Srikanth Bolla
-
ఓటీటీలోకి టాప్ రేటింగ్ సినిమా.. అధికారిక ప్రకటన
బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన 'శ్రీకాంత్' సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. హిందీ వర్షన్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దృష్టి లోపం కారణంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిర్భయంగా తన కలల్ని సాకారం చేసుకున్నారు శ్రీకాంత్. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు.శ్రీకాంత్ బొల్లా పాత్రలో రాజ్‌కుమార్ రావ్ అద్బుతంగా మెప్పించారు. అలయా ఎఫ్ ఈ చిత్రంలో హీరోయిన్గా మెప్పించారు. ఈ చిత్రంలో జ్యోతిక ఒక కీలక పాత్రలో కనిపించారు. తుషార్ హీరానందానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. భూషణ్ కుమార్, నిధి పర్మార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రేటింగ్ పరంగా కూడా ఈ సినిమాకు భారీగా రెస్పాన్స్ వచ్చింది. IMDb 7.9 రేటింగ్‌తో ఈ చిత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. -
పుట్టుకతోనే బ్లైండ్..ప్రపంచానికే ఇన్స్పిరేషన్..ఇతన్ని మేధా శక్తి చూస్తే..
-
బాలీవుడ్లో తెలుగువాడి బయోపిక్.. ఎవరీ శ్రీకాంత్ బొల్లా?
ఆంధ్రప్రదేశ్‌కు ప్రముఖ అంధ పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్లో ‘శ్రీకాంత్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజ్ కుమార్ రావు హీరోగా నటించగా, జ్యోతిక, శరత్ కేల్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తుషార్ హీరానందానీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. పుట్టుకతోనే అంధుడైన శ్రీకాంత్..తనకున్న లోపాన్ని దీటుగా ఎదుర్కొన్ని పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. శ్రీకాంత్ బాల్యం సీన్‌తో బాల్యం సీన్‌తో ట్రైలర్ ప్రారంభం అయింది. బాల్యంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తనకున్న లోపాన్ని అదిగమించి పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగాడు? బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను ఎలా స్థాపించాడు? తదితర అంశాలలో చాలా ఎమోషనల్‌గా ట్రైలర్ సాగింది. శ్రీకాంత్ పాత్రలో రాజ్ కుమార్ రావు ఒదిగిపోయాడు. . టీ సీరిస్, ఛాక్ అండ్ ఛీస్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, నిధి పర్మార్ హీరానందానీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎవరీ శ్రీకాంత్? శ్రీకాంత్ బొల్లా సొంత ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం. 1991లో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. పుట్టుకతోనే అంధుడు. చూపు లేకపోవడంతో చిన్నప్పుడే అతన్ని వదిలించుకోవాలని తల్లిదండ్రలకు కొంతమంది బంధువులు సలహా ఇచ్చారట. కానీ వాళ్లు మాత్రం తమ కొడుకును పట్టుదలతో చదివించారు. తనకున్న లోపాన్ని అనుకూలంగా మార్చుకొని కష్టపడి చదివాడు శ్రీకాంత్. ఆరేళ్ల వయసులో ప్రతి రోజూ కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ స్కూలుకు వెళ్లేవాడు. ఎనిమిదేళ్ల వయసులో అంధ విద్యార్ధులు చదువుకునే బోర్డింగ్ స్కూలులో సీటు లభించింది. దీంతో శ్రీకాంత్ హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాడు. ఇంజనీర్ కావాలన్నది ఆయన కల. అది జరగాలంటే సైన్స్, మ్యాథ్స్ చదవాలి. కానీ, ఆ సబ్జెక్టులు తీసుకోవడానికి ఆయనకు అర్హత లేదంటూ స్కూల్ యాజమాన్యం అభ్యంతరం చెప్పింది. ఈ విషయంపై కోర్టుకెక్కాడు ఆయన. ఆరు నెలల విచారణ తర్వాత ఆయన సైన్స్ సబ్జెక్ట్ చదివేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇంటర్మీడియట్లో 98 శాతంతో క్లాస్‌లో టాపర్‌గా ఆయన నిలిచారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో శ్రీకాంత్ బొల్లా ఇంజినీరింగ్ చదవాలనుకున్నా.. అంధుడైన కారణంగా ఆ అడ్మిషన్ దక్కలేదు. దీంతో అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో ఐదు యూనివర్సిటీల నుంచి ఆయనకు ఆఫర్లు వచ్చాయి. మసాచుసెట్స్‌లోని ఎంఐటీని ఆయన ఎంచుకున్నారు. అక్కడ సీటు పొందిన మొట్టమొదటి అంతర్జాతీయ అంధ విద్యార్థి శ్రీకాంత్. ఎంఐటీలో మేనేజ్మెంట్ సైన్స్‌లో ఆయన గ్రాడ్యుయేట్ అయ్యారు. జాబ్ కూడా వచ్చింది. కానీ తాను మాత్రం ఇండియాలోనే పని చేయాలనుకున్నాడు. 2012లో తిరిగి హైదరాబాద్‌కి వచ్చాడు. బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను స్థాపించాడు. ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేసే ఈ కంపెనీ, తాటి ఆకులతో పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఇందులో ఎక్కువమంది వికలాంగులే పని చేస్తున్నారు. 2017లో ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రచురించిన ‘ 30 ఏళ్లలోపు 30 మంది’ జాబితాలో శ్రీకాంత్ బొల్లాకు చోటు దక్కింది. 2022లో స్వాతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల ఈ జంట ఓ బిడ్డకు జన్మనిచ్చారు. -
మన తెలుగువాడి బయోపిక్
చూపు లేకపోయినా అంట్రప్రెన్యూర్‌గా విజయం సాధించిన మన తెలుగువాడు శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ఫస్ట్‌లుక్ వైరల్ అయ్యింది. రాజ్ కుమార్ రావు శ్రీకాంత్ పాత్ర పోషిస్తున్నాడు. పుట్టుకతో అంధత్వం వెంటాడినా విజయాలు అందుకోవడానికి అది అడ్డుకాదని నిరూపించిన తెలుగు పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ‘శ్రీకాంత్’ ఫస్ట్‌లుక్ విడుదలైంది. మంచి నటుడిగా పేరు గడించిన రాజ్‌కుమార్ రావు శ్రీకాంత్ పాత్రను పోషిస్తుండటం విశేషం. మచిలీపట్నంలో జన్మించిన శ్రీకాంత్ బొల్లా ఇంజినీరింగ్ చదువు విషయంలో చాలా సవాళ్లు ఎదుర్కొన్నాడు. అంధుడైన కారణాన ఐఐటీలో సీటు ΄÷ందలేకపోయాడు. అయితే పట్టుదలతో మసాచూసెట్స్ యూనివర్సిటీలో తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా దఖలయ్యి చదువుకున్నాడు. భారత్‌కు తిరిగి వచ్చి పారిశ్రామిక రంగంలో కీర్తి గడించాడు. బొల్లా జీవితం ఇప్పటికే ఎందరికో ఆదర్శం అయ్యింది. వెండితెర మీద ఆయన జీవితం చూసి మరెందరో స్ఫూర్తి ΄÷ందుతారు. తుషార్ హీరానందాని ఈ సినిమా దర్శకుడు. -
బొల్లాంట్ ఇండస్ట్రీస్ శ్రీకాంత్ బొల్లా బయోపిక్‌లో బాలీవుడ్ నటుడు
‘‘శ్రీకాంత్ బొల్లా ఎందరికో ఆదర్శప్రాయుడు. ఎందరికో స్ఫూర్తినిచ్చిన ఆయన పాత్ర చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. కెమెరా ముందు శ్రీకాంత్‌లా నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావ్. బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా బయోపిక్‌కి శ్రీకారం జరిగింది. అంధుడైనప్పటికీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, ఉన్నత స్థాయికి ఎదిగారు శ్రీకాంత్. గురువారం ఆయన జీవిత చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. దర్శకురాలు తుషార్ హిద్రానీ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి భూషణ్ కుమార్ ఓ నిర్మాత. భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘పుట్టిన దగ్గర్నుంచి ఎదురైన సవాళ్లను ఎదుర్కొని తన కలలను నిజం చేసుకున్నారు శ్రీకాంత్. పారిశ్రామికవేత్తగా ఎదిగి, ఎందరికో ఉపాధి కల్పించిన ఆయన జీవితం ఆదర్శనీయం’’ అన్నారు. దివ్యాంగులకు ఉపాధి: ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో పుట్టిన శ్రీకాంత్ ఆటంకాలను అధిగమించి, అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్‌లో చేరిన తొలి అంధుడిగా రికార్డు సాధించారు. హైదరాబాద్ కేంద్రంగా బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను స్థాపించి, 2500 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు. 3 వేల మంది దివ్యాంగులను ఉచితంగా చదివిస్తున్నారు. -
యంగ్ గ్లోబల్ లీడర్స్‌లో హైదరాబాదీ!
న్యూఢిల్లీ: ఇప్పటివరకు నోబెల్ బహుమతి గ్రహీతలు, పులిట్జర్ అవార్డ్ విజేతలు, దేశాధినేతలు, కంపెనీ సీఈఓలు చోటు దక్కించుకున్న యంగ్ గ్లోబల్ లీడర్స్ (వైజీఎల్)లో 2021 సంవత్సరానికి గాను హైదరాబాద్‌కు చెందిన బోలంట్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ సీఈఓ శ్రీకాంత్ బొల్లా ఎంపికయ్యారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బ్రెయిన్ అండ్ కాగ్నిటివ్ సైన్స్ అండ్ బిజినెస్‌లో తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థి అయిన శ్రీకాంత్ 2012లో హైదరాబాద్ కేంద్రంగా పర్యావరణహితమైన ప్యాకేజింగ్ కంపెనీ బోలంట్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించారు. ఇందులో పనిచేసేవారంతా ఏదో ఒక అంగవైకల్యం ఉన్నవారే కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో జన్మించిన ఈయన హైదరాబాద్‌లోని దేవ్నార్ బ్లైండ్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. మన దేశంలో ఇంటర్మీడియట్లో సైన్స్ స్ట్రీమ్ అధ్యయనం చేసిన మొదటి విద్యార్థి కూడా శ్రీకాంతే. వైజీఎల్–2021లో బెంగళూరు కేంద్రంగా పిల్లల మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టే లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ ఫౌండర్, బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి దీపికా పదుకొనే కూడా ఎంపికయ్యారు. -
అవకాశాల గడ్డ భారత్!
సద్వినియోగం చేసుకోవాలని యువతకు శ్రీకాంత్ బొల్ల పిలుపు లాస్ఏంజిలెస్: భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకునేందుకు తపించే యువతకు భారత్ సరైన వేదిక అని బొల్లాంట్ ఇండస్ట్రీస్ సీఈవో శ్రీకాంత్ బొల్ల అన్నారు. అమెరికా వంటి దేశాలే కాదు.. భారత్ కూడా ఇప్పుడు అవకాశాల గడ్డగా మారిందన్నారు. వరల్డ్ హిందూ ఎకనమిక్ ఫోరమ్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో శ్రీకాంత్ మాట్లాడుతూ... ‘శుభవార్త ఏంటంటే... ఇప్పుడు పరిస్థితులు మారాయి. కేవలం పాలనాపరమైన ఇబ్బందులను అధిగమించే సత్తా మీలో ఉంటే.. అమెరికాలాగే భారత్ కూడా అద్భుత అవకాశాల గడ్డ. వచ్చే 25 ఏళ్లపాటు భారత్ 8 శాతం వృద్ధిరేటును సాధిస్తుంది. ఈ పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి... అప్పుడు భారత్‌లోని పట్టణాలు, నగరాలు ఎంతగా అభివృద్ధి చెందుతాయో! ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇండియాలో వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా సులభంగా ధనవంతులైపోవచ్చు. కొత్త కంపెనీ, కొత్త పరిశ్రమ ఏర్పాటు చేసే సాహసం మీలో లేకపోతే ఉన్నవాటిల్లో పెట్టుబడి పెట్టండంటూ..’ వర్ధమాన పారిశ్రామికవేత్తలకు శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఇక అమెరికాలోని ప్రతిష్టాత్మక మాసాచుసెట్స్ ఇన్సిస్టిట్యూట్(ఎంఐటీ)లో చేరిన అంతర్జాతీయ తొలి అంధ విద్యార్థిగా పేరుప్రఖ్యాతులు దక్కించుకున్న శ్రీకాంత్ తన జీవితానుభవాలను వివరించాడు. ‘భారత్ విద్యావ్యవస్థ నన్ను ఓ అంధుడిగానే చూసింది. అటువంటి సమయంలో ఎంఐటీ నన్ను ఆహ్వానించింది. అందుకే ఎంఐటీకి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. అమెరికాలో ఎన్నో అవకాశాలున్నప్పటికీ భారత్‌కు తిరిగిరావడానికి కారణమొక్కటే... భారత్‌లో మార్పు తీసుకురావాలి. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో నేతల ప్రచారమంతా గొప్పగొప్ప అంశాల ప్రాతిపదికనే సాగింది. అదే భారత్‌లో అయితే ప్రజల కనీస అవసరాలకు ఇచ్చే సబ్సిడీ గురించి నేతలు మాట్లాడతారు. తిరిగి అదే సబ్సీడీని పేదలకు అందకుండా చేస్తారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అందుకే నైపుణ్యత కలిగిన భారతీయ యువతను స్వయం ఉపాధివైపు నడిపించాలి. ఇందుకోసం ఇప్పుడున్న తరమే ముందుకు రావాల’ని పేర్కొన్నారు. -
శ్రీకాంత్ సాధించాడు
'నువ్వేమీ చేయలేవంది ప్రపంచం..నేను చేయలేనిదేమీ లేదని దానికి చెప్పా..' అంటాడు శ్రీకాంత్ బొల్లా. యాభై కోట్ల విలువ చేసే కంపెనీ, ఏడాదికి ఏడు కోట్ల రూపాయల టర్నోవర్, ప్రెస్, పబ్లికేషన్ సంస్థలు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్.. ఇవన్నీ ఈయన సొంతం. కానీ, అవేవీ రాత్రికి రాత్రే సమకూరినవి కాదు. ప్రపంచంలోని ఏ వ్యక్తై సంపదలు సృష్టించగలడు. అయితే, ప్రపంచం అతన్ని విశ్వసించాలి. అతనిపై నమ్మకం ఉంచాలి. అప్పుడే అద్భుతాలు సాధ్యపడతాయి. కానీ, శ్రీకాంత్‌ను నమ్మేవారే లేరు. కారణం.. ఆయనో అంధుడు! అయితేనేం.. కార్యసాధకుడు!! కృష్ణాజిల్లా సీతారామపురంకు చెందిన కష్టాలు, శ్రీకాంత్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే.. నిజమేననిపిస్తుంది అతడి కథ విన్నాక! పుట్టుకతోనే కష్టాలతో సావాసం చేశాడీ యువకుడు. తల్లిదండ్రులు పేద రైతులు. 'గుడ్డివాడు పుట్టాడు. వీడినేం చేసుకుంటారు?'అన్నారు చాలామంది. మరికొందరు ఓ అడుగు ముందుకేసి, 'చంపేయండి. పీడ విరగడైపోతుంది' అంటూ సలహా ఇచ్చారు. దేవుడి ఆజ్ఞాపించాడో ఏమో.. ఆ తల్లిదండ్రులకు చేతులు రాలేదు. అలా బతికి బట్టకట్టాడు శ్రీకాంత్. మెల్లగా పెరిగి పెద్దయ్యాడు. బడికి వెళ్లే వయసు. ఎలాగో బడిలో చేర్చుకున్నారు గురువులు. కానీ, ఏనాడూ ముందు వరుస బెంచీల్లో అతన్ని కూర్చోనివ్వలేదు. వెనక బెంచీకే పరిమితం చేశారు. ఇక, ఆట పాటలకూ శ్రీకాంత్ దూరమే. తప్పు అతనిది కాదు. ఎవరూ అతన్ని ఆటల్లో చేర్చుకునేవారు కాదు. అదే కారణం! అయితే, ఇవేమీ అతన్ని పదో తరగతి పరీక్షల్లో స్కూలు ఫస్ట్ ర్యాంకు సాధించకుండా ఆపలేకపోయాయి. తర్వాతి గమ్యం ఇంటర్మీడియట్.. కాలేజీ మెట్లెక్కుదామని సరదా పడ్డాడు. నేరుగా వెళ్లి, సైన్స్ గ్రూపులో చేరుతానంటూ ప్రిన్సిపాల్‌కు చెప్పాడు. దానికాయన అంగీకరించలేదు. 'పోయి, ఆర్ట్స్ గ్రూపులో చేరు' అంటూ సలహా ఇచ్చాడు. దీనికి కారణం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు నిబంధనల ప్రకారం అంధులు సైన్స్ గ్రూపులు ఎంచుకోవడానికి వీల్లేదు. ఆర్ట్స్‌లో ప్రవేశాలకు మాత్రమే వారు అర్హులు. అయితే, శ్రీకాంత్ పట్టువిడవలేదు. బోర్డుకు వ్యతిరేకంగా ఓ కేసు దాఖలు చేశాడు. అంతే.. ఆరు నెలల తర్వాత బోర్డు దిగివచ్చింది. శ్రీకాంత్‌కు సైన్స్ గ్రూపులో ప్రవేశమూ వచ్చింది. తనకు అవకాశమిచ్చినవారికి తానేమిటో చూపించాడు. 98 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో నివ్వెరపోవడం అందరి వంతూ అయింది. ఇక, శ్రీకాంత్ తదుపరి గమ్యం ఐఐటీలో ప్రవేశం పొందటం. దీని కోసం రేయింబవళ్లూ కష్టపడ్డాడు. కానీ, ప్రతిష్టాత్మక ఐఐటీలు శ్రీకాంత్‌ను స్వాగతించేందుకు సిద్ధంగా లేవు. అతనికి హాల్ టికెట్‌ను పంపించేందుకు నిరాకరించాయి. అంతే.. ఐఐటీల్లో ఇంజినీరింగ్ చదవాలన్న అతని కల నీరుగారిపోయింది. అప్పుడే నిర్ణయించుకున్నాడు. 'నేను ఐఐటీలకు అవసరం లేకపోతే.. నేనూ వాటిని లెక్క చేయను' అని అమెరికావైపు చూశాడు. అక్కడి టాప్ కళాశాలలకు దరఖాస్తు చేశాడు. ప్రపంచ ప్రఖ్యాత ఎమ్ఐటీ, స్టాన్ఫోర్డ్, బర్కెలీ, కార్నెగీ మెల్లాన్ కళాశాలలు శ్రీకాంత్‌కు ఆహ్వానం పలికాయి. వాటిలో ఎమ్ఐటీను ఎంచుకున్నాడు. ఆ కళాశాలకు తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా రికార్డు సృష్టించాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక అమెరికాలో బోలెడన్ని కార్పొరేట్ సంస్థలు ఉద్యోగమిస్తామంటూ ముందుకొచ్చాయి. వాటన్నిటినీ వదిలేశాడు. నేరుగా భారత్‌కు వచ్చాడు. తనలాగే సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్న వారి తరఫున బలంగా నిలబడాలని నిశ్చయించుకున్నాడు. తొలుత, ‘సమన్వయ్’ పేరిట హైదరాబాద్‌లో ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పాడు. వికలాంగులకు సేవలందించడం మొదలుపెట్టాడు. అంధుల కోసం ఓ డిజిటల్ లైబ్రరీని, బ్రెయిలీ ప్రింటింగ్ ప్రెస్‌ని ఏర్పరచి, 3 వేల మందికి పైగా పాఠాలు చెప్పేవాడు. 2012లో శ్రీకాంత్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వికలాంగులకు ఉద్యోగాలిచ్చే కంపెనీని ప్రారంభించాలనుకున్నాడు. అలా ప్రారంభమైందే ‘బొల్లాంట్ ఇండస్ట్రీస్’. పేపర్ అరిటాకులు, కప్పులు, ట్రేలు, డిస్పోజబుల్ ప్లేట్లు, స్పూన్లు ఈ కంపెనీ ప్రధాన ఉత్పత్తులు. వీటితో పాటే ప్రింటింగ్ ప్రొడక్టులను సైతం తయారుచేశారు. ఇదంతా చూసిన రవి మంతా లాంటి పెట్టుబడిదారులు భారీ మొత్తాల్లో ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుతానికి శ్రీకాంత్ కంపెనీలో 150 మందికి పైగా వికలాంగులు పనిచేస్తున్నారు. వీరు సాగించే అమ్మకాలు ఏడాదికి రూ.7 కోట్ల పైమాటే! శ్రీకాంత్ ఇక్కడితోనే ఆగిపోవాలనుకోవడం లేదు. భవిష్యత్‌లో మరో కంపెనీ తెరవాలనీ, అందులో 70 శాతం వికలాంగులే ఉద్యోగులుగా ఉండాలనీ ప్రణాళికలు వేసుకుంటున్నాడు. అసాధ్యుడు కదా.. సాధించేస్తాడు!!