అందుకే బ్రేకప్!
తిరిగినన్ని రోజులూ తిరిగేసి... ప్రేయసి కరూచే ట్రాన్‌తో తెగదెంపులు చేసుకున్న క్రిస్ బ్రౌన్... ఇప్పుడామెపై మాటల బాణాలు సంధిస్తున్నాడు. విడిపోయిన ఇన్ని రోజులకు నోరు విప్పి బోరుమన్నాడు. ‘ప్రాణంగా చూసుకున్న నా ప్రేయసే నన్ను పదే పదే నిర్లక్ష్యం చేసింది. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి వంచించింది. అది నిజమైన ప్రేమ కాదని ఇప్పుడే అర్థమయింది. ర్యాపర్ డ్రేక్‌తో రహస్యంగా సహజీవనం చేసింది’ అని తెగ బాధపడిపోయాడు బ్రౌన్. విషయమేమంటే బర్బాడియన్ సింగర్ రిహానాతో డేటింగ్ చేస్తున్న సందర్భంలో కూడా బ్రౌన్ ఇదే తరహాలో డ్రేక్‌తో గొడవపడ్డాడు!