హీరో ఇంట్లోకి చొరబడ్డ లేడీ ఫ్యాన్‌.. అరెస్టు! | Police arrests Chris Brown fan for trespassing | Sakshi
Sakshi News home page

హీరో ఇంట్లోకి చొరబడ్డ లేడీ ఫ్యాన్‌.. అరెస్టు!

Published Sun, May 1 2016 4:08 PM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM

హీరో ఇంట్లోకి చొరబడ్డ లేడీ ఫ్యాన్‌.. అరెస్టు!

హీరో ఇంట్లోకి చొరబడ్డ లేడీ ఫ్యాన్‌.. అరెస్టు!

ఇప్పుడు 'ఫ్యాన్‌' మానియా కొనసాగుతున్నది. హీరోను వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టే ఓ అభిమాని కథతో షారుఖ్‌ ఖాన్‌ తాజాగా 'ఫ్యాన్‌' సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ అభిమానిపై తన బాడీగార్డ్‌ చేయిచేసుకోవడంతో బాలీవుడ్ యాక్షన్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇదేవిధంగా హాలీవుడ్ సింగర్‌, నటుడు క్రిస్‌ బ్రౌన్‌కు ఓ మహిళా అభిమాని చుక్కలు చూపించింది. ఐదు నెలల్లో రెండోసారి సెక్యూరిటీ కళ్లు గప్పి తన ఇంట్లోకి చొరబడింది.

గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో డానియెల్లె ప్యాటీ అనే మహిళ.. లాస్‌ ఏంజిల్స్‌లోని ఆర్‌ అండ్ బి సింగర్‌ క్రిస్‌ (26) ఇంటి ముందు తచ్చాడుతూ కనిపించింది. ఆ సమయంలో ఓ సందర్శకుడి కోసం గేటు తీయగా.. అదే అదనుగా ఆమె లోపలికి చొరబడింది. ఆమెను గుర్తించిన సెక్యూరిటీ గార్డ్స్‌ .. మరింతగా ఆమె ఇంట్లోకి చొరబడకముందే అదుపులోకి తీసుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం కోర్టు ముందు హాజరుపరిచారు. క్రిస్‌ బ్రౌన్‌ అంటే పడిచచ్చే ప్యాటీ గత డిసెంబర్‌లోనూ ఆయన ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. రెండుసార్లు చేసిన తన చొరబాటు యత్నాల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని, తన అభిమాన హీరోను చూసేందుకే అలా చేశానని ప్యాటీ చెప్పింది. ఇక ఆమెపై ఎలాంటి కేసు నమోదుచేయవద్దంటూ పోలీసులను కోరాలని క్రిస్ భావిస్తున్నాడు. 'కిస్‌ కిస్‌' హిట్‌మేకర్ అయిన క్రిస్‌ బ్రౌన్‌తో డేటింగ్ చేస్తున్నానంటూ గతంలోనూ ప్యాటీ హల్‌చల్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement