ఓటీటీలోకి టాప్‌ రేటింగ్‌ సినిమా.. అధికారిక ప్రకటన | Srikanth Movie OTT Streaming Date Locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి టాప్‌ రేటింగ్‌ సినిమా.. అధికారిక ప్రకటన

Published Thu, Jul 4 2024 11:49 AM | Last Updated on Fri, Jul 5 2024 11:02 AM

Srikanth Movie OTT Streaming Date Locked

బాలీవుడ్‌ ప్రేక్షకులను మెప్పించిన 'శ్రీకాంత్‌' సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. హిందీ వర్షన్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు శ్రీకాంత్‌ బొల్లా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దృష్టి లోపం కారణంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిర్భయంగా తన కలల్ని సాకారం చేసుకున్నారు శ్రీకాంత్‌. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు.

శ్రీకాంత్‌ బొల్లా పాత్రలో  రాజ్‌కుమార్‌ రావ్‌ అద్బుతంగా మెప్పించారు. అలయా ఎఫ్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా మెప్పించారు. ఈ చిత్రంలో జ్యోతిక ఒక కీలక పాత్రలో కనిపించారు. తుషార్‌ హీరానందానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇదే విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. భూషణ్‌ కుమార్‌, నిధి పర్మార్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రేటింగ్‌ పరంగా కూడా ఈ సినిమాకు భారీగా రెస్పాన్స్‌ వచ్చింది. IMDb 7.9 రేటింగ్‌తో ఈ చిత్రం రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement