బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు ట్విటర్ మరోసారి షాకిచ్చింది. రైతుల ఆందోళనలపై కంగనా చేసిన రెండు ట్విట్‌లను ట్విటర్ తొలగించింది. నటి చేసిన ట్వీట్‌లు ద్వేషపూరితంగా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ.. ఆమె ట్వీట్‌లపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో పోస్టులను డిలీట్ చేసింది. ‘ట్విటర్ నిబంధనలు అతిక్రమించి కంగనా చేసిన పోస్టులపై మేము చర్చలు తీసుకుంటాన్నాం’ అని ట్విటర్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా గతంలోనూ కంగనా ట్విటర్‌ను కొన్ని గంటలపాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. కంగనాపై ట్విటర్ చర్యలు తీసుకోవడానికి ..ఢిల్లీలో రైతుల నిరసనలకు మద్దతిచ్చిన పాప్ సింగర్ రిహన్నాను టార్గెట్ చేస్తూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కారణం. ప్రముఖ పాప్ సింగర్ రిహన్నా భారత్‌లో రైతులు చేస్తున్న ఉద్యమంపై మంగళవారంస్పందించిన విషయం తెలిసిందే. ‘‘మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదు?’’ అంటూ రైతుల ఉద్యమంపై సీఎన్‌ఎన్ ప్రచురించిన కథనాన్ని ట్వీట్ చేశారు. చదవండి: రైతు ఉద్యమం: కేంద్రానికి బాలీవుడ్ స్టార్ల సపోర్ట్!
అయితే మంగళవారం రిహన్నా ట్వీట్‌పై స్పందించిన కంగనా.. ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతులను ఉగ్రవాదులుగా పేర్కొటూ కంగనా ట్వీట్ చేసింది. వారు రైతులు కాదని దేశాన్నివి భజాలనుకుంటున్న టెర్రరిస్టులని వ్యాఖ్యానించింది. అంతేగాక రిహన్నాను ఫూల్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మరోవైపు నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. జనవరి 26న రైతులు చేపట్టిన గణతంత్ర పరేడ్ ఉద్రిక్తంగా మారడంతో దీక్షా శిబిరాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అలాగే ఫిబ్రవరి 6న మరోసారి భారీ ఎత్తున నిరసన ప్రదర్శనకు పిలుపునివ్వడం.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అన్నదాతల కదలికలపై కఠిన ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని రద్దు చేశారు. చదవండి: రైతు ఉద్యమంపై ట్వీట్ వార్
Comments
Please login to add a commentAdd a comment