Kangana Ranaut slams Instagram for being 'dumb' - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: ఇన్‌స్టాగ్రామ్‌పై కంగనా షాకింగ్‌ కామెంట్స్‌.. ఇదొక మూగ గది అంటూ అసహనం

Published Fri, Nov 11 2022 4:13 PM | Last Updated on Fri, Nov 11 2022 4:37 PM

Kangana Ranaut Slams Instagram Says Dumb Instagram - Sakshi

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ తరచూ ఎవరో ఒకరిని టార్గెట్‌ చేస్తు ఉంటుంది. బాలీవుడ్‌ చెందిన నటీనటులనే కాదు రాజకీయ ప్రముఖులపై కూడా ఆమె విమర్శ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంది. అయితే ఈసారి ఆమె ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌ను టార్గెట్‌ చేసింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాలో స్టోరీ చేస్తూ ఇదోక మూగబోయిన సామాజీక మాధ్యమం అంటూ షాకింగ్‌ కామెంట్‌ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌తో పెద్దగా యూజ్‌ లేదని, ఇదేమంత ప్రభావంతమైనది కాదంటూ అసహనం వ్యక్తం చేసింది. అంతేకాదు ట్విటర్‌ ఉత్తమైన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం అంటూ కొనియాడింది.

కాగా ఆమె పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. ‘ఇన్‌స్టాగ్రామ్‌ని నిషేధించాలి. ఇది మూగబోయిన గది లాంటిది. విలువైన సమచారాన్ని ఇందులో ఉంచలేం. నిన్న ఏం రాశాయో మరోసటి రోజు మాయమైపోతుంది. దీని వల్ల మన ఆలోచలను డాక్యుమెంట్‌ చేసుకునే వీలు లేదు. తాము ఏం చెప్పాం, ఏం రాశామోనన్న స్పృహ లేని వాళ్లకు ఇది సరైన వేదిక. కానీ, మాలాంటి వారి పరిస్థితి ఏంటి? షేర్‌ చేసుకున్న ఖచ్చితమైన విషయాలను సేవ్‌ చేసుకోవాలంటే? మా ఆలోచనలను లోతుగా ఇతురులతో పంచుకోవాలంటే?’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు ఈ సందర్బంగా ఆమె ట్విటర్‌ గురించి కూడా ప్రస్తావించింది.

‘ట్విటర్‌ ఓ గొప్ప సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం. మేధోపరంగా సైద్ధాంతిక పరంగా ప్రేరేపించేదంటూ ఇది ఉత్తమైన వేదిక’ అంటూ ప్రశంసించింది. కాగా గతంలో కంగనా చేసిన వివాదస్పద వ్యాఖ్యలు, అభ్యంతరకర పోస్ట్‌లు కారణంగా 2021లో ఆమెను ట్విటర్‌ నిషేధించిన సంగతి తెలిసిందే. కంగనా ట్విటర్‌ నిబంధనలను ఉల్లఘించడం వల్ల ఆమె ఖాతాను తొలగించారు. మరోసారి ఆమె ట్విటర్‌కు వెళ్లేందుకు ఆసక్తిగా ఉంది. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికి ట్విటర్‌ పగ్గాలు అందిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ట్విటర్‌ పాలసీ సమీక్ష అనంతరం నిషేధానికి గురైన వారిని తిరిగి అనుమతిస్తామంటూ ఎలాన్ మస్క్ ఇటీవల ప్రకటన చేశాడు. దీనిపై కంగాన ఆనందరం వ్యక్తం చేస్తూ.. ఎలాన్‌ మాస్క్‌పై ప్రశంసల జల్లు కురిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement