Ricky Martin And Jwan Yosef Divorce After Six Years Of Marriage - Sakshi
Sakshi News home page

ఇదేందయ్యా ఇది.. విడాకులు తీసుకున్న 'జంట'ల్‌మెన్స్‌.. .!

Published Fri, Jul 7 2023 6:38 PM | Last Updated on Fri, Jul 7 2023 6:58 PM

Ricky Martin And Jwan Yosef Divorce After Six Years Of Marriage - Sakshi

సాధారణంగా మన భార్య, భర్తలు విడాకులు తీసుకునే వార్తలు వింటుంటాం. భార్య, భర్తల మధ్య మనస్పర్థలతో విడాకుల కోసం కోట్లు మెట్లెక్కతుంటారు. కానీ.. ఈ విడాకులు గురించి వింటే మాత్రం ఇదేం పోయే కాలం రా నాయనా అనకుండా ఉండలేరు. ఎందుకంటే ఇక్కడ విడాకులు తీసుకుంది జంట కాదు.. ఇద్దరు ఘనులే. ఇంతకీ ఆ ఇద్దరి కథేందో జర చూద్దాం పదండి. 

(ఇది చదవండి: పుష్ప-2లో ఐటం సాంగ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లా! )

అమెరికాలోని లాస్‌ఎంజిల్స్‌కు చెందిన సంగీత సంచలనం రికీ మార్టిన్, జ్వాన్ యోసెఫ్ అనే ఇద్దరు పురుషులు 2018లో వివాహం చేసుకున్నారు. అవును మీరు విన్నది నిజమే.. పెళ్లయిన దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అంతే కాకుండా ఓ ఎమోషనల్ నోట్‌ను కూడా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇద్దరు జెంట్స్ పెళ్లి చేసుకోవడం.. అది మళ్లీ డైవర్స్ తీసుకోవడమేంటని తెగ చర్చించుకుంటున్నారు. 

నోట్‌లో రాస్తూ.. "మా పిల్లల పట్ల ప్రేమ, గౌరవంతో మా వివాహాన్ని ముగించాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ ఆరేళ్లలో మేము జంటగా అద్భుతమైన క్షణాలు ఆస్వాదించాం. దయచేసి మా నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరుతున్నాం. ఇప్పుడు ఆరోగ్యకరమైన కుటుంబం కోసం.. మా పిల్లల కోసం స్నేహపూర్వకమైన సంబంధాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం. మా పట్ల ఉన్న ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం, ప్రేమను నిలబెట్టుకుంటాం.' అంటూ ప్రత్యేకంగా ఒక ప్రకటనలో తెలిపారు.

కాగా.. మార్టిన్, యోసెఫ్‌కు 2018లో కుమార్తె లూసియా జన్మించగా.. 2019లో కుమారుడు రెన్‌ పుట్టారు. అయితే మార్టిన్‌కు ఇదివరకే 2008లో జన్మించిన మాటియో, వాలెంటినో అనే కవల పిల్లలు కూడా ఉన్నారు. యోసెఫ్ ఒక చిత్రకారుడు కాగా.. ఆయన తన వృత్తిలో ప్రతిభకు గానూ అనేక అవార్డులను గెలుచుకున్నాడు. మార్టిన్  ఆపిల్ టీవీ ప్లస్‌లో ప్రసారమయ్యే పీరియడ్ కామెడీ "పామ్ రాయల్"లో నటించారు. ఇందులో క్రిస్టెన్ విగ్, లారా డెర్న్, అల్లిసన్ జానీ, కరోల్ బర్నెట్‌లతో కలిసి మార్టిన్ కనిపిస్తారు. కాగా.. 2015లో డేటింగ్ ప్రారంభించిన మార్టిన్, యోసెఫ్.. 2016లో యామ్‌ఫార్‌ ఇన్‌స్పిరేషన్ గాలాలో అఫీషియల్‌గా ప్రకటించారు. ఆ తర్వాత వీరిద్దరు 2018లో వివాహం బంధంతో ఒక్కటయ్యారు.

(ఇది చదవండి: భార్య కోసం ఏకంగా ఆస్పత్రినే బుక్‌ చేసిన స్టార్ హీరో!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement