భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రేమల్లో పడినట్లు తెలుస్తోంది. ప్రముఖ సింగర్‌తో మన టీమిండియా స్టార్, హైదరాబాదీ డేటింగ్‌లో ఉన్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆమె బర్త్ డే వేడుకల్లోనూ సిరాజ్ కనిపించడంతో సోషల్ మీడియాలో రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఆ సింగర్ ఎవరో తెలుసుకుందాం.
ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఆశా భోంస్లే మనవరాలు జనాయి భోంస్లే ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ సిరాజ్ భాయ్ డేటింగ్‌లో ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఒకరినొకరు ఇన్‌స్టాలో ఫాలో అవుతుండడంతో ఈ రూమర్స్ మరింత వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పుట్టిన రోజు వేడుకల్లో మరో భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కూడా పాల్గొన్నారు.
కాగా.. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ సింగర్ జనాయి భోంస్లేకు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు జనాయి భోంస్లే విషయానికొస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. ఆమె ఆశా భోంస్లే కుమారుడైన ఆనంద్ భోంస్లే కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇటీవల జరిగిన పుట్టినరోజు వేడుకల్లో నటుడు జాకీ ష్రాఫ్, ఆశా భోంస్లే, సిద్ధేష్ లాడ్, సుయాష్ ప్రభుదేశాయ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయేషా ఖాన్, ముంజ్య స్టార్ అభయ్ వర్మ కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment