
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లిని దేశమంతా చూసింది. ఈ వివాహ వేడుకకు దేశవిదేశాల నుంచి సెలబ్రిటీలు హాజరయ్యారు. ఖర్చుకు వెనుకాడకుండా అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరిపించారు ముఖేశ్ - నీతా అంబానీ. ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో కర్దాషియన్స్ సిస్టర్స్ కూడా ఉన్న విషయం తెలిసిందే! అయితే ఎప్పుడూ పొట్టి బట్టల్లో కనిపించే వారు ఈ పెళ్లిలో మాత్రం భారతీయ సాంప్రదాయానికి తగ్గట్లుగా లంగా ఓణీలో మెరిశారు. అంబానీ ఆతిథ్యం చూసి గుడ్లు తేలేశారు. స్వయంగా వారే ఈ మాట చెప్తున్నారు.
మరో ప్రపంచలోకి వెళ్లినట్లే ఉంది
ద కర్దాషియన్స్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో అనంత్ అంబానీ (Anant Ambani) పెళ్లి గురించి మాట్లాడారు. వేదికను ఎంత అందంగా ముస్తాబు చేశారో అని ఖ్లోయె ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోగా.. లక్షలాది పువ్వులు సీలింగ్ నుంచి వేలాడుతూ ముచ్చటగొలిపాయి అని కిమ్ (Kim Kardashian) చెప్పుకొచ్చింది. మా ఎగ్జయిట్‌మెంట్‌ను చాలావరకు ఆపుకున్నాం. అదంతా ఒక డిస్నీల్యాండ్ రైడ్‌లా అనిపించింది. డిస్నీల్యాండ్‌తో పోల్చడం కూడా చిన్నమాటే అవుతుంది అని ఖ్లోయే (Khloe Kardashian) అభిప్రాయపడింది. మరో ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది అని కిమ్ పేర్కొంది.
రిచ్ వెడ్డింగ్
వీరిద్దరూ ఇంకా మాట్లాడుతూ.. పెళ్లికూతురు రాధిక మర్చంట్ (Radhika Merchant) నెమలిలా డిజైన్ చేసిన వాహనంపై వచ్చింది. దానికన్నీ విలువైన రత్నాలు పొదిగి ఉన్నాయి. కొన్నిచోట్ల నిజమైన బంగారం పూత పూశారు. ఎక్కడచూసినా అంతా వజ్రాలమయంగానే ఉంది. ఆఖరికి ఆవు కాళ్లకు సైతం వజ్రాలే ఉన్నాయి. అవి పారిపోకుండా ఉండేందుకు సంకెళ్లలాంటివి కాలికి వేశారు. వాటికి వజ్రాలుండటం చూసి ఆశ్చర్యపోయాం. అంబానీ కుటుంబం గోవును భక్తిగా పూజించారు. ఇదొక అత్యంత ధనిక వెడ్డింగ్. అలాగే పెళ్లికి ముందు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టింది అని పేర్కొన్నారు.
అలా అంబానీ పెళ్లికి వచ్చాం..
ఇక ఇదే ఎపిసోడ్‌లో కిమ్ కర్దాషియన్.. అంబానీ ఎవరో కూడా తెలీదన్న సంగతి తెలిసిందే! తన స్నేహితురాలు లోరైన్ స్కువార్ట్జ్.. అంబానీ కుటుంబానికి ఆభరణాలు తయారు చేసి పెడుతుందని.. అలా ఆమె చెప్పడం వల్లే అంబానీ గురించి తెలిసిందని పేర్కొంది. పెళ్లికి రావాల్సిందిగా 20 కిలోల బరువైన ఇన్విటేషన్ గిఫ్ట్ బాక్స్ పంపించారని, అది చూసి ఇంప్రెస్ అయిపోయి పెళ్లికి హాజరయ్యామంది. అనంత్-రాధిక 2024 జూలైలో పెళ్లి చేసుకున్నారు.
చదవండి: మద్యానికి బానిసయ్యా.. రోజుకు 9 గంటల నరకం: స్టార్ హీరో చెల్లెలు
Comments
Please login to add a commentAdd a comment