జీఎస్‌ఎంఏ ఛైర్మన్‌గా గోపాల్ విఠల్
ప్రపంచవ్యాప్తంగా మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్స్‌కు నేతృత్వం వహిస్తున్న జీఎస్‌ఎంఏ బోర్డ్ ఛైర్మన్‌గా ఎయిర్‌టెల్ వైస్ ఛైర్మన్, ఎండీ గోపాల్ విఠల్ ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఆయన డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. టెలిఫోనికా ఛైర్మన్, సీఈవో పదవికి హొసే మరియా అల్వరేస్ ప్యాలే రాజీనామా చేయడంతో జీఎస్‌ఎంఏ ఛైర్మన్ పదవి కోల్పోయారు. జీఎస్‌ఎంఏ డిప్యూటీ ఛైర్మన్‌గా ఇటీవలే గోపాల్ విఠల్ తిరిగి నియమితులయ్యారు. అసోసియేషన్ బోర్డు సభ్యుడిగా 2019–20లో పనిచేశారు. 1,100లకుపైగా టెలికం, హ్యాండ్‌సెట్, డివైస్, సాఫ్ట్‌వేర్, ఎక్విప్‌మెంట్, ఇంటర్నెట్ రంగ కంపెనీలు జీఎస్‌ఎంఏలో సభ్యులుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: రేపు భారత్‌కు ఓపెన్‌ఏఐ సీఈఓ ఆల్ట్‌మన్
టీవీఎస్ టూవీలర్స్ ప్రెసిడెంట్
వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ టూవీలర్స్ బిజినెస్ ప్రెసిడెంట్‌గా గౌరవ్ గుప్తా నియమితులయ్యారు. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, ఈవీ విభాగాలకు ఆయన నేతృత్వం వహిస్తారని కంపెనీ ఇటీవల తెలిపింది. గతంలో ఆయన ఎంజీ మోటార్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, డిప్యూటీ ఎండీ, చీఫ్ గ్రోత్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment