AP Dhillon Breaks Silence On Banita Sandhu Dating Rumours - Sakshi
Sakshi News home page

హీరోయిన్‌తో సింగర్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!

Published Mon, Aug 21 2023 8:25 PM | Last Updated on Mon, Aug 21 2023 9:07 PM

AP Dhillon Breaks Silence On Banita Sandhu Dating Rumours - Sakshi

బాలీవుడ్ హీరో  వరుణ్ ధావన్‌ సరసన అక్టోబర్‌ చిత్రం ద్వారా  సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన భామ బనితా సంధు. ఆమె విక్కీ కౌశల్ నటించిన సర్దార్ ఉదమ్‌లో కూడా నటించింది.  ఆ తర్వాత తమిళ చిత్రం ఆదిత్య వర్మలోనూ కనిపించింది.  అంతే కాకుండా సీడబ్ల్యూ సిరీస్ పండోరలో నటించింది.  అయితే తాజాగా ఆమె పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు బీటౌన్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేసిన పిక్స్‌తో ఈ రూమర్స్‌  మరింత ఊపందుకున్నాయి. 

(ఇది చదవండి: 'అశ్లీల వీడియోలు తీసి వేధించింది'.. హీరోయిన్‌పై సంచలన కామెంట్స్!)

ముంబయిలో ఇటీవల రిలీజైన డాక్యు-సిరీస్‌కు కూడా ఆమె హాజరైన బనితా సంధు అతని ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ముంబయిలోని హోటల్‌లో బనితా సంధు అతనితో ఉన్న సన్నిహిత ఫోటోలను కూడా పంచుకున్నారు. అంతే కాకుండా విత్ మీ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ జంట డేటింగ్‌లో ఉన్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

కాగా.. సింగర్ అమృత పాల్  సింగ్ ధిల్లాన్ అలియాస్ ఏపీ ధిల్లాన్ పంజాబీ సంగీతంలో బాగా పేరు సంపాదించారు. ఇండో-కెనడియన్ రాపర్‌గా అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదల చేసిన డాక్యుమెంటరీ సిరీస్, ఏపీ ధిల్లాన్: ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్‌తో మరింత ఫేమస్ అయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement