అంతర్జాతీయ వేదికపై మనవాళ్లు మరోసారి సత్తా చాటారు. సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల(Grammy Awards 2024)ను శక్తి మహదేవన్, జాకీర్ హుస్సేన్ ఎగరేసుకుపోయారు. వీరి బ్యాండ్‌లో రిలీజైన 'దిస్ మూమెంట్'కు బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్‌గా గ్రామీ పురస్కారం వరించింది. అలాగే పాస్తో పాట, ఆజ్ వి స్పీక్ ఆల్బమ్‌కుగానూ జాకీర్ హుస్సేన్(తబల), రాకేశ్ చౌరాసియా(ఫ్లూటు) మరో రెండు అవార్డులు గెలుచుకున్నారు. సోమవారం నాడు అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 69వ గ్రామీ అవార్డు వేడుకలు జరిగాయి. భారతీయ కళాకారులకు మూడు అవార్డులు రావడంతో అభిమానులు, సంగీత ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రెండోసారి గ్రామీ విజేత
కాగా జాకీర్ హుస్సేన్ 2009లో గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్ట్ ఆల్బమ్‌కుగానూ తొలిసారి గ్రామీ పురస్కారం అందుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఏకంగా మూడు (ఇందులో రెండు రాకేశ్‌తో కలిసి తీసుకున్నవి) పురస్కారాలు అందుకోవడంతో ఆయన్ను అభినందిస్తున్నారు. 'గ్రామీ' అందుకున్న దిస్ మూమెంట్ పాటను శంకర్ మహదేవన్(సింగర్), జాన్ మెక్‌లాఫ్లిన్ (గిటార్), జాకీర్ హుస్సేన్ (తబలా), గణేశ్ రాజగోపాలన్ (వయోలిన్) వంటి ప్రతిభావంతులైన ఎనిమిది మంది ‘శక్తి’ బ్యాండ్ పేరిట కంపోజ్ చేశారు.
శక్తి బ్యాండ్ ఏర్పడింది అప్పుడే!
కాగా శక్తి బ్యాండ్ 1973లో ఏర్పాటైంది. మొదట్లో దీనికి మహావిష్ణు ఆర్కెస్ట్రా అన్న పేరు ఉండేది. వీరు భారతీయ సాంప్రదాయ సంగీతాన్ని ప్రధానంగా వాయించేవారు. అప్పట్లో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యాండ్ ఎన్నో కచేరీలు నిర్వహించింది. దాదాపు 46 ఏళ్ల తర్వాత అదే 'శక్తి' బ్యాండ్ పేరిట దిస్ మూమెంట్ అనే ఆల్బమ్ విడుదలైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతప్రియులను ఆకట్టుకుంది. ఈ ఆల్బమ్‌లో శ్రీని డ్రీమ్, బెండింగ్ రూల్స్, కరుణ, గిరిరాజ్ సుధ, మోహనం, లాస్ పల్మాస్, చంగై నైనో, సోనో మామ అనే పాటలు ఉన్నాయి.
Congrats Best Global Music Album winner - 'This Moment' Shakti. #GRAMMYs 🎶
— Recording Academy / GRAMMYs (@RecordingAcad) February 4, 2024
WATCH NOW https://t.co/OuKk34kvdu pic.twitter.com/N7vXftfaDy
Comments
Please login to add a commentAdd a comment