Los Angeles county
-
భారత సంతతి సింగర్‌ను వరించిన గ్రామీ అవార్డ్
ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గ్రామీ’ అవార్డును భారత సంతతికి చెందిన అమెరికన్ సింగర్, వ్యాపారవేత్త చంద్రికా టాండన్ అందుకున్నారు. లాస్ ఏంజెలెస్ వేదికగా 67వ గ్రామీ అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన సింగర్స్‌తో పాటు సంగీత దర్శకులు పాల్గొని సందడి చేశారు. అయితే, చంద్రికా టాండన్(Chandrika Tandon) రూపొందించిన ‘త్రివేణి’ ఆల్బమ్ బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్‌గా అవార్డు దక్కించుకుంది. ఆమెకు గతంలో కూడా గ్రామీ అవార్డ్ వరించింది.చెన్నైలో పెరిగిన చంద్రిక ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. పలు దేశాల్లో వ్యాపారవేత్తగా ఆమె రాణిస్తున్నారు. పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రా నూయీకి చంద్రిక సోదరి అవుతారని తెలిసిందే. చెన్నైలోని తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆమెకు చిన్నతనం నుంచే సంగీతంపై ఎక్కువ మక్కువ చూపారు . ఆమె తల్లి సంగీత విద్వాంసురాలు కావడంతో శిక్షణ తీసుకోవడంలో చంద్రికా టాండన్‌కు మరింత సులువు అయింది. వ్యాపార రంగంలో రాణిస్తూనే సంగీత ప్రపంచంలో ఎందరినో మెప్పిస్తున్నారు. తాజాగా ఆమెకు మరోసారి గ్రామీ-2025 (Grammy Awards 2025) అవార్డ్ దక్కడంతో అభిమానులతో పాటు కుటంబ సభ్యులు శుభాకాంక్షలు చెబుతున్నారు. -
హాలీవుడ్ హిల్స్ పైనా వేగంగా వ్యాపించిన అగ్ని కీలలు
-
అక్కడ ఆన్లైన్ ఆర్డర్ పెడితే.. కస్టమర్‌కి చేరేది కష్టమే! ఎందుకో తెలుసా?
లాస్ ఏంజెల్స్.. టీవీ, సినీ రంగాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన నగరం. ప్రత్యేకించి ఇక్కడుండే హాలీవుడ్ సైన్ గురించి చెప్పనక్కర్లేదు కదా. అలాంటి నగరం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా కూడా!. ముఖ్యంగా రైల్వే ట్రాకులపై చోరీలతో అమెజాన్‌లాంటి ఈ-కామర్స్ సైట్లు, రైల్వే ఆపరేట్లు విపరీతంగా నష్టపోతున్నారు. లాస్ ఏంజెల్స్ కౌంటీ రైల్వే ప్యాసింజర్లతో ఉండే బిజీ రూట్. దీంతో గూడ్స్‌తో వెళ్లే రైళ్లను ఈ మార్గంలో చాలాసేపు నిలిపేస్తారు. ఇదే అదనుగా నేరస్థులు చెలరేగిపోతున్నారు. కంటెయినర్లను బద్ధలు కొట్టి.. అందులోని పార్శిల్స్‌ను ఎత్తుకెళ్లిపోతున్నారు. రమారమీ 2021లో ఇలా పార్శిల్స్‌ను ఎత్తుకెళ్లడం ద్వారా వాటిల్లిన నష్టం 5 మిలియన డాలర్ల( సుమారు 37 కోట్ల రూపాయలకు) అంచనా వేసింది ఈ రూట్లో రైళ్లు నడిపించే యూనియన్ ఫసిఫిక్. తాజాగా శుక్రవారం ఓ భారీ చోరీ చోటు చేసుకోగా.. పోస్టల్ శాఖ పార్శిల్స్‌తో పాటు అమెజాన్, ఫెడ్ఎక్స్, టార్గెట్, యూపీఎస్ లాంటి ఈ-కామర్స్ కంపెనీల పార్శిల్స్ సైతం చోరీకి గురైనట్లు బయటపడింది. అంతేకాదు చోరీ తర్వాత ఆ బాక్స్‌లను పట్టాలపైనే పడేసి.. వాటిలో చాలావరకు డబ్బాలను కాల్చి పడేశారు కూడా. కొత్తేం కాదు.. లాస్ ఏంజెల్స్ రైల్వే రూట్లో దొంగతనాలు ఈమధ్య కాలంలో జరుగుతున్నవేం కాదు. 2020 సెప్టెంబర్ నుంచి లాస్ ఏంజెల్స్ కౌంటీలో దొంగతనాల శాతం 160 మేర పెరిగిందని యూనియన్ ఫసిఫిక్ (రైల్వే ఆపరేటర్) చెబుతోంది. కరోనా టైం నుంచి ఈ నేరస్థులు చెలరేగిపోతున్నారు. పార్శిల్స్‌ను మోసుకెళ్లడం కష్టమవుతుందనే ఉద్దేశంతో వాటిని అక్కడే చించేసి.. కేవలం అందులోని వాటిని తీసుకెళ్తున్నారు. తక్కువ ధరలకే బయట అమ్మేసుకుంటున్నారు. కొవిడ్-19 టెస్ట్ కిట్స్, ఫర్నీఛర్, మందులు.. చోరీకి గురవుతున్న వాటిలో ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా క్రిస్మస్, న్యూఇయర్ టైంలో ఈ తరహా చోరీలు ఎక్కువగా జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆ సీజన్లో సగటున రోజుకి 90కి పైగా కంటెయినర్లను ధ్వంసం చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యూనియన్ పసిఫిక్ ఆ రైల్వే రూట్లో భద్రత కట్టుదిట్టం చేసింది. డ్రోన్ పర్యవేక్షణతో పాటు అదనపు భద్రతా సిబ్బందిని ట్రాక్‌ల వెంట కాపలా కోసం నియమించుకుంది. ఈ క్రమంలో వంద మంది నేరగాళ్లను అదుపులోకి సైతం తీసుకున్నట్లు యూనియన్ పసిఫిక్ చెప్తోంది. అంతేకాదు కాలిఫోర్నియా అటార్నీకి సైతం ఇలాంటి నేరాల్లో శిక్ష తక్కువ విధించడంపై సమీక్ష చేయాలంటూ కోరింది యూనియన్ పసిఫిక్ రైల్వే. చదవండి: ఒమిక్రాన్ అలర్ట్.. ఉద్యోగులకు వార్నింగ్! -
మేయర్‌ను కాల్చి చంపిన భార్య
లాస్ ఏంజిల్స్: లాస్ఏంజిల్స్ కౌంటీలోని బెల్ గార్డెన్స్ మేయర్ డానియేల్ క్రెస్పో(45) పై ఆయన భార్య లీవెట్టి (43) తుపాకీతో విచక్షణరహితంగా కాల్పులు జరిపింది. దీంతో ఆయన రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఆయన్ని ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో మేయర్ డానియేల్ క్రెస్పో మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం ... డానియేల్ క్రెస్పో ఆయన భార్య లీవెట్టి మధ్య నిన్న బెడ్ రూమ్‌లో స్వల్ప వివాదం చోటు చేసుకుంది. అది కాస్త తీవ్రరూపం దాల్చడంతో వారి 19 ఏళ్ల కుమారుడు వారిని విడదీసేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో లీవెట్టి ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. పక్కనే ఉన్న తుపాకీ తీసి భర్తపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయిడు. ఈ ఘర్షణలో వీరి కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడని... అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. క్రెస్పో భార్య లీవెట్టిని అదుపులోకి తీసుకుని... ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. క్రెస్పో చదువుతున్న పాఠశాలలో లీవెట్టి చదువుతుండేది. ఆమెను తొలిసారి చూసి క్రెస్పో మనసు పారేసుకున్నాడు. 1986లో వారిద్దరు వివాహం చేసుకున్నారు. 2001లో క్రెస్పో సిటీ కౌన్సిల్‌కు ఎన్నికయాడు. అలాగే దశబ్దం పాటు లాస్ ఏంజిల్స్ కౌంటీ ప్రోబిషన్ అధికారిగా విధులు నిర్వర్తించారు. గత ఏడాదే బెల్ గార్డెన్స్ మేయర్‌గా పదవి చేపట్టాడు.