భారతీయ మీడియాలో గత కొన్ని రోజులుగా హాలీవుడ్ పాప్ ఐకాన్ రిహన్నా పేరు మార్మోగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఉద్యమం చేస్తోన్న రైతులకు రిహన్నా మద్దతు తెలిపారు. నాటి నుంచి ఈ పాప్ ఐకాన్ పేరు దేశంలో మార్మోగిపోతుంది. ఈ క్రమంలో తాజాగా రిహన్నా చేసిన ఓ ఫోటో షూట్ సంచలనం సృష్టించడమే కాక విమర్శలు ఎదుర్కొంటుంది. రిహన్న తాజా ట్వీట్‌పై నెటిజనులు.. ముఖ్యంగా భారతీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దూమారం రేపిన ఆ ఫోటో షూట్ వివరాలు..
తాజాగా రిహన్నా తన లో దుస్తుల బ్రాండ్ ‘‘సెవేజ్ ఎక్స్ ఫెంటీ’’ ప్రమోషన్ కోసం షూట్ చేసిన ఓ ఫోటోని ట్విట్టర్‌లో షేర్ చేశారు. టాప్‌లెస్‌గా దిగిన ఈ ఫోటోలో రిహన్నా తన మెడలో వినాయకుడి పెండెంట్ ఉన్న చైన్ ధరించారు. ఇలాంటి అశ్లీల ఫోటో షూట్ కోసం రిహన్నా తన మెడలో గణేషుడి లాకెట్ ధరించడం పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ‘‘రిహన్నా దయచేసి ఇలాంటి చెత్త పనులు ఆపు. నా మతాన్ని నీవు అలంకరణ వస్తువుగా.. అది కూడా ఇలాంటి అసభ్య ఫోటో కోసం వాడటం కరెక్ట్ కాదు. నీ చైన్ చివర్లో ఉన్న గణేష్ పెండెంట్‌ని మా దేశంలో ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాం. దయచేసి మా దేవుళ్లని నీవు ఇలాంటి పనికి మాలిన ఫోటోల కోసం వాడి అవమానించడం మానుకో’’ అని కోరారు.
మరో ట్విట్టర్ యూజర్ ‘‘మా దేశంలో ప్రతి ఏడాది కొన్ని మిలియన్ల మంది ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని జరుపుకుంటారు. అలాంటి పవిత్రమైన గణేషుడి పెండెంట్‌ని నీవు ఇంత అసభ్యకరమైన ఫోటో కోసం ధరించడం కరెక్ట్ కాదు. నీవు మమ్మల్ని చాలా అవమానించావు.. నిరాశ పరిచావు. నీ నుంచి ఇలాంటి పనులు ఊహించలేదు’’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
మా సెంటిమెంట్లను హర్ట్ చేశావ్: షెహజాద్ పూనవాలా
ఇక రిహన్నా టాప్‌లెస్ ఫోటోషూట్‌పై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు షెహజాద్ పూనవాలా స్పందించారు. మా సెంటిమెంట్లను హర్ట్ చేశావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘‘నేను ముస్లింని. అయినప్పటికి ఓ భారతీయుడిగా.. ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా నేను వినాయకుడిని ఎంతో ప్రేమిస్తాను. అలాంటి గణేష్ పెండెంట్‌ని నీవు ఇలాంటి అసభ్య ఫోటో కోసం వాడటం సరైంది కాదు. నీ చర్యలు నా మనోభావాలను, సెంటిమెంట్లను గాయపరిచింది. భారతదేశంలో రిహన్నాకు మద్దతిచ్చేవారు దీన్ని అంగీకరిస్తారా?’’ అంటూ ట్వీట్ చేశారు.
I am a Muslim but as an Indian and Maharashtrian I love Lord Ganesha ji - sorry this misuse of Ganesha ji image hurts my feelings & sentiments - will Rihanna Backers in India accept this also? #GaneshaInsulted pic.twitter.com/ueHOS9UMZF
— Shehzad Jai Hind (@Shehzad_Ind) February 16, 2021
Comments
Please login to add a commentAdd a comment