![Deepika Padukone And Borosil MD in Young Global Leaders list 2021 - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/12/YOUNG.jpg.webp?itok=gpAtE0Cv)
న్యూఢిల్లీ: ఇప్పటివరకు నోబెల్ బహుమతి గ్రహీతలు, పులిట్జర్ అవార్డ్ విజేతలు, దేశాధినేతలు, కంపెనీ సీఈఓలు చోటు దక్కించుకున్న యంగ్ గ్లోబల్ లీడర్స్ (వైజీఎల్)లో 2021 సంవత్సరానికి గాను హైదరాబాద్‌కు చెందిన బోలంట్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ సీఈఓ శ్రీకాంత్ బొల్లా ఎంపికయ్యారు. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బ్రెయిన్ అండ్ కాగ్నిటివ్ సైన్స్ అండ్ బిజినెస్‌లో తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థి అయిన శ్రీకాంత్ 2012లో హైదరాబాద్ కేంద్రంగా పర్యావరణహితమైన ప్యాకేజింగ్ కంపెనీ బోలంట్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించారు.
ఇందులో పనిచేసేవారంతా ఏదో ఒక అంగవైకల్యం ఉన్నవారే కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో జన్మించిన ఈయన హైదరాబాద్‌లోని దేవ్‌నార్ బ్లైండ్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. మన దేశంలో ఇంటర్మీడియట్‌లో సైన్స్ స్ట్రీమ్ అధ్యయనం చేసిన మొదటి విద్యార్థి కూడా శ్రీకాంతే. వైజీఎల్–2021లో బెంగళూరు కేంద్రంగా పిల్లల మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టే లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ ఫౌండర్, బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి దీపికా పదుకొనే కూడా ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment