Chris Brown
-
మహిళకు బెదిరింపులు.. గాయకుడి అరెస్టు
తనను తుపాకితో బెదిరించాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో గాయకుడు క్రిస్ బ్రౌన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదకర ఆయుధంతో బెదిరించి, దాడి చేసిన నేరానికి గాను బ్రౌన్‌ను అరెస్టుచేస్తున్నట్లు లాస్ ఏంజెలిస్ పోలీసు డిపార్ట్మెంట్ (ఎల్ఏపీడీ)కి చెందిన లెఫ్టినెంట్ క్రిస్ రామిరెజ్ మీడియాకు తెలిపారు. లాస్ ఏంజెలిస్‌లోని టార్జానా ఎన్క్లేవ్ ప్రాంతంలోగల తన గేటెడ్ ఎస్టేట్‌నుంచి బయటకు రాబోయే ముందు బ్రౌన్ తనను తుపాకితో బెదిరించినట్లు ఆ మహిళ పోలీసులకు వివరించింది. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోందని రామిరెజ్ తెలిపారు. ఇప్పటికీ బ్రౌన్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయని, అందువల్ల ఆయుధాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని అప్పుడే ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు. ఇంతకుముందు కూడా ఇలాగే ఒక దాడి కేసులో ఇరుక్కున్నా.. తాను నిర్దోషినని చెప్పిన బ్రౌన్, ఈసారి అసలు ఇంట్లోంచి బయటకు వచ్చి పోలీసులతో మాట్లాడేందుకు కూడా అంగీకరించలేదు. ఆ తర్వాత ఆయన డిటెటక్టివ్లకు సహకరించారని రామిరెజ్ తెలిపారు. -
హీరో ఇంట్లోకి చొరబడ్డ లేడీ ఫ్యాన్.. అరెస్టు!
ఇప్పుడు 'ఫ్యాన్' మానియా కొనసాగుతున్నది. హీరోను వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టే ఓ అభిమాని కథతో షారుఖ్ ఖాన్ తాజాగా 'ఫ్యాన్' సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ అభిమానిపై తన బాడీగార్డ్ చేయిచేసుకోవడంతో బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్‌కుమార్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇదేవిధంగా హాలీవుడ్ సింగర్, నటుడు క్రిస్ బ్రౌన్కు ఓ మహిళా అభిమాని చుక్కలు చూపించింది. ఐదు నెలల్లో రెండోసారి సెక్యూరిటీ కళ్లు గప్పి తన ఇంట్లోకి చొరబడింది. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో డానియెల్లె ప్యాటీ అనే మహిళ.. లాస్ ఏంజిల్స్‌లోని ఆర్ అండ్ బి సింగర్ క్రిస్ (26) ఇంటి ముందు తచ్చాడుతూ కనిపించింది. ఆ సమయంలో ఓ సందర్శకుడి కోసం గేటు తీయగా.. అదే అదనుగా ఆమె లోపలికి చొరబడింది. ఆమెను గుర్తించిన సెక్యూరిటీ గార్డ్స్ .. మరింతగా ఆమె ఇంట్లోకి చొరబడకముందే అదుపులోకి తీసుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం కోర్టు ముందు హాజరుపరిచారు. క్రిస్ బ్రౌన్ అంటే పడిచచ్చే ప్యాటీ గత డిసెంబర్‌లోనూ ఆయన ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. రెండుసార్లు చేసిన తన చొరబాటు యత్నాల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని, తన అభిమాన హీరోను చూసేందుకే అలా చేశానని ప్యాటీ చెప్పింది. ఇక ఆమెపై ఎలాంటి కేసు నమోదుచేయవద్దంటూ పోలీసులను కోరాలని క్రిస్ భావిస్తున్నాడు. 'కిస్ కిస్' హిట్‌మేకర్ అయిన క్రిస్ బ్రౌన్‌తో డేటింగ్ చేస్తున్నానంటూ గతంలోనూ ప్యాటీ హల్చల్ చేసింది. -
అందుకే బ్రేకప్!
తిరిగినన్ని రోజులూ తిరిగేసి... ప్రేయసి కరూచే ట్రాన్‌తో తెగదెంపులు చేసుకున్న క్రిస్ బ్రౌన్... ఇప్పుడామెపై మాటల బాణాలు సంధిస్తున్నాడు. విడిపోయిన ఇన్ని రోజులకు నోరు విప్పి బోరుమన్నాడు. ‘ప్రాణంగా చూసుకున్న నా ప్రేయసే నన్ను పదే పదే నిర్లక్ష్యం చేసింది. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి వంచించింది. అది నిజమైన ప్రేమ కాదని ఇప్పుడే అర్థమయింది. ర్యాపర్ డ్రేక్‌తో రహస్యంగా సహజీవనం చేసింది’ అని తెగ బాధపడిపోయాడు బ్రౌన్. విషయమేమంటే బర్బాడియన్ సింగర్ రిహానాతో డేటింగ్ చేస్తున్న సందర్భంలో కూడా బ్రౌన్ ఇదే తరహాలో డ్రేక్‌తో గొడవపడ్డాడు!