Grammy awards
-
వాహ్ ఉస్తాద్ వాహ్
పుట్టిన వెంటనే చెవిలో ‘కల్మా’ కాకుండా తబలా జతులు విన్నవాడు... మూడేళ్లకే తబలాను పసి వేళ్లతో మీటిన వాడు... ఏడేళ్లకు ప్రదర్శనలు ఇచ్చినవాడు...పన్నెండేళ్లకు ప్రపంచ యాత్రకు బయల్దేరినవాడు... మహా మహా విద్వాంసులకు సహ వాద్యగాడు... తనే స్వయంగా అద్వితీయ వాద్యకారుడు... తబలా ప్రపంచానికి ఈశ్వరుడు... దేవుడు... ఉస్తాద్ జాకీర్ హుసేన్.టీషర్ట్, జీన్స్ వేసుకుని ఆధునిక యువకుడిగా ఉంటూ సంప్రదాయ శాస్త్రీయ సంగీతాన్ని కుర్రకారుకు చేరువ చేసిన ఈ నవ యువ వాద్య మాంత్రికుడు కన్నుమూశాడు. అతను లేడు. అతనిలాంటి వాడు మరి రాడు. ఒక్కడే జాకిర్ హుసేన్.జాకిర్ హుసేన్ ప్రదర్శనలో ఎవరైనా ఇది చూడాలి. ఆయన తబలా మీద డమరుకాన్ని, శంఖాన్ని వినిపిస్తాడు. ‘ఎడమ’ మీద డమరుకం వినిపిస్తూ ‘కుడి’ని మీటి శంఖనాదాన్ని సృష్టిస్తాడు. ఆ శంఖనాద సమయంలో జాకిర్ హుసేన్ వేళ్లు ఎంత వేగంగా కదులుతాయంటే అవి కనపడవు. పైగా తబలాని తాకినట్టుగా కూడా ఉండవు. ఇలా వాయించడం అసాధ్యం. ‘ఇది ఎలా సాధించారు’ అని అనడిగితే ‘సాధన చేయాలి. తబలాతో స్నేహం చేయాలి. దాని మాటకు చెవి ఒగ్గాలి’ అంటాడు జాకిర్ హుసేన్. అంత వినమ్రంగా ఉండటం వల్లే ఆయన తన తబలాకు ప్రపంచమే చెవి ఒగ్గేలా చేయగలిగాడు. ‘ఉస్తాద్’ కాగలిగాడు. ‘మేస్ట్రో’ అనిపించుకున్నాడు.‘మీరు తబలా ఏ వయసులో నేర్చుకోవడం మొదలెట్టారు’ అని అడిగితే జాకిర్ హుసేన్ ఆశ్చర్యపోతాడు. ‘అదేం ప్రశ్న’ అంటాడు. నిజమే. అతను పుట్టిందే తబలా ఉన్న ఇంట్లో. జాకిర్ తండ్రి ఉస్తాద్ అల్లా రఖా జగమెరిగిన తబలా విద్వాంసుడు. మన దేశంలో తబలాకు ఔన్నత్యం తీసుకు వచ్చిన తొలి విద్వాంసుడు. ఆయనకు పెద్ద కొడుకుగా 1951లో ముంబైలో జన్మించాడు జాకిర్ హుసేన్. నర్సింగ్ హోమ్ నుంచి మరుసటిరోజు ఇంటికి తీసుకొస్తే ముస్లిం సంప్రదాయం ప్రకారం తండ్రి తన కొడుకు చెవిలో ‘కల్మా’ చదివి, పేరు పలికి లోపలికి తీసుకెళ్లాలి. కాని అల్లా రఖా జాకిర్ని తన చేతుల్లో తీసుకుని ‘ధాధా ధినా.. థాథా తునా’ అని తబలా జతులు వినిపించాడు. భార్య ‘ఇదేమిటండీ చోద్యం.. దైవ స్తోత్రం వినిపించక’ అనంటే ‘నా దైవం తబలాయే’ అని బదులిచ్చాడాయన. అలా జాకిర్‌కు పుట్టిన వెంటనే తబలా తెలిసింది. జాకిర్‌ను పడుకోబెట్టడానికి తండ్రి రోజూ ఒడిలోకి తీసుకుని తబలా జతులు వినిపిస్తూనే వెళ్లాడు. ఇలా మూడేళ్లు ఆ పసికందు మెదడులోకి తబలా మాత్రమే వెళ్లింది. మూడేళ్లు వచ్చేసరికి జాకిర్ తబలా వరకూ బుడిబుడి అడుగులు వేస్తూ వెళ్లి అత్యంత సహజంగా దానిని మీటాడు.జాకిర్ హుసేన్ తబలా యాత్ర మొదలైంది.మన దేశానికి స్వతంత్రం వచ్చే వరకూ శాస్త్రీయ సంగీతం ఆస్థానాల్లో, దర్బారుల్లో, శ్రీమంతుల మహళ్లలో ఉండిపోయింది. స్వతంత్రం వచ్చాక అవన్నీ వెళ్లి సంగీత కచ్చేరీలు మొదలయ్యాయి. అయితే వాటికి ఆదరణ అంతంత మాత్రమే ఉండేది. ఆ సమయంలో సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్, సరోద్ వాద్యకారుడు అలి అక్బర్ ఖాన్‌లాంటి వారు అమెరికాకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తూ మన దేశం తిరిగి వచ్చి అటెన్షన్ సంపాదించారు. ఆ తర్వాతి రోజుల్లో సంతూర్ పండిట్ శివకుమార్, వేణువు హరిప్రసాద్ చౌరాసియా కూడా పశ్చిమ దేశాలలోకి మన సంగీతాన్ని తీసుకెళ్లాడు. పండిట్ రవిశంకర్‌కు శాశ్వతంగా అల్లారఖా తబలాజోడిగా ఉండేవారు. అయితే అల్లా రఖాకు అనారోగ్యం వల్ల జాకిర్‌కు 19ఏళ్లు ఉండగా మొదటిసారి అమెరికా వెళ్లి రవి శంకర్‌కు సహ వాయిద్యం అందించే వీలు జాకిర్‌కు దక్కింది. మొదటిసారి అలా అమెరికాలో అడుగు పెట్టిన జాకిర్ జీవితంలో అత్యధిక కాలం అమెరికాలో ఉంటూ అక్కడినుంచే దేశ విదేశాలలో ప్రదర్శనలు ఇస్తూ తబలా వాదనలో ఉండే ఉత్కృష్ట ధ్వనిని ప్రపంచానికి వినిపించాడు. చివరకు అక్కడే– డిసెంబర్ 16 (సోమవారం) అంతిమ శ్వాస వదిలాడు.‘తబలాకు ఎప్పుడూ కాలు తగలనివ్వకు బాబూ. అది మన సరస్వతి’ అనేవారట ఉస్తాద్ అల్లారఖా. అందువల్ల జాకిర్ హడావిడి ప్రయాణాల్లో రైళ్లలో సీటు దొరక్కపోతే కింద కూచుని తబలాను ఒళ్లో జాగ్రత్తగా పెట్టుకునేవారు. ‘నేను తబలా నేర్చుకుంటాను’ అని ఏడేళ్ల వయసులో మొదటిసారి జాకిర్ తన తండ్రితో చెప్పినప్పుడు ఆ మరుసటి రోజు రాత్రి 3 గంట లకు నిద్ర లేపి సాధన మొదలేయించేవారట అల్లారఖా. రోజూ రాత్రి మూడు నుంచి ఉదయం 6 వరకు వారి సాధన సాగేది. ఆ తర్వాత స్కూల్ వెళ్లి సాయంత్రం మళ్లీ సాధన కొనసాగించేవాడు. ‘పండితులకు జన్మించే పిల్లలకు పోలిక ఉంటుంది. అల్లా రఖా కొడుకై ఉండి ఇంత సామాన్యంగా వాయిస్తున్నాడా అనంటే మా నాన్న పరువేంగాను. అందుకే నేను మరింత కష్టపడేవాణ్ణి’ అంటాడు జాకిర్. అంతేకాదు అన్ని మతాల సంగీతం నుంచి కూడా నేర్చుకోవడానికి చూశాడు. ‘నేను స్కూల్‌కు వెళ్లే దారిలో చర్చిలో సంగీతం వినేవాణ్ణి. గుడిలో వినిపించే భక్తి గీతాలు ఆలకించేవాణ్ణి. ప్రపంచంలో ఏ మతమూ ఇంకో మతంపైన జబర్దస్తీ చేయదు. ఏ మతమైనా చెప్పేది నీ పొరుగువారిని ప్రేమించమనే’ అంటాడు జాకిర్ హుసేన్. అందుకే జాకిర్ అన్ని మతాల, అన్ని ధోరణుల విద్వాంసులతో అతి సులువుగా కలిసిపోయి తన తబలాను వారి సంగీతానికి జత చేయగలిగారు. ముఖ్యంగా సంతూర్ శివకుమార్‌తో ఆయనకు సుదీర్ఘ స్నేహం సాగింది. కొన్నాళ్ల క్రితం శివకుమార్ మరణించినప్పుడు ఆయన అంత్యక్రియలకు హాజరైన జాకిర్ హుసేన్ దహన వాటిక నుంచి అందరూ వెళ్లిపోయినా తనొక్కడే మండుతున్న చితి పక్కన చాలా సేపు నిలబడిపోయి ఆ స్నేహితునికి అంతిమ వీడ్కోలు పలికాడు. ఈ భారతీయ హిందూ ముస్లిం శాస్త్రీయ సంగీత భాగస్వామ్యాన్ని జాకిర్ స్థిరంగా ప్రచారం చేశాడు. కొనసాగాలని కోరుకున్నాడు.బీటెల్స్ గ్రూప్ ద్వారా ఖ్యాతి గాంచిన గిటారిస్ట్ జార్జ్ హారిసన్ ‘లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్’ అనే ఆల్బమ్‌లో జాకిర్ భాగస్వామ్యాన్ని కోరడంతో 1973 నుంచి ఫ్యూజన్ సంగీతానికి ప్రచారం కల్పించసాగాడు జాకిర్ హుసేన్. అమెరికన్ జాజ్ మ్యుజీషియన్ జాన్ హ్యాండీ, ఐరిష్ గాయకుడు వాన్ మారిసన్, అమెరికన్ డ్రమ్మర్ మికీ హర్ట్లాంటి ప్రసిద్ధులతో యాభై ఏళ్ల క్రితమే పని చేయడం వల్ల జాకిర్ హుసేన్‌కి హద్దులు లేని ప్రచారం, ప్రశంస లభించాయి. గాత్ర సంగీతమైనా, వాద్య సంగీతమైనా, జుగల్బందీ అయినా, వ్యక్తిగత ప్రదర్శన అయినా, ఫ్యూజన్ అయినా జాకిర్ నీరు పాత్ర రూపు దాల్చినంత సులభంగా ఇమిడిపోయి కచ్చేరికి అందం, ఆనందం తెచ్చేవాడు. పొడవైన తన గుబురు జుత్తు గాలిలో ఊగేలా ఆయన సాగించే తబలా వాదనను చూడటానికి జనం విరగబడేవారు. ముచ్చటపడేవారు.జాకిర్ హుసేన్ మన దేశంలో ‘పద్మశ్రీ’తో గౌరవించబడ్డ (1988) అత్యంత పిన్న వయస్కుడు (అవార్డు ప్రకటించే సమయానికి). ఆ తర్వాత ఆయనకు ‘పద్మభూషణ్’, ‘పద్మవిభూషణ్’ వచ్చాయి. నాలుగుసార్లు ‘గ్రామీ’ గెలుచుకున్న ఏకైక భారతీయ సంగీతకారుడు. అంతేనా? అమెరికా ప్రభుత్వం కళ, సాంస్కృతిక రంగాల్లో ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక ఫెలోషిప్ ‘నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్’ జాకిర్‌ను వరించింది. జాకిర్ సినిమాలకు పని చేశాడు. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ‘వానప్రస్థం’ సినిమాకు పాటలు కంపోజ్ చేశాడు. లతా మంగేశ్కర్, ఆశా భోంస్లేల జీవితం ఆధారంగా తీసిన ‘సాజ్’ (1998)లో ఆశా భోంస్లే భర్త ఆర్.డి.బర్మన్ పాత్రలో కనిపించాడు. మంచి మాటగాడు, హాస్యప్రియుడు, భోజన ప్రియుడైన జాకిర్ హుసేన్ ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా ఉంటుంది. నవ్వులు ఉంటాయి. తబలా ఎలాగూ ఉంటుంది.గొప్ప సంగీతమయ ప్రపంచాన్ని సృష్టించి, శుభ నాదాలను జగత్తులోకి వదిలి సంగీతం ద్వారా శాంతము పొందమని కోరుతూ వీడ్కోలు తీసుకున్నాడు ఉస్తాద్ జాకిర్ హుసేన్. ప్రపంచ సంగీత ప్రియులు అతణ్ణి తలచుకుని కన్నీరు కారుస్తున్నారు. జాకిర్ ఆత్మ విశ్వ సంగీతంలో డోలలూగాలి.– కె -
Grammy Awards 2024: రీసౌండ్ చేసిన శక్తి బ్యాండ్.. 46 ఏళ్లలో తొలిసారి..
అంతర్జాతీయ వేదికపై మనవాళ్లు మరోసారి సత్తా చాటారు. సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల(Grammy Awards 2024)ను శక్తి మహదేవన్, జాకీర్ హుస్సేన్ ఎగరేసుకుపోయారు. వీరి బ్యాండ్‌లో రిలీజైన 'దిస్ మూమెంట్'కు బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్‌గా గ్రామీ పురస్కారం వరించింది. అలాగే పాస్‌తో పాట, ఆజ్ వి స్పీక్ ఆల్బమ్కుగానూ జాకీర్ హుస్సేన్(తబల), రాకేశ్ చౌరాసియా(ఫ్లూటు) మరో రెండు అవార్డులు గెలుచుకున్నారు. సోమవారం నాడు అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 69వ గ్రామీ అవార్డు వేడుకలు జరిగాయి. భారతీయ కళాకారులకు మూడు అవార్డులు రావడంతో అభిమానులు, సంగీత ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండోసారి గ్రామీ విజేత కాగా జాకీర్ హుస్సేన్ 2009లో గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్ట్ ఆల్బమ్కుగానూ తొలిసారి గ్రామీ పురస్కారం అందుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఏకంగా మూడు (ఇందులో రెండు రాకేశ్‌తో కలిసి తీసుకున్నవి) పురస్కారాలు అందుకోవడంతో ఆయన్ను అభినందిస్తున్నారు. 'గ్రామీ' అందుకున్న దిస్ మూమెంట్ పాటను శంకర్ మహదేవన్(సింగర్), జాన్ మెక్లాఫ్లిన్ (గిటార్), జాకీర్ హుస్సేన్ (తబలా), గణేశ్ రాజగోపాలన్ (వయోలిన్) వంటి ప్రతిభావంతులైన ఎనిమిది మంది ‘శక్తి’ బ్యాండ్ పేరిట కంపోజ్ చేశారు. శక్తి బ్యాండ్ ఏర్పడింది అప్పుడే! కాగా శక్తి బ్యాండ్ 1973లో ఏర్పాటైంది. మొదట్లో దీనికి మహావిష్ణు ఆర్కెస్ట్రా అన్న పేరు ఉండేది. వీరు భారతీయ సాంప్రదాయ సంగీతాన్ని ప్రధానంగా వాయించేవారు. అప్పట్లో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యాండ్ ఎన్నో కచేరీలు నిర్వహించింది. దాదాపు 46 ఏళ్ల తర్వాత అదే 'శక్తి' బ్యాండ్ పేరిట దిస్ మూమెంట్ అనే ఆల్బమ్ విడుదలైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతప్రియులను ఆకట్టుకుంది. ఈ ఆల్బమ్‌లో శ్రీని డ్రీమ్, బెండింగ్ రూల్స్, కరుణ, గిరిరాజ్ సుధ, మోహనం, లాస్ పల్మాస్, చంగై నైనో, సోనో మామ అనే పాటలు ఉన్నాయి. Congrats Best Global Music Album winner - 'This Moment' Shakti. #GRAMMYs 🎶 WATCH NOW https://t.co/OuKk34kvdu pic.twitter.com/N7vXftfaDy — Recording Academy / GRAMMYs (@RecordingAcad) February 4, 2024 చదవండి: 12th ఫెయిల్ దర్శకుడి భార్యపై కంగనా ఫైర్ -
గ్రామీ అవార్డ్స్: ‘శక్తి’ బ్యాండ్ సత్తా, దిగ్గజాల సెల్ఫీ వైరల్
#AR Rahmancelebrates 'Raining Grammys'ప్రతిష్టాత్మక 66వ వార్షిక గ్రామీ అవార్డులు 2024లో భారత్ సత్తా చాటింది. ఫ్యూజన్ బ్యాండ్ 'శక్తి'కి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు దక్కింది. అంతర్జాతీయ సంగీత వేదికపై భారతీయ దిగ్గజ సంగీత విద్వాంసులు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్ , సెల్వగణేష్ వయోలిన్ విద్వాంసుడు గణేష్ రాజగోపాలన్‌తో కూడిన సూపర్ గ్రూప్ ‘శక్తి’ బ్యాండ్ అవార్డును దక్కించుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ బృందంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ ఆల్బమ్ ద్వారా నలుగురు గొప్ప భారతీయ సంగీతకారులకు ప్రపంచఖ్యాతి దక్కడం విశేషం శక్తి బ్యాండ్ ఆవిర్భావం మహావిష్ణు ఆర్కెస్ట్రా రద్దు తరువాత 1973లో ఫ్యూజన్ బ్యాండ్, శక్తి బ్యాండ్ ఏర్పడింది. ఇందులో ఉస్తాద్ జాకీర్ హుస్సేన్(తబ్లా) ప్రముఖ సింగర్ శంకర్ హదేవన్,గిటారిస్ట్ జాన్ మెక్లాఫ్లిన్, వి సెల్వగణేష్ , వయోలనిస్ట్ గణేష్ రాజగోపాలన్ వంటి ప్రఖ్యాత కళాకారులున్నారు. చాలా ఏళ్ల తరువాత 2020లో దీన్ని సంస్కరించారు. అలాగే మూడేళ్ల తరువాత తొలి ఆల్బమ్ ‘దిస్ మూమెంట్’జూన్ 23, 2023లో రిలీజ్ అయింది. తాజా ఆల్బమ్‌లో శ్రీనిస్ డ్రీమ్, బెండింగ్ ద రూల్స్, కరుణ, గిరిరాజ్ సుధ, మోహనం, లాస్ పాల్మాస్‌తో సహా 8 ట్రాక్‌లు ఉన్నాయి. గ్రామీ అవార్డుపై శుభాకాంక్షలు తెలిపిన అస్కార్ విన్నర్ మ్యూజిక్ మాస్ట్రో ఏర్ రెహమాన్ ఇండియాకు గ్రామీ అవార్డుల వర్షం కురుస్తోందంటూ ఇన్‌స్టాలో ఒక సెల్ఫీని పోస్ట్ చేశారు. మాజీ గ్రామీ విజేత కూడా అయిన రెహ్మాన్, శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ ,వితో కలిసి ఉన్న సెల్ఫీని షేర్ చేశారు. అటు గ్రామీ అవార్డును గెలుచుకున్న సందర్భంగా శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్, సంగీత కుటుంబానికి, ఫ్యాన్స్‌తోపాటు భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. View this post on Instagram A post shared by ARR (@arrahman) మరోవైపు మూడుసార్లు గ్రామీ అవార్డును దక్కించుకున్న ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ శంకర్ మహదేవన్ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారిని అభినందనల్లో ముంచెత్తారు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఘనాపాటీ ఫ్లూట్ ప్లేయర్ రాకేష్ చౌరాసియాతో కలిసి రెండవ గ్రామీని గెలుచుకున్నారని పేర్కొన్నారు .దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. SHAKTI wins a #GRAMMYs #GRAMMYs2024 !!! Through this album 4 brilliant Indian musicians win Grammys!! Just amazing. India is shining in every direction. Shankar Mahadevan, Selvaganesh Vinayakram, Ganesh Rajagopalan, Ustad Zakhir Hussain. Ustad Zakhir Hussain won a second Grammy… pic.twitter.com/dJDUT6vRso — Ricky Kej (@rickykej) February 4, 2024 లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో శక్తి బ్యాండ్‌కు చెందిన పాష్టో పాట ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్‌గా గౌరవనీయమైన గ్రామీ అవార్డును సొంతం చేసుకుంది. పాష్టోకు చెందిన యాస్ వి స్పీక్ ఉత్తమ సమకాలీన వాయిద్య ఆల్బమ్ అవార్డు కూడా గెలుచుకుంది. అంతేకాదు మూడుసార్లు గ్రామీ అవార్డును దక్కించుకున్న ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ శంకర్ మహదేవన్ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి, ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
Dua Lipa: ప్చ్... ఒక్కరూ గుర్తుపట్టలేదు!
సినిమా లేదా టీవీలో నటించే చిన్న ఆర్టిస్ట్ కనిపించినా జనాలు చుట్టుముట్టి ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటారు. అలాంటిది ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న ఆర్టిస్ట్ కనిపిస్తే? ‘జనాలను అదుపు చేయడం కష్టం’ అనుకుంటాం గానీ పాప్ సెన్సేషన్ దువా లిపా విషయంలో మాత్రం అలా జరగలేదు. సాధారణ పర్యాటకురాలిగా దువా ఇటీవల రాజస్థాన్‌కు వచ్చింది. సాదాసీదాగా రోడ్లమీద నడుచుకుంటూ వెళుతున్న దువా లిపాను ఒక్కరు కూడా గుర్తు పట్టలేదు. తాను రాజస్థాన్‌లో ఉన్నప్పటి ఫొటోలను ఆమె ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తే వైరల్ అయ్యాయి. ‘ఎంత మిస్ అయ్యాను. విషయం ముందే తెలిస్తే రెక్కలు కట్టుకొని అక్కడ వాలేవాళ్లం’ అంటూ అభిమానులు భారీగా స్పందించారు. గ్రామీ అవార్డ్–విన్నింగ్ ఆర్టిస్ట్, గ్లోబల్ స్టార్ స్టేటస్ ఉన్న దువా లిపా మాత్రం తనను ఎవరూ గుర్తించకపోవడాన్ని పెద్ద విషయం అనుకోవడం లేదు. -
ప్రియాంక ఫొటో నాకు బాగా నచ్చింది: నటి
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. అమెరికాలోని లాస్ఏంజెల్స్లో గ్రామీ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్లో ప్రియాంక అందాలను ఆరబోస్తూ దుస్తులను ధరించింది. అయితే భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్రియాంక అలాంటి దుస్తులతో హాజరవడమేంటని ఆమెకు నెటిజన్లు క్లాసు పీకుతున్నారు. ప్రముఖ డిజైనర్ వెండల్ రాడ్రిక్స్ సైతం ఆమె వేసుకున్న దుస్తులను విమర్శించాడు. ‘కొన్ని రకాల బట్టలు ఏ వయసులో వేసుకోవాలో ఆ ఏజ్‌లో మాత్రమే ధరించాల’ని మండిపడ్డాడు. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో అతను ఆ పోస్ట్‌ను తొలగించాడు. ప్రియాంక డ్రెస్సును మాత్రమే విమర్శించానని, ఆమెను కాదని వివరణ ఇచ్చాడు. ప్రియాంక చోప్రా డ్రెస్సుపై పెద్ద ఎత్తున విమర్శలు చేయడంపై బాలీవుడ్ నటి సుచిత్ర కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రియాంకను విమర్శిస్తున్న వారికి గట్టిగా కౌంటర్ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమెకు మద్దతు తెలిపింది. ‘ప్రియాంక గురించి వెండల్ రాడ్రిగస్ అలా మాట్లాడటం బాధాకరం. నాకు తెలిసినంతవరకు ప్రియాంక.. తన బెల్లీని దుస్తులతో కప్పిపుచ్చాలనుకోలేదు. అదే ఆమెను రాక్‌స్టార్‌గా మార్చింది. ఆమె ఆత్మవిశ్వాసం ప్రతీ మహిళకు ప్రేరణగా నిలుస్తుంది. దేవుడు మమ్మల్ని ఎలా పుట్టించాడో అలానే ఉంటాం.. కానీ పురుషులు ఊహించుకునేట్టుగా మేం కనిపించం. ముందు మీ బుద్ధి మార్చుకోండి. ఓ విషయం.. నేను ప్రియాంక అభిమానిని కాదు. కానీ ఆమె ఫొటో నాకు ఎంతగానో నచ్చింద’ని పేర్కొంది. చదవండి: కాలిఫోర్నియా బీచ్‌లో గ్లోబల్ జంట చక్కర్లు -
వాటిని బాయ్ ఫ్రెండ్ చేత క్లీన్ చేయిస్తాడట!
లండన్: సంగీత రంగంలో పలు విభాగాల్లో ఇచ్చే గ్రామీ అవార్డులను దక్కించుకోవడం పట్ల సింగర్, లిరిక్స్ రైటర్ సామ్ స్మిత్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. 57వ ‘గ్రామీ’ అవార్డుల ప్రధానోత్సవంలో స్మిత్ నాలుగు అవార్డులను దక్కించుకున్నాడు. అయితే ఈ అవార్డులను తన తదుపరి బోయ్ ఫ్రెండ్ చేత క్లీన్ చేయిస్తానంటున్నాడు స్మిత్. గత కొన్ని నెలల క్రితం తన బాయ్ ఫ్రెండ్ జోనాథన్ జీజిల్ తో స్మిత్ తెగతెంపులు చేసుకున్నసంగతి తెలిసిందే. తనను స్వలింగ్ సంపర్కునిగా (గే) ప్రకటించుకున్న అనంతరం స్మిత్-జీజిల్ ల సంబంధాలు బెడిసికొట్టాయి. ' నేను గ్రామీ అవార్డుల కార్యక్రమానికి ఒంటరిగానే వెళ్లాను. కనీసం గ్రామీ అవార్డులను నా నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ చేత పాలిష్ చేయిస్తా' అంటూ జోక్ పేల్చాడు స్మిత్.