ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గ్రామీ’ అవార్డును భారత సంతతికి చెందిన అమెరికన్ సింగర్, వ్యాపారవేత్త చంద్రికా టాండన్ అందుకున్నారు. లాస్ ఏంజెలెస్ వేదికగా 67వ గ్రామీ అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన సింగర్స్‌తో పాటు సంగీత దర్శకులు పాల్గొని సందడి చేశారు. అయితే, చంద్రికా టాండన్(Chandrika Tandon) రూపొందించిన ‘త్రివేణి’ ఆల్బమ్ బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్‌గా అవార్డు దక్కించుకుంది. ఆమెకు గతంలో కూడా గ్రామీ అవార్డ్ వరించింది.
చెన్నైలో పెరిగిన చంద్రిక ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. పలు దేశాల్లో వ్యాపారవేత్తగా ఆమె రాణిస్తున్నారు. పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రా నూయీకి చంద్రిక సోదరి అవుతారని తెలిసిందే. చెన్నైలోని తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆమెకు చిన్నతనం నుంచే సంగీతంపై ఎక్కువ మక్కువ చూపారు . ఆమె తల్లి సంగీత విద్వాంసురాలు కావడంతో శిక్షణ తీసుకోవడంలో చంద్రికా టాండన్‌కు మరింత సులువు అయింది. వ్యాపార రంగంలో రాణిస్తూనే సంగీత ప్రపంచంలో ఎందరినో మెప్పిస్తున్నారు. తాజాగా ఆమెకు మరోసారి గ్రామీ-2025 (Grammy Awards 2025) అవార్డ్ దక్కడంతో అభిమానులతో పాటు కుటంబ సభ్యులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment