మహిళకు బెదిరింపులు.. గాయకుడి అరెస్టు | Chris Brown arrested for threatening woman with gun | Sakshi
Sakshi News home page

మహిళకు బెదిరింపులు.. గాయకుడి అరెస్టు

Published Wed, Aug 31 2016 8:18 AM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM

Chris Brown arrested for threatening woman with gun

తనను తుపాకితో బెదిరించాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో గాయకుడు క్రిస్ బ్రౌన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదకర ఆయుధంతో బెదిరించి, దాడి చేసిన నేరానికి గాను బ్రౌన్‌ను అరెస్టుచేస్తున్నట్లు లాస్ ఏంజెలిస్ పోలీసు డిపార్ట్‌మెంట్ (ఎల్ఏపీడీ)కి చెందిన లెఫ్టినెంట్ క్రిస్ రామిరెజ్ మీడియాకు తెలిపారు. లాస్ ఏంజెలిస్‌లోని టార్జానా ఎన్‌క్లేవ్ ప్రాంతంలోగల తన గేటెడ్ ఎస్టేట్‌నుంచి బయటకు రాబోయే ముందు బ్రౌన్ తనను తుపాకితో బెదిరించినట్లు ఆ మహిళ పోలీసులకు వివరించింది.

దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోందని రామిరెజ్ తెలిపారు. ఇప్పటికీ బ్రౌన్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయని, అందువల్ల ఆయుధాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని అప్పుడే ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు. ఇంతకుముందు కూడా ఇలాగే ఒక దాడి కేసులో ఇరుక్కున్నా.. తాను నిర్దోషినని చెప్పిన బ్రౌన్, ఈసారి అసలు ఇంట్లోంచి బయటకు వచ్చి పోలీసులతో మాట్లాడేందుకు కూడా అంగీకరించలేదు. ఆ తర్వాత ఆయన డిటెటక్టివ్‌లకు సహకరించారని రామిరెజ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement