకోడలు, లాయర్ మీనా హారిస్ సహా పలువురు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే భారత్‌లో విభజన సృష్టించేందుకు కొందరు బయటి వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్, కరణ్ జోహార్, కంగనా రనౌత్, దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్, విరాట్, అనిల్ కుంబ్లే తదితరులు పిలుపునిచ్చారు. అంతేగాక రిహానా చేసిన ట్వీట్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘాటుగా కౌంటరిచ్చారు. భారతదేశ ఐకమత్యాన్ని ఇలాంటి ప్రచారాలు దెబ్బతీయలేవని..దేశ పురోగతిని అడ్డుకోలేవని అమిత్ షా స్పష్టం చేశారు. -
కంగనాకు ట్విటర్ మరోసారి షాక్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు ట్విటర్ మరోసారి షాకిచ్చింది. రైతుల ఆందోళనలపై కంగనా చేసిన రెండు ట్విట్లను ట్విటర్ తొలగించింది. నటి చేసిన ట్వీట్లు ద్వేషపూరితంగా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ.. ఆమె ట్వీట్లపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో పోస్టులను డిలీట్ చేసింది. ‘ట్విటర్ నిబంధనలు అతిక్రమించి కంగనా చేసిన పోస్టులపై మేము చర్చలు తీసుకుంటాన్నాం’ అని ట్విటర్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా గతంలోనూ కంగనా ట్విటర్‌ను కొన్ని గంటలపాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. కంగనాపై ట్విటర్ చర్యలు తీసుకోవడానికి ..ఢిల్లీలో రైతుల నిరసనలకు మద్దతిచ్చిన పాప్ సింగర్ రిహన్నాను టార్గెట్ చేస్తూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కారణం. ప్రముఖ పాప్ సింగర్ రిహన్నా భారత్‌లో రైతులు చేస్తున్న ఉద్యమంపై మంగళవారంస్పందించిన విషయం తెలిసిందే. ‘‘మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదు?’’ అంటూ రైతుల ఉద్యమంపై సీఎన్ఎన్ ప్రచురించిన కథనాన్ని ట్వీట్ చేశారు. చదవండి: రైతు ఉద్యమం: కేంద్రానికి బాలీవుడ్ స్టార్ల సపోర్ట్! అయితే మంగళవారం రిహన్నా ట్వీట్‌పై స్పందించిన కంగనా.. ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతులను ఉగ్రవాదులుగా పేర్కొటూ కంగనా ట్వీట్ చేసింది. వారు రైతులు కాదని దేశాన్నివి భజాలనుకుంటున్న టెర్రరిస్టులని వ్యాఖ్యానించింది. అంతేగాక రిహన్నాను ఫూల్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మరోవైపు నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. జనవరి 26న రైతులు చేపట్టిన గణతంత్ర పరేడ్ ఉద్రిక్తంగా మారడంతో దీక్షా శిబిరాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అలాగే ఫిబ్రవరి 6న మరోసారి భారీ ఎత్తున నిరసన ప్రదర్శనకు పిలుపునివ్వడం.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అన్నదాతల కదలికలపై కఠిన ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని రద్దు చేశారు. చదవండి: రైతు ఉద్యమంపై ట్వీట్ వార్ -
రైతుల కోసం రిహన్నా.. ఫూల్ అన్న కంగనా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే గణతంత్ర దినోత్సవం నాడు ఉద్యమం ఉద్రిక్తతంగా మారి హింస చేలరేగింది. ఇదిలా ఉండగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు రైతుల ఉద్యమానికి మద్దతునిస్తుండగా.. తాజాగా ఈ జాబితాలోకి హాలీవుడ్ పాప్ స్టార్ రిహన్నా చేరారు. ట్విట్టర్లో 100 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న రిహన్నా.. అన్నదాతలు చేస్తోన్న ఉద్యమంపై స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్లో రైతుల ఉద్యమానికి సంబంధించని ఓ న్యూస్ ఆర్టికల్ క్లిప్‌ని షేర్ చేస్తూ.. మనం ఎందుకు దీని గురించి మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు రిహన్నా. ఇక ఈ పేపర్ క్లిప్ సీఎన్‌ఎన్‌ది కాగా.. దీనిలో గణతంత్ర దినోత్సవ వేడుకల నాడు రైతు ఉద్యమం ఉద్రిక్తంగా మారడం.. హింస చేలరేగడంతో ఢిల్లీ చుట్టుపక్కల ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని తెలిపే కథనానికి సంబంధించింది. అలానే మయన్మార్‌లో ఆర్మీ దురగతాలను కూడా ప్రశ్నించారు రిహన్నా. (చదవండి: 6న దేశవ్యాప్త చక్కా జామ్) why aren’t we talking about this?! #FarmersProtest https://t.co/obmIlXhK9S — Rihanna (@rihanna) February 2, 2021 ఇక రిహన్నా ట్వీట్‌కు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ రిప్లై ఇచ్చారు. ‘‘దీని గురించి ఎవరు మాట్లాడటంలేదు ఎందుకంటే వారు దేశాన్ని విభజించాలని చూస్తోన్న ఉగ్రవాదులు. వీరు దేశాన్ని విభజిస్తే.. చైనా దాన్ని స్వాధీనం చేసుకుని అమెరికా లాంటి ఓ కాలనీని తయారు చేయాలని ఎదురు చూస్తోంది. నోర్మూసుకుని కూర్చో ఫూల్.. మీలాంటి డమ్మీలకు మా దేశాన్ని అమ్మం’’ అంటూ కంగనా ఘాటుగా రిప్లై ఇచ్చారు. No one is talking about it because they are not farmers they are terrorists who are trying to divide India, so that China can take over our vulnerable broken nation and make it a Chinese colony much like USA... Sit down you fool, we are not selling our nation like you dummies. https://t.co/OIAD5Pa61a — Kangana Ranaut (@KanganaTeam) February 2, 2021 ఇక రైతుల ఉద్యమానికి యువ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ మద్దతు తెలిపారు. భారతదేశంలోని రైతులకు సంఘీభావం తెలుపుతున్నాము అంటూ ట్వీట్ చేశారు. ఇక అమెరికా ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ కూడా రైతులకు మద్దతు తెలిపారు. -
వైరముత్తు అలాంటివాడే!
కొన్ని రోజులుగా వైరముత్తు తనతో పని చేసేవారి మీద లైంగిక వేధింపులు జరిపాడు అంటూ గాయని చిన్మయి పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఆరోపణలకు మద్దతు పలికారు సంగీత దర్శకుడు రెహమాన్ సోదరి, సంగీత దర్శకురాలు, నిర్మాత రైహానా. ‘‘వైరముత్తు అలాంటివాడే అన్న విషయం ఇండస్ట్రీలో ఓపెన్ సీక్రెట్. వైరముత్తు ఇలాంటి వాడు అన్న సంగతి రెహమాన్‌కి తెలియదు. ‘నిజమా? ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏంటి?’ అని రెహమాన్ నన్ను అడిగాడు. రెహమాన్ పుకార్లను పట్టించుకోడు. తన పనేంటో తను చేసుకుంటూ వెళ్తాడు. అలాగే కాంట్రవర్శీలు ఉన్నవాళ్లతో తను పనిచేయడు. మరి రెహమాన్ వీళ్లతో కలసి పనిచేయడా? అంటే.. అది తన ఇష్టం’’ అని పేర్కొన్నారు. చెడ్డవాడు హీరోయిన్ లేఖా వాషింగ్టన్ కూడా ‘మీటూ’ అంటూ పేరు చెప్పకుండా ఓ వ్యక్తిని ఆరోపించారు. శింబుతో కలసి లేఖ ‘కెట్టవన్’ అనే సినిమాలో యాక్ట్ చేయాల్సింది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ట్వీటర్లో ‘ఒకే ఒక్క పదం.. కెట్టవన్.. మీటూ’ అని ట్వీట్ చేశారు. అంటే.. ఆమె ఎవర్ని అన్నారో ఊహించడం ఈజీ. అన్నట్లు ‘కెట్టవన్’ అంటే చెడ్డవాడు అని అర్థం. -
నలుపేంటి?! తెలుపేంటి?!
ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. వేదిక మీదకు చక్కగా అలంకరించుకున్నచిన్నారి ఏంజిల్స్ ఒక్కొక్కరే వస్తున్నారు. చప్పట్ల మోతలో వెలుగుతున్న ముఖాలతో ముందుకు కదులుతున్నారు. వారిలో ఒకమ్మాయి రీనీ. ఫెయిరీ డ్రెస్‌లో ఉంది రీనీ. అందమైన డ్రెస్‌లో, వీపుకు రెక్కలు కట్టుకుని నడుస్తోంది. స్నిగ్ధత్వంతో కూడా ఆత్మవిశ్వాసం ఆమె ముఖంలో. గుంపులో నుంచి ఓ గొంతు... ‘నల్లటి ఫెయిరీని చూడండి’! ఆ మాటకంటే, ఆ మాట తర్వాత వినిపించిన నవ్వులే ఆమెను విపరీతంగా గాయపరిచాయి. కన్నీళ్లతో వేదిక దిగింది మూడేళ్ల రీనీ. మనదేశంలో తెల్లదనం మీదున్న విపరీతమైన వ్యామోహానికి పరాకాష్ట ఈ సంఘటన! ఆ రోజు... ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌తో ఎదురైన చేదు అనుభవంతో అక్కడే ఆగిపోయి ఉంటే... ఈ రోజు రీనీ గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండేది కాదు! అయితే రీనీ ఆగిపోలేదు. ఈ రోజు ప్రముఖ మోడల్. ఇటీవలే మొదలైన ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు రెండువేలకు పైగా ఫాలోవర్లున్నారు. గ్లామర్ ప్రపంచంలో నెగ్గుకురావడానికి ఒంటి రంగు కారణంగా ఎన్ని రకాలుగా వివక్షకు లోనయిందో పూసగుచ్చినట్లు చెప్తోందామె రీనీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో.చత్తీస్‌ఘర్‌లోని బగీచా గ్రామానికి చెందిన అమ్మాయి రీనీ కంజూర్. నలుపును తెలుపు చెయ్యడం గొప్పా!! మోడలింగ్ మీద రీనీ పెంచుకున్న అభిరుచిని చంపేయడానికి అడుగడుగునా ఒకరుండేవాళ్లు. ‘ఈ రంగం గురించి నీకు తెలియదు, ఇందులో రాణించాలంటే క్లయింట్స్ సంతృప్తి చెందాలి. నీ స్కిన్ కలర్ చూస్తే దగ్గరకు రానివ్వరు. మిగిలిన మోడల్స్ చూడు ఎలా ఉన్నారో’.. ఇలా మాటలు ఆమెను శరాఘాతంలా తాకాయి. ఒక ఫొటోగ్రాఫర్ అయితే... ‘ఆమెకు మూడు–నాలుగు టచప్లిచ్చి కొంచెం తెల్లగా కనిపించేట్టు చేయి’ అని రీనీకి తెలియకుండా మేకప్మన్కి చెప్పాడు. ఆ మేకప్‌మన్ కూడా ఫొటోగ్రాఫర్కంటే తక్కువ వాడేమీ కాదు. ‘నల్లగా ఉన్న అమ్మాయిని అందంగా చూపించడం పెద్ద చాలెంజ్, నా మేకప్ నైపుణ్యంతో ఆ పని చేయగలిగాను’ అన్నాడు. అది తెలిసి రీనీ బాధపడింది. ఇదిలా ఉంటే... తీసిన ఫొటోలను ఫొటోషాప్‌లో తెల్లగా చేసే ప్రయత్నం జరిగేది. ‘నన్ను నన్నులా ఉండనివ్వండి. నా ఒంటి రంగు ఉన్నదున్నట్లు్ల కనిపించమే నాకిష్టం, లేని తెల్లదనాన్ని అద్దవద్దు’ అని ఆమె ఎంత మొత్తుకున్నా ఎవరూ వినేవారు కాదు. రిహాన్నాతో పోలిక ఓ మలుపు మోడలింగ్‌లో రీనీకి ఎదురవుతున్న విమర్శలు, కామెంట్లతో పోరాడుతూనే ఆ రంగంలో కొనసాగుతున్న రీనీకి ఓ రోజు ఆమె ఫ్రెండ్స్ చెప్పిన మాట ఎక్కడ లేని ఉత్సాహాన్నిచ్చింది. ‘బార్బేడియన్ సింగర్ రిహాన్నా కూడా నీలాగే ఉంటుంది’ అని స్నేహితులు చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషించింది.రిహాన్నా గాయని మాత్రమే కాదు, పాటల రచయిత్రి, నటి, బిజినెస్ ఉమన్ కూడా. ఆ తర్వాత.. మేకప్ లేకుండా, ఫొటోగ్రఫీ మెళకువలతో తెల్లగా చేయకుండా యథాతథంగా రీనీని ఫొటోలు తీశారు స్నేహితులు. రీనీ, రిహాన్నా ఫొటోలను పక్క పక్కన పెట్టి ‘రిహాన్నాకు ఇండియన్ లుక్’ అని రీనీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో రీనీకి విపరీతమైన గుర్తింపు వచ్చింది. కలువలతో పోల్చడం తప్పు దేహఛాయ దేనికీ ప్రామాణికం కాదు, అందానికి అసలే కాదు. అసలైన అందం ఆత్మవిశ్వాసంలోనే ఉంటుంది. అందుకు నిదర్శనమే రీనీ, రిహాన్నా. నల్లగా ఉన్న అందమైన అమ్మాయిని ‘నల్ల కలువ’తో పోలుస్తారు. ఆ పోలిక మరింత అగౌరవపరచడమే. కలువ ఏ రంగులో ఉన్నా కలువే. కలువకు రంగును ఆపాదించకుండా... నల్లగా ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ... చర్మాన్ని తెల్లబరుచుకోవడానికి చేసే ప్రయత్నాలను నిరభ్యంతరంగా పక్కన పెట్టేయాలి. ఆ డబ్బుని, సమయాన్ని తమను తాము వ్యక్తిగా నిలబెట్టుకోవడానికి చేస్తే పరిపూర్ణత్వం వస్తుంది. అదే అసలైన అందం. రిహాన్నాను కలవడమే నా కల ఒకప్పుడు మోడలింగ్‌కి పనికిరావన్న ఫొటోగ్రాఫర్లే ఇప్పుడు క్లయింట్లతో ‘రిహాన్నాకు ఇండియన్ లుక్’ అని రీనీ గురించి చెప్తున్నారు. పాప్ స్టార్ రిహాన్నా అందగత్తె కాదని ఎవరూ అనలేరు, కాబట్టి రీనీని కూడా అందగత్తె కాదనే సాహసం చేయడంలేదెవ్వరూ ఇప్పుడు. ‘నలుపులో అందం ఉండదనే అభిప్రాయాలను మార్చుకోండి, ఇప్పటి వరకు మీరు అన్న మాటలను వెనక్కి తీసుకోండి’ అంటోంది రీనీ. రీనీ స్ఫూర్తితో ఇప్పుడు మోడలింగ్‌లోని సాంకేతిక నిపుణులు ఇప్పుడు వాళ్ల రూల్స్‌ని మార్చుకోవడానికి సిద్ధమయ్యారు. ‘తెల్లటి దేహ ఛాయలోనే అందం ఇమిడి ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా మార్చుకుంటున్నారు. ‘‘కొత్త నియమావళి రూపొందుతోందంటే మార్పు మొదలైనట్లే. ఒక మార్పుకు నేను కారణమైనందుకు సంతోషంగా ఉంది. దీనికంతంటకీ కారణమైన రిహాన్నాను కలవడమే ఇప్పుడు నా ముందున్న కల’ అంటోంది రీనీ. – మంజీర -
రూ. 900 కోట్లు ఆవిరయ్యాయి
న్యూఢిల్లీ : సోషల్‌మీడియా యాప్ స్నాప్ చాట్ సంపద భారీగా ఆవిరయ్యింది. కొద్దిరోజుల క్రితం పాప్ సింగర్ రిహన్నాపై ఉద్దేశించిన ఓ యాడ్‌ను స్నాప్‌చాట్ ప్రచురించింది. దీంతో రిహాన్నా ఫ్యాన్స్ స్నాప్‌చాట్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అంతేకాదు రిహన్నాపై యాడ్ తర్వాత స్నాప్ చాట్ రూ. 9 వేల కోట్ల నష్టపోయింది. తాజాగా స్నాప్‌చాట్ సహవ్యవస్థాపకుడు, సీఈవో ఇవాన్ సంపద రూ. 900 కోట్ల మేర ఆవిరయ్యింది. ఈ విషయాన్ని ఫోర్బ్ వెల్లడించింది. ప్రసుత్తం ఇవాన్ సంపద 3.8 బిలియన్ డాలర్లుగా ఉంది. 2009లో రిహన్నాపై ఆమె బాయ్‌ఫ్రెండ్ బ్రౌన్ దాడి చేయడాన్ని ఆధారంగా చేసుకొని స్నాప్‌చాట్ యాడ్‌ను రూపొందించారు. దీనిపై రిహన్నా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్నాప్‌చాట్ యాప్‌ను డిలీట్ చేయాల్సిందిగా ఆమె తన అభిమానులకు పిలుపునిచ్చారు. కాగా యాడ్‌పై స్నాప్‌చాట్ ఇప్పటికే రిహన్నాకు క్షమాపణలు చెప్పింది. -
బొద్దుగా మారిన గాయని..!!
ప్రముఖ పాప్ సింగర్ రిహాన్నా ఈ మధ్య కాస్తా బొద్దుగా మారింది. ఒకప్పుడు సన్నగా మెరుపుతీగలాగా ఉండే ఈ అమ్మడు ఇప్పుడు కొద్దిగా లావుగా మారడంపై సోషల్ మీడియాలో జోకులు, విమర్శలు వస్తున్నాయి. ఆమెపై కొందరు 'బాడీ షేమింగ్' కామెంట్స్ పెట్టారు. ఈ కామెంట్స్‌పై రిహాన్నా తెలివిగా సమాధానం ఇచ్చింది. ఆమె అభిమాని ఒకరు 2015నాటి వీడియోను షేర్ చేసి.. ఈ విమర్శలను ప్రస్తావించగా.. ఈ పోస్టుకు రిహాన్నా బదులిస్తూ.. 'ఎవరైనా నన్ను బాగా లావుగా ఉన్నారా?' అంటూ విరగబడి నవ్వే ఎమోజీలను పోస్టు చేసింది. రిహాన్నా తాజాగా 'వలేరియన్ అండ్ ద సిటీ ఆఫ్ ఏ థౌజండ్ ప్లానెట్స్' సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మంగళవారం ప్యారిస్‌కు వచ్చిన ఈ అమ్మడు కాస్తా బొద్దుగా కనిపించడంతో ఆమె బరువు పెరిగిందంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం తన శరీరాకృతి పట్ల సంతృప్తిగా ఉన్నానని ఆమె తన సన్నిహితుల వద్ద తెలిపినట్టు హాలీవుడ్ మీడియా చెప్తోంది. A post shared by badgalriri (@badgalriri) on Jul 26, 2017 at 12:06pm PDT -
ఆమెను పెళ్లిచేసుకోవాలనుకుంటున్నా..
గతకొంతకాలంగా ప్రణయసీమల్లో విహరిస్తున్న పాప్ సింగర్ రిహాన్నా, ర్యాపర్ డ్రాకే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా? అంటే సన్నిహిత వర్గాలు అవుననే అంటున్నాయి. రిహాన్నాను పెళ్లిచేసుకోవాలని డ్రాకే కృతనిశ్చయంతో ఉన్నాడంట. కొంతకాలం ప్రేమించుకొని ఆ తర్వాత విడిపోయి.. మళ్లీ ఇప్పుడు రొమాన్స్ చేసుకుంటున్న ఈ జంట తాజాగా ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డు వేడుకలో తమ మధ్య ఉన్న ప్రేమను చాటుకున్నారు. తాను రిహాన్నాతో ప్రేమలో ఉన్నట్టు 29 ఏళ్ల డ్రాకే ఈ వేడుకలో ప్రకటించాడు. ఇందుకు రిహాన్నా సిగ్గుపడుతూ తలూపింది. ఈ నేపథ్యంలో రిహాన్నాను పెళ్లి చేసుకోవాలని డ్రాకే కోరుకుంటున్నాడని, ఇద్దరూ పెళ్లికి సిద్ధంగా ఉన్నారని, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలన్నది వారే నిర్ణయం తీసుకుంటారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
వాళ్లతో ఇక నో డేటింగ్
కొత్త సంవత్సరం సందర్భంగా కొంతమంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. హాలీవుడ్ పాప్ స్టార్ రిహన్నా కూడా ఓ నిర్ణయం తీసుకుంది. క్రిస్ బ్రౌన్, డ్రేక్ లాంటి వ్యక్తులతో డేటింగ్ చేయకూడదన్నదే ఆ నిర్ణయం. ర్యాప్ సంగీత గాయకులుగా, నటులుగా క్రిస్, డ్రేక్లకు మంచి పేరుంది. ఓ ఏడాది పాటు క్రిస్తో వ్యవహారం నడిపిన రిహన్నా ఆ తర్వాత అతడి నుంచి విడిపోయింది. అనంతరం డ్రేక్‌తో ప్రేమలో పడిందామె. కొన్నాళ్లు బాగానే ఉన్నా క్రిస్ లాగానే డ్రేక్ కూడా తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లడానికి ఇష్టపడకపోవడంతో అతడి నుంచి కూడా రిహన్నా విడిపోయింది. అయితే, విడిపోయే ముందు బోల్డన్ని గొడవలు జరిగాయట. క్రిస్ అయితే రిహన్నా మీద చెయ్యి చేసుకున్నాడనే విషయం హాలీవుడ్లో మార్మోగిపోయింది. డ్రేక్ కూడా తక్కువేం తినలేదు. ఇతగాడు కూడా రిహన్నాను హింసించాడట. ఈ చేదు అనుభవాలతో ఇక పాప్ స్టార్స్‌తో డేటింగ్ చేయకూడదని రిహన్నా ఫిక్సయ్యింది. -
అందుకే బ్రేకప్!
తిరిగినన్ని రోజులూ తిరిగేసి... ప్రేయసి కరూచే ట్రాన్‌తో తెగదెంపులు చేసుకున్న క్రిస్ బ్రౌన్... ఇప్పుడామెపై మాటల బాణాలు సంధిస్తున్నాడు. విడిపోయిన ఇన్ని రోజులకు నోరు విప్పి బోరుమన్నాడు. ‘ప్రాణంగా చూసుకున్న నా ప్రేయసే నన్ను పదే పదే నిర్లక్ష్యం చేసింది. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి వంచించింది. అది నిజమైన ప్రేమ కాదని ఇప్పుడే అర్థమయింది. ర్యాపర్ డ్రేక్‌తో రహస్యంగా సహజీవనం చేసింది’ అని తెగ బాధపడిపోయాడు బ్రౌన్. విషయమేమంటే బర్బాడియన్ సింగర్ రిహానాతో డేటింగ్ చేస్తున్న సందర్భంలో కూడా బ్రౌన్ ఇదే తరహాలో డ్రేక్‌తో గొడవపడ్డాడు! -
పిల్లా ... నా బావనిస్తనే....
"నాకిష్టమైన టీమ్ గెలిస్తే నగ్నంగా ఊరేగుతా," "ఉగ్రవాదుల చెరనుంచి బాలికల్ని విడిపించేందుకు నన్ను నేను సమర్పించుకుంటా" వంటి బంపర్ ఆఫర్ల జాబితాలో ఇంకొకటి వచ్చి చేరింది. అర్జెంటీనా ప్రపంచకప్ గెలుచుకుంటే నా భర్తను వారం రోజుల పాటు పాప్ సింగర్ కి అరువు ఇస్తానని ఆఫర్ ఇచ్చింది అర్జెంటీనా గోల్ కీపర్ సెర్జియో రోమెరో భార్య ఎలియానా గుయెర్సియో. ఈ మేరకు ఆమె ఒక ట్వీట్ కూడా చేసింది. అసలు కథేమిటంటే సెమీఫైనల్ లో నెదర్లాండ్స్ ఆటగాళ్ల గోల్స్‌ను గోల్ కీపర్ రొమెరో సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఆ ఆట చూసిన పాప్ సింగర్ మనసు పారేసుకుని మెచ్చుకుంది. దాంతో అర్జెంటీనా గెలిస్తే నా భర్తను వారం పాటు అప్పిస్తానని ఎలియానా వాగ్దానం చేసేసింది. ఆదివారం ఫైనల్ మ్యాచ్ గెలిస్తే ఎలియానా వాగ్దానం నిలబెట్టుకుంటుందా లేక "అమ్మో నా బావనిస్తనా" అనేస్తుందో చూడాలి.