బొద్దుగా మారిన గాయని..!! | Rihanna responds to body-shamers | Sakshi
Sakshi News home page

బొద్దుగా మారిన గాయని.. విమర్శలకు రీప్లై!

Published Sun, Jul 30 2017 4:03 PM | Last Updated on Wed, Apr 3 2019 5:45 PM

బొద్దుగా మారిన గాయని..!! - Sakshi

బొద్దుగా మారిన గాయని..!!

ప్రముఖ పాప్‌ సింగర్‌ రిహాన్నా ఈ మధ్య కాస్తా బొద్దుగా మారింది. ఒకప్పుడు సన్నగా మెరుపుతీగలాగా ఉండే ఈ అమ్మడు ఇప్పుడు కొద్దిగా లావుగా మారడంపై సోషల్‌ మీడియాలో జోకులు, విమర్శలు వస్తున్నాయి. ఆమెపై కొందరు 'బాడీ షేమింగ్‌' కామెంట్స్‌ పెట్టారు. ఈ కామెంట్స్‌పై రిహాన్నా తెలివిగా సమాధానం ఇచ్చింది. ఆమె అభిమాని ఒకరు 2015నాటి వీడియోను షేర్‌ చేసి.. ఈ విమర్శలను ప్రస్తావించగా.. ఈ పోస్టుకు రిహాన్నా బదులిస్తూ.. 'ఎవరైనా నన్ను బాగా లావుగా ఉన్నారా?' అంటూ విరగబడి నవ్వే ఎమోజీలను పోస్టు చేసింది.

రిహాన్నా తాజాగా 'వలేరియన్‌ అండ్‌ ద సిటీ ఆఫ్‌ ఏ థౌజండ్‌ ప్లానెట్స్‌' సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మంగళవారం ప్యారిస్‌కు వచ్చిన ఈ అమ్మడు కాస్తా బొద్దుగా కనిపించడంతో ఆమె బరువు పెరిగిందంటూ సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం తన శరీరాకృతి పట్ల సంతృప్తిగా ఉన్నానని ఆమె తన సన్నిహితుల వద్ద తెలిపినట్టు హాలీవుడ్‌ మీడియా చెప్తోంది.  
 

 

A post shared by badgalriri (@badgalriri) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement