ప్రియాంక ఫొటో నాకు బాగా నచ్చింది: నటి | Suchitra Krishnamoorthi Supports Priyanka Chopras Grammy Dress | Sakshi
Sakshi News home page

ప్రియాంక చోప్రాపై నెటిజన్ల ఫైర్‌.. మద్దతు పలికిన నటి

Jan 29 2020 8:25 PM | Updated on Jan 29 2020 8:56 PM

Suchitra Krishnamoorthi Supports Priyanka Chopras Grammy Dress - Sakshi

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రాను సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో గ్రామీ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్‌లో ప్రియాంక అందాలను ఆరబోస్తూ దుస్తులను ధరించింది. అయితే భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్రియాంక అలాంటి దుస్తులతో హాజరవడమేంటని ఆమెకు నెటిజన్లు క్లాసు పీకుతున్నారు. ప్రముఖ డిజైనర్‌ వెండల్‌ రాడ్రిక్స్‌ సైతం ఆమె వేసుకున్న దుస్తులను విమర్శించాడు. ‘కొన్ని రకాల బట్టలు ఏ వయసులో వేసుకోవాలో ఆ ఏజ్‌లో మాత్రమే ధరించాల’ని మండిపడ్డాడు. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో అతను ఆ పోస్ట్‌ను తొలగించాడు. ప్రియాంక డ్రెస్సును మాత్రమే విమర్శించానని, ఆమెను కాదని వివరణ ఇచ్చాడు.

ప్రియాంక చోప్రా డ్రెస్సుపై పెద్ద ఎత్తున విమర్శలు చేయడంపై బాలీవుడ్‌ నటి సుచిత్ర కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రియాంకను విమర్శిస్తున్న వారికి గట్టిగా కౌంటర్‌ ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమెకు మద్దతు తెలిపింది. ‘ప్రియాంక గురించి వెండల్‌ రాడ్రిగస్‌ అలా మాట్లాడటం బాధాకరం. నాకు తెలిసినంతవరకు ప్రియాంక.. తన బెల్లీని దుస్తులతో కప్పిపుచ్చాలనుకోలేదు. అదే ఆమెను రాక్‌స్టార్‌గా మార్చింది. ఆమె ఆత్మవిశ్వాసం ప్రతీ మహిళకు ప్రేరణగా నిలుస్తుంది. దేవుడు మమ్మల్ని ఎలా పుట్టించాడో అలానే ఉంటాం.. కానీ పురుషులు ఊహించుకునేట్టుగా మేం కనిపించం. ముందు మీ బుద్ధి మార్చుకోండి. ఓ విషయం.. నేను ప్రియాంక అభిమానిని కాదు. కానీ ఆమె ఫొటో నాకు ఎంతగానో నచ్చింద’ని పేర్కొంది.
చదవండి: కాలిఫోర్నియా బీచ్‌లో గ్లోబల్‌ జంట చక్కర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement