అనంత్‌, రాధిక ప్రీవెడ్డింగ్‌ ఈవెంట్‌: పాప్‌ సింగర్‌ ఒక్క పర్ఫామెన్స్‌కే అన్ని కోట్లా? | Sakshi
Sakshi News home page

Anant, Radhika Pre-Wedding: మొదలైన పెళ్లి సందడి.. పాప్‌ సింగర్‌కు భారీ నజరానా?

Published Fri, Mar 1 2024 3:15 PM

Rihanna Fees For Performing At Anant Radhika Pre Wedding - Sakshi

రిలయన్స్ అధినేత 'ముఖేష్ అంబానీ' చిన్న కుమారుడు అనంత్, ఎన్‌కోర్ హెల్త్‌కేర్ అధినేత 'వీరెన్ మర్చంట్' కుమార్తె రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలైపోయాయి. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నారు. ఇందులో గ్లోబల్ సెన్సేషన్, పాప్ క్వీన్ 'రిహాన్నా' కూడా ఉన్నారు.

రిహాన్నా గురువారమే జామ్‌నగర్‌ చేరుకుంది. ఈమె అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో పర్ఫామెన్స్ కూడా చేయనుంది. ఈ పర్ఫామెన్స్ కోసం అంబానీ ఫ్యామిలీ ఈమె కోసం 8 నుంచి 9 బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 66 కోట్ల నుంచి రూ. 74 కోట్లు.

జామ్‌నగర్‌ చేరుకున్న సమయంలో రిహాన్నా లగేజ్ ఎంతో మందికి ఆశ్చర్యానికి ఆశ్చర్యం కలిగించింది. ఈమెతో పాటు పలువురు సింగర్స్, ఇతర కళాకారులు ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ రోజు ప్రారంభమైన ప్రీ వెడ్డింగ్ వేడుకలు మరో రెండు రోజులు (మార్చి 3) జరగనున్నాయి.

ఇదీ చదవండి: అంబానీకి కాబోయే కోడలి గురించి ఈ విషయాలు తెలుసా?

అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్డ్, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్, బొలీవియా మాజీ అధ్యక్షుడు జార్జ్ క్విరోగా, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చైర్‌పర్సన్ క్లాస్ వంటి వారితో పాటు దిగ్గజ కంపెనీల సీఈఓలు మొదలైనవారు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement