పెళ్లి అంటే నెల రోజుల ముందు నుంచే హడావుడి ఉంటుంది. అసలైన వేడుకలు మాత్రం వారం ముందు నుంచి మొదలవుతాయి. కానీ ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లికి మాత్రం ఐదు నెలల ముందు నుంచే హంగామా మొదలైంది. మార్చి నెలలోనే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్సే కళ్లు చెదిరే రేంజులో నిర్వహించారు. వేలాది కోట్లు ఖర్చు పెట్టారు. మరి పెళ్లి ఇంకెంత ఘనంగా నిర్వహిస్తారో ఎవరి ఊహకూ అందడం లేదు.
ముంబైకి చేరుకున్న బీబర్
ఇకపోతే తాజాగా పెళ్లి పనులు షురూ అయ్యాయి. గుజరాతీ సాంప్రదాయాల్లో ఒకటైన మామేరు వేడుక నిర్వహించారు. మరోవైపు ఆహ్వానాలు అందుకున్న అతిథులు టంచనుగా వచ్చేస్తున్నారు. అమెరికన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ అంబానీ పెళ్లి కోసం ఇండియా వచ్చేశాడు. గురువారం నాడు ఆయన ముంబైకు చేరుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంగీత్‌లో పాటలు పాడేందుకు బీబర్‌ను రప్పించిన అంబానీ ఫ్యామిలీ.. అతడికి రూ.83 కోట్ల మేర డబ్బు ఆఫర్ చేసిందని తెలుస్తోంది.
మరికొద్ది రోజుల్లో పెళ్లి
అందులో భాగంగానే బీబర్.. శుక్రవారం నాడు తన గాత్రంతో అతిథులందరినీ ఆకట్టుకోనున్నాడు. అడెల్, డ్రేక్, లానా డెల్ రే వంటి సింగర్స్ సైతం పెళ్లిలో పాటలు పాడనున్నట్లు తెలుస్తోంది. కాగా జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్ అంబానీ- రాధికా మర్చంట్‌ల వివాహం జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment