వాళ్లతో ఇక నో డేటింగ్ | Rihanna no more interested in dating rappers? | Sakshi
Sakshi News home page

వాళ్లతో ఇక నో డేటింగ్

Published Tue, Jan 6 2015 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

వాళ్లతో ఇక నో డేటింగ్

వాళ్లతో ఇక నో డేటింగ్

కొత్త సంవత్సరం సందర్భంగా కొంతమంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. హాలీవుడ్ పాప్ స్టార్ రిహన్నా కూడా ఓ నిర్ణయం తీసుకుంది. క్రిస్ బ్రౌన్, డ్రేక్ లాంటి వ్యక్తులతో డేటింగ్ చేయకూడదన్నదే ఆ నిర్ణయం. ర్యాప్ సంగీత గాయకులుగా, నటులుగా క్రిస్, డ్రేక్‌లకు మంచి పేరుంది. ఓ ఏడాది పాటు క్రిస్‌తో వ్యవహారం నడిపిన రిహన్నా ఆ తర్వాత అతడి నుంచి విడిపోయింది.
 
 అనంతరం డ్రేక్‌తో ప్రేమలో పడిందామె. కొన్నాళ్లు బాగానే ఉన్నా క్రిస్ లాగానే డ్రేక్ కూడా తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లడానికి ఇష్టపడకపోవడంతో అతడి నుంచి కూడా రిహన్నా విడిపోయింది. అయితే, విడిపోయే ముందు బోల్డన్ని గొడవలు జరిగాయట. క్రిస్ అయితే రిహన్నా మీద చెయ్యి చేసుకున్నాడనే విషయం హాలీవుడ్‌లో మార్మోగిపోయింది. డ్రేక్ కూడా తక్కువేం తినలేదు. ఇతగాడు కూడా రిహన్నాను హింసించాడట. ఈ చేదు అనుభవాలతో ఇక పాప్ స్టార్స్‌తో డేటింగ్ చేయకూడదని రిహన్నా ఫిక్సయ్యింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement