Kim Kardashian
-
అయ్యో.. లాస్ ఏంజెలెస్! 24కు చేరిన మృతుల సంఖ్య
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఎంతకీ శాంతించడం లేదు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమై ప్రాంతంపై వరుసగా ఆరో రోజు కూడా దాని ప్రతాపం చూపించింది. దీనికారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 24కి చేరింది. మరో పాతిక మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. తీవ్రమైన గాలులు వీస్తుండటంతో మంటలు ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా వ్యాపిస్తున్నాయి. ‘‘అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత వినాశకరమైన ప్రకృతి వైపరీత్యం’’ అని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ అభివర్ణించారు. కార్చిచ్చు(Wildfires)తో ఇటిప్పదాకా 24 మంది బలయ్యారు. పాలిసేడ్స్‌లో 8 మంది, ఎటోన్లో 16 మంది మరణించారు. చనిపోయినవాళ్లలో ‘కిడ్డీ కాపర్స్’ ఫేమ్ నటుడు రోరీ సైక్స్ కూడా ఉన్నాడు. కార్చిచ్చుతో ఆర్థికంగా వాటిల్లిన నష్టం 150 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇప్పటివరకూ కార్చిచ్చుతో 62 చదరపు మైళ్ల విస్తీర్ణం దగ్ధమైంది. 12,000 నిర్మాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇది శాన్ ఫ్రాన్సిస్కో వైశాల్యం కన్నా అధికం. ఇక.. పాలిసేడ్స్ ఫైర్‌ను 11శాతం, ఎటోన్ ఫైర్‌ను 15 శాతం అదుపు చేయగలిగినట్లు అధికారులు పేర్కొన్నారు. మంటలను ఆర్పివేయడానికి స్థానిక అగ్నిమాపక దళంతో పాటు కెనడా, మెక్సికో నుంచి వచ్చిన అదనపు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొత్తంగా 14 వేల మంది సిబ్బంది, 1,354 అగ్నిమాపక యంత్రాలు, 84 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఇందులో పాలుపంచుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.మరోవైపు.. లాస్ ఏంజెలెస్ కౌంటీలో 1.5 లక్షల మందిని నివాసాలు ఖాళీ చేయాలని ఆదేశించిట్లు తెలిపారు. ఇప్పటికే ఇళ్లు కోల్పోయి సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నవారికి నిత్యావసరాలు, దుస్తులు అందించేందకు దాతలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు.సంబంధిత వార్త: ఎందుకీ కార్చిచ్చు!ఇక వినాశం(Disaster movies) ఆధారంగా సినిమాలు తీసే హాలీవుడ్లో.. మంటలతో అదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలువురు తారలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆంటోనీ హోప్కిన్స్, పారిస్ హిల్టన్, మెల్ గిబ్సన్, బిల్లీ క్రిస్టల్ లాంటి తారల ఇళ్లు కార్చిచ్చు ధాటికి బూడిదయ్యాయి. ఇదిలా ఉంటే.. కాలిఫోర్నియా కార్చిచ్చు రాజకీయ రంగు పులుముకుంది. అధికారుల చేతగానితనమేనని కాబోయే అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ విమర్శించగా.. డెమోక్రట్ సెనేట్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ ఆ విమర్శలను తిప్పి కొట్టారు. అంతేకాదు.. లాస్ ఏంజెలెస్ పూర్తిగా నాశనం కావడంతో.. ‘‘లాస్ ఏంజెలెస్ 2.0’’ పేరిట పునర్మిర్మాణ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారాయన. మరోవైపు.. ఫెడరల్‌తో పాటు స్థానిక దర్యాప్తు సంస్థలు కార్చిచ్చు రాజుకోవడానికి గల కారణాలను పసిగట్టే పనిలో ఉన్నాయి. హాలీవుడ్ స్టార్ల నిర్వాకంతో..ఇదిలా ఉంటే.. మంటల్ని ఆర్పేందుకు నీటి కోరత అక్కడ ప్రధాన సమస్యగా మారింది. అయితే.. హాలీవుడ్ స్టార్ల నిర్వాకం వల్లే లాస్ ఏంజెలెస్‌కి ఈ దుస్థితి తలెత్తిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జలాలను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేయడంతో.. మంటలను చల్లార్చేందుకు నీటి కొరత ఎదురవుతోందని చెబుతున్నారు. కొందరు స్టార్లు తమకు కేటాయించిన నీటి కంటే కొన్ని రెట్లు అదనంగా వాడుకున్నారంటూ డెయిలీ మెయిల్ ఓ కథనం ప్రచురించింది.నటి కిమ్ కర్దాషియన్ ది ఓక్స్లోని తన ఇంటి చుట్టూ తోటను పెంచేందుకు తనకు కేటాయించిన నీటి కంటే అధికంగా నీటిని వాడినట్లు అధికారులు గుర్తించారు. అలాగే.. సిల్వస్టర్ స్టాలోన్, కెవిన్ హార్ట్ వంటి వారు అదనంగా నీరు వాడుకుని జరిమానాలు చెల్లించారు. కొందరు హాలీవుడ్ స్టార్లు గంటకు 2,000 డాలర్లు చెల్లించి.. ప్రైవేటు ఫైర్ఫైటర్లను నియమించుకున్నారని డెయిలీ మెయిల్ పేర్కొంది. ఇక ప్రస్తుతం పసిఫిక్ పాలిసేడ్స్‌లో అన్ని హైడ్రెంట్లు పనిచేస్తున్నాయని డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ పేర్కొంది. కానీ, 20శాతం హైడ్రెంట్లలో నీటి ప్రెజర్ చాలకపోవడంతో.. కొన్ని చోట్ల ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: అందుకే కెనడా ప్రధాని రేసు నుంచి వైదొలిగా: అనిత -
ఆమెలా కనిపించాలనుకోవడమే శాపమయ్యింది! ఎంతో గొప్పదైన..
ఇటీవల కాస్మెటిక్ సర్జరీలు కేవలం ప్రముఖులు, సెలబ్రిటీలకు పరిమితం కాలేదు. సాధారణ వ్యక్తులు, ఓ మోస్తారుగా డబ్బున్నవాళ్లు సైతం ఈ సర్జరీలు వెంటపడుతున్నారు. తీరా చేయించుకుని హాయిగా ఉంటున్నారా అంటే లేదనే చెప్పాలి. పలు సైడ్ ఎఫెక్ట్స్‌తో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలానే ఇక్కడొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ భాలీవుడ్ భామ, అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్స్ కిమ్ కర్దాషియన్ ఉండాలని చేయించుకున్న సర్జరీలు ఆమెకు తీరని బాధను మిగిల్చింది. స్త్రీ జీవితంలో ఎంతో అపరూపమైన దానిపై దెబ్బకొట్టింది. జీవితంలో ఆమె తల్లి అయ్యే అవకాశం లేకుండా చేసింది. అసలేం జరిగిందంటే..బ్రెజిల్ ఇన్ఫ్లుయెన్సర్ జెన్నిఫర్ పాంప్లోన్లా కిమ్ కర్దాషియాన్‌లా కనిపించేందుకు ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చుచేసింది. అయితే తనకు నచ్చిన హీరోయిన్లా మారానన్న ఆనందం ఎంతోసేపు నిలువలేదు. ఎందుకంటే ఆమె కర్దాషియాన్‌లా కనిపించేందుకు అంతలా కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంది. చెప్పాలంటే ఆమెలా తన రూపును మార్చెందుకు శరీరంలో ఏ ఒక్క భాగాన్ని వదలకుండా సర్జరీలతో మార్పులు చేసుకుంది. చెప్పాలంటే సర్జరీలు చేయించుకోవడమే తన పని అన్నంతగా చేయించుకుంది. దీనికి ఆమె శరీరం ప్రతిస్పందించడం మొదలుపెట్టింది. నెమ్మదిగా ఆమె శరీరంలో పలు దుష్ప్రభావాలు చూపించడం మొదలుపెట్టింది. ఇక ఆమె వాటి కోసం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. చెప్పాలంటే చావు అంచులాదాక వెళ్లింది. ఈ కాస్మెటిక్ సర్జరీల్లో బట్ ఫిల్లర్లను వినియోగిస్తారు. ఇది వక్షోజాలు, పిరుదులు ఆకృతిని పెంచేందుకు ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. అయితే ఇందులో వినియోగించే పాలీమిథైల్ మెథాక్రిలేట్ (PMMA) పలు దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అందరికి ఇది సరిపోకపోవచ్చు. ఇక్కడ పాంఫ్లోన్లా విషయంలో అదే జరిగింది. అది ఆమెకు సైడ్ ఎఫెక్ట్ ఇచ్చి ప్రత్యుత్పత్తి అవయవాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా ఆమె సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటోంది. చెప్పాలంటే ఆమె తల్లి అయ్యే అవకాశం చాలా తక్కువ. కర్దాషిలా కనిపించాలనే కోరిక మాతృత్వాన్ని దూరం చేసిందంటూ కన్నీటిపర్యంతమయ్యింది. ఇక ఆమెకు శస్త్ర చికిత్స చేసిన వైద్యుడు సైతం మాట్లాడుతూ.."ఆమెకు ఈ కాస్మెటిక్ సర్జరీ ప్రాణాంతకంగా మారింది. అదృష్టవశాత్తు ధ్యానం, సమతుల్య ఆహారం, చికిత్సతో మరణం అంచుల నుంచి బయటపడింది. కానీ అది ఆమె మాతృత్వాన్ని కోల్పోయేలా చేస్తుందని ఊహించలేదు." అని చెప్పుకొచ్చారు. కాగా, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పాంప్లోన్లా 17 ఏళ్ల వయసు నుంచి ఈ కాస్మోటిక్ సర్జరీలు చేయించుకోవడం ప్రారంభించింది. ఇలా దాదాపు 30 సర్జరీలు చేయించుకుంది. ఫలితంగా 2022లో బాడీ డిస్మోర్ఫియాతో విలవిల్లాడింది. ఇక సర్జరీలు ఆపేయాలని అనుకుంటుండగా శరీరం రియాక్షన్ ఇవ్వడం ప్రారంభించింది. చివరకి అది కాస్తా ఆమె ప్రాణాలనే సంకటంలో పడేసింది. మానసికి ఆరోగ్యంపై దృష్టి సారించి ధ్యానం, యోగా వంటి వాటితో ఆరోగ్య మెరుగు పడేలా చేసుకుంది. అంతేగాదు తనలా ఇలాంటి సర్జరీలు జోలికి వెళ్లి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని సలహాలిస్తోంది. (చదవండి: బాడీబిల్డింగ్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా..?) -
ఆ నటి దగ్గర ప్రపంచంలోనే ఖరీదైన హ్యాండ్ బ్యాగ్
అమ్మాయిలు కావొచ్చు ఆంటీలు కావొచ్చు హ్యాండ్ బ్యాగ్స్ ఉపయోగిస్తుంటారు. రూ.100 దగ్గర నుంచి మొదలుపెడితే వేలు విలువ చేసేవి కొంటుంటారు. యూజ్ చేసిన దానిబట్టి వాటి మన్నిక ఆధారపడి ఉంటుంది. అయితే ఓ నటి దగ్గర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ ఉంది. దాని ఖరీదు ఎంతో చెబితే మీరు ఆశ్చర్యపోవడం సంగతి అటుంచితే ఒక్క చిన్న బ్యాగ్ కోసం అన్ని కోట్లు ఎందుకురా బాబు అనుకుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయమే హాట్ టాపిక్. (ఇదీ చదవండి: తమన్నాకు వింత పరిస్థితి.. ఒకే హీరోకి లవర్, సిస్టర్‌గా!) అమెరికన్ నటి కమ్ మోడల్ కిమ్ కర్దాషియన్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఫ్యాషన్ విషయంలో అప్డేట్గా ఉండటమే కాదు అత్యంత ఖరీదైన వస్తువుల్ని ఉపయోగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే డ్రస్సుల దగ్గర మిగతా యాక్సెసరీస్ వరకు వాటి స్పెషాలిటీ, కాస్ట్ ఎంతో తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతుంటారు. ఇప్పుడు అలా ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికి వచ్చింది. కాకపోతే తనతో పాటు అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌ని కూడా తీసుకొచ్చింది. సిల్వర్ కలర్లో మెరిసిపోతున్న ఈ హ్యాండ్ బ్యాగ్ ధర అక్షరాలా రూ.3,12,61,000 అని తెలుస్తోంది. ఇది చూసిన నోరెళ్లబెడుతున్న నెటిజన్స్.. అంతలా అందులో ఏముందా అని కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ బ్యాగ్‌ని హిర్మేస్ కంపెనీ తయారు చేసింది. బంగారం, డైమండ్‌తో దీన్ని డిజైన్ చేశారు. ప్రపంచంలో చాలా కొద్దిమంది దగ్గర మాత్రమే ఈ బ్యాగ్ ఉంది. దీన్ని స్పెషల్‌గా కొందరు కస్టమర్ల కోసం తయారు చేస్తుంటారు. ప్రస్తుతానికైతే ఈ బ్యాగ్ లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో లేవని తెలుస్తోంది. pic.twitter.com/oS2f1hqOTq — Media Buzz (@mediabuzz0007) July 28, 2023 (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) -
ప్లాస్టిక్ సర్జరీ చేసిన కాసేపటికే మోడల్‌కు గుండెపోటు..
చాలామందికి సెలబ్రిటీ అవ్వాలని కోరికగా ఉంటుంది. కానీ కొందరు ఓ అడుగు ముందుకేసి ఏకంగా సెలబ్రిటీలా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు సర్జరీలు వికటించడంతో మృత్యువాత కూడా పడుతున్నారు. ఇటీవలే పాప్ సింగర్ జిమిన్‌లా కనిపించేందుకు 12సార్లు సర్జరీ చేయించుకున్న సెయింట్ వాన్ మృతి చెందిన విషయం తెలిసిందే! తాజాగా అమెరికన్ స్టార్ కిమ్ కర్దాషియన్‌లా కనిపించేందుకు సర్జరీ చేయించుకున్న ఓ మోడల్ గుండెపోటుతో కన్నుమూసింది. వివరాల్లోకి వెళితే.. మోడల్ క్రిస్టినా అస్తెన్ గౌర్కానీ(34) అచ్చం కిమ్ కర్దాషియన్‌లా మారిపోవాలనుకుంది. ఇందుకోసం ఆమె పలు సర్జరీలు చేసుకోగా అందరూ తనను కర్దాషియన్‌కు జిరాక్స్ కాపీలా ఉన్నావని పొగిడేవారు. తాజాగా ఆమె మరో సర్జరీ చేయించుకోగా అది వికటించడంతో గుండె పనితీరుకు అవాంతరం ఏర్పడింది. ఫలితంగా ఆమెకు ఏప్రిల్ 20న గుండెపోటు రావడంతో కన్నుమూసింది. ఈ విషయాన్ని క్రిస్టినా కుటుంబం ఆలస్యంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. 'ఏప్రిల్ 20.. ఉదయం 4.31 గంటలకు మాకు ఫోన్ కాల్ వచ్చింది. మా కుటుంబ సభ్యులు ఒకరు.. అస్తెన్ చనిపోయిందని ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఆ విషాద వార్తను చేరవేశారు. ఆ ఫోన్ కాల్ మా జీవితాలనే కుదిపేసింది. దురదృష్టవశాత్తూ అస్తెన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. తను తీసుకున్న చికిత్స వల్లే ఇంతటి ఘోరం జరిగి ఉండవచ్చు' అని క్రిస్టినా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చదవండి: 15 ఏళ్ల బంధానికి ముగింపు, బాలీవుడ్ జంట విడాకులు -
కిమ్ కర్దాషియన్ క్రిప్టో వివాద సెటిల్మెంట్
న్యూయార్క్: క్రిప్టో కరెన్సీలను ప్రమోట్ చేసిన వివాదానికి సంబంధించి అమెరికన్ రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ .. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్ఈసీ)తో సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇందుకోసం 1.26 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు ఆమె అంగీకరించారు. అలాగే మూడేళ్ల పాటు ఏ క్రిప్టో అసెట్నూ ప్రచారం చేయబోనని కిమ్ తెలిపారు. వివరాల్లోకి వెడితే, ఎథీరియంమ్యాక్స్ సంస్థకు సంబంధించిన ఈమ్యాక్స్ క్రిప్టోకరెన్సీని తన ఇన్‌స్ట్రాగామ్ ఖాతా ద్వారా కిమ్ ప్రమోట్ చేశారు. అయితే, ఇందు కోసం ఆమె 2,50,000 డాలర్లు తీసుకున్న విషయాన్ని ఆమె వెల్లడించకపోవడం చట్టవిరుద్ధమని ఎస్ఈసీ అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలోనే వివాదానికి ముగింపు పలికేందుకు కిమ్ కర్దాషియన్ సెటిల్మెంట్కు ముందుకొచ్చినట్లు ఆమె తరఫు లాయర్ వెల్లడించారు. -
మరో బ్రేకప్.. షెడ్యూల్స్ కారణంగా విడిపోయిన లవ్‌బర్డ్స్!
Kim Kardashian Pete Davidson Break Up After 9 Months Dating: సినీ ఇండస్ట్రీలో మరో బ్రేకప్ చోటుచేసుకుంది. రియాలిటీ స్టార్‌గా పేరు తెచ్చుకుంది కిమ్ కర్దాషియన్. పలు కామెడీ షోలతో, స్టాండప్ కమెడియిన్‌గా పాపులరయ్యాడు పీట్ డేవిడ్సన్. వీరిద్దరూ తొమ్మిది నెలలుగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కిమ్-పీట్ బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారని హాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 'కిమ్ కర్దాషియన్, పీట్ డేవిడ్సన్ విపరీతమైన షెడ్యూల్స్ కారణంగా సంబంధాన్ని కొనసాగించలేకపోతున్నారు. షెడ్యూల్స్ ద్వారా రిలేషన్‌షిప్‌ను కొనసాగించడం సవాలుగా మారింది. అందుకే విడిపోయి స్నేహితులుగా మారాలని నిర్ణయించుకున్నారు' అని మీడియా సంస్థలు పేర్కొన్నట్లు సమాచారం. కాగా 2021 అక్టోబర్‌లో నిర్వహించిన సాటర్డే నైట్ లైవ్‌లో కిమ్ కర్దాషియన్ అతిథిగా హాజరైంది. ఈ కార్యక్రమంలో కిమ్‌కు పీట్ డేవిడ్సన్తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. తర్వాత ఈ సంవత్సరం జరిగిన మెట్ గాలా ఈవెంట్లో వీరిద్దరూ రెడ్ కార్పెట్‌పై నడిచి తమ రిలేషన్‌షిప్‌ను బహిర్గతంగా వ్యక్తపరిచారు. తాజాగా వీరు 9 నెలల డేటింగ్‌కు స్వస్తి పలికి బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం పీట్ డేవిట్సన్ ఆస్ట్రేలియాలో 'విజార్డ్స్' షూటింగ్లో పాల్గొంటున్నట్లు సమాచారం. చదవండి: సినిమాలకు దూరంగా ఉన్నా.. ఇది చాలా అవసరం: మంచు మనోజ్ హీరోగా, నిర్మాతగా అభినందనీయం.. కానీ ఆ ట్యాగ్? ప్రమాదం నుంచి బయటపడిన నేచురల్ స్టార్ నాని! -
ఆమెలా ఉంటేనే గుర్తింపా?.. ఈమెకిది పునర్జన్మే!
అందంగా ముస్తాబు కావాలని, స్టయిల్‌గా ఉండాలనే తాపత్రయం ఎవరికి ఉండదు!. అయితే.. ఉన్నదాంతో సరిపెట్టుకునేవాళ్లు కొందరు.. రెట్టింపు చేయాలన్న ఆరాటంతో నానా ప్రయత్నాలు చేసేవాళ్లు మరికొందరు. కానీ, ఇక్కడ ఓ యువతి అలాంటి ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు. 12 ఏళ్లుగా.. ఏకంగా 40 కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుంది. ఒళ్లు హునం అయినా భరించింది. మన కరెన్సీలో నాలుగున్నర కోట్లు రూపాయల పైనే ఖర్చు చేసింది. చివరికి.. తత్వం బోధపడి తన రూపం తిరిగి కావాలంటూ మళ్లీ సర్జరీలు చేయించుకుంటోంది. అమెరికన్ సోషల్ ఫిగర్, సెల్ఫ్ మేడ్ బిలియనీర్ కిమ్ కర్దాషియన్‌లా మారాలని ఓ యువతి కలలు కనింది. కానీ, అదంతా పైపై మెరుగులే అని గుర్తించేందుకు పదేళ్లు పైనే పట్టింది. ఆమె పేరు జెన్నిఫర్ పాంపలోనా(29). సొంత దేశం బ్రెజిల్. ఇటలీ టాప్ కంపెనీ వర్సేస్లో మోడల్‌గా పని చేసేది. కాలేజీ రోజుల్లో.. మంచి చదువుతో పాటు వృత్తిలోనూ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ఉమెన్గా రాణించాలనుకుంది. కానీ, కిమ్ కర్దాషియన్‌లా ఉంటేనే తనకూ గుర్తింపు ఉంటుందని గుడ్డిగా నమ్మింది. అందుకే ఆమెలా మారిపోవాలని ఫిక్స్ అయ్యింది. ఆనందమే.. పదిహేడేళ్ల వయసులోనే తొలి సర్జరీకి వెళ్లింది పాంపలోనా. ఎందుకంటే.. ఆ టైంకే కర్దాషియన్‌కు పేరుప్రఖ్యాతులు దక్కాయి కాబట్టి. కిమ్‌లా బాడీ షేప్స్ రావాలని సర్జరీలతో ఒళ్లు హూనం చేసుకుంది. పెదాలు, వక్షోజాలు, పిరుదులు.. ఇలా శరీర సౌష్టవాన్ని మార్చే సర్జరీలన్నీ చేయించుకుంది. నెమ్మనెమ్మదిగా.. కిమ్ కర్దాషియన్‌లా ఉందంటూ ఆమెకు పేరు కూడా దక్కడం మొదలైంది. మోడలింగ్‌లో బోలెడు అవకాశాలు దక్కాయి. ఇంకోవైపు సోషల్ మీడియాలోనూ ఫాలోవర్స్ పెరుగుకుంటూ వెళ్తున్నారు. సర్జరీల కోసం ఆరు లక్షల అమెరికన్ డాలర్లు(నాలుగున్నర కోట్ల రూపాయలపైనే) కానీ.. కిమ్ కర్దాషియన్(ఎడమ), జెన్నిఫర్ పాంపలోనా(కుడి) అంతా ఆమెకు అనుకూలంగా సాగితే ఎలా?. పోనుపోనూ ఆమెకు పరిస్థితి అర్థం అయ్యింది. సహజత్వం కోల్పోయింది ఆమె శరీరం. తన శరీరం తన అదుపు తప్పిందని గుర్తించింది. సర్జరీలకు అలవాటు పడిపోయి.. సైడ్ ఎఫెక్ట్స్ చూపించడం మొదలైంది. పరిస్థితి అర్థం చేసుకున్న పాంపలోనా.. ఎలాగైనా తన మునుపటి రూపం వెనక్కి తెచ్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. మళ్లీ ఖర్చు చేసి.. ఇస్తాంబుల్‌లో ఓ ఫిజీషియన్‌ను కలిసి.. తన మునుపటి రూపానికి తీసుకురావాలని కోరింది. ఒకేసారి మొత్తం ఆపరేషన్లు చేయించుకుంది. గదిలోకి ఒకలా వెళ్లిన ఆమె.. మరోలా బయటకు వచ్చింది. డీట్రాన్సిషన్ కోసం దాదాపు మన కరెన్సీలో కోటి రూపాయాల దాకా ఖర్చు చేసింది. తన రూపం తిరిగి రాబోతున్నందుకు ఇప్పుడు సంతోషంగా ఉందామె. జెన్నిఫర్ పాంపలాకు.. ఇప్పుడు తనలో తాను మధన పడాల్సిన అవసరం లేదు. జీవితమంటే ఏంటో తెలిసొచ్చింది. జీవితమంటే పరిపూర్ణం కాదు. ఎంతో కొంత లోపాలు ఉంటాయి. ఆ లోపాలను స్వీకరిస్తూ ముందకు సాగాలి. విజయ తీరాలను అందుకోవాలి. అంతేగానీ.. సహజ విరుద్దమైన పనులు చేయకూడదనే గుణపాఠం నేర్చిందట. అందుకే సర్జీలకు వెళ్లడం మంచిద కాదని మోడల్స్‌కు సలహా ఇస్తోంది. సర్జరీల వైపు మొగ్గుచూపే వాళ్ల కోసం ‘అడిక్షన్.. ఎబోట్ ది డేంజరస్ ఆఫ్ ది ఆపరేషన్స్’ పేరిట తీసే డాక్యుమెంటరీలో ఆమె నటిస్తోంది. తన మునుపటి రూపం తిరిగి వస్తుండడాన్ని పునర్జన్మగా అభివర్ణిస్తోంది ఆ మోడల్. అంతేకాదు.. డీట్రాన్సిషన్ సెల్ఫీలను సోషల్ మీడియాలో సంతోషంగా పోస్ట్ చేస్తోంది కూడా. -
Youth Pulse: సెల్ఫీలు తీసుకోవడం ఇష్టమా? మరి 0.5 సెల్ఫీల గురించి తెలుసా?
సెల్ ప్రపంచంలో దర్జాగా చైర్ వేసుకొని కూర్చున్న యువతరానికి– సెల్ఫీ కొత్త కాదు! మరి సెల్ఫీలో కొత్త ఏమిటి? జీరో పాయింట్ ఫైవ్.. సెల్ఫీ ముచ్చట్ల గురించి మాట్లాడుకోవాలంటే ఒకటా రెండా... మేకప్ ఫ్రీ సెల్ఫీ అని ఒక ట్రెండ్ బయలుదేరింది. అంటే ఎలాంటి మేకప్ లేకుండా సెల్ఫీ తీసుకోవడం. ‘మేకప్ లేని నా ఫేస్ ఎంత అందంగా ఉందో’ అని కామెంట్ కూడా పెడుతుంటారు. ‘స్లీప్ సెల్ఫీ’ కూడా బాగా పాపులర్ అయింది. రాత్రి నిద్రపోయే ముందు సెల్ఫీ తీసుకోవడమన్నమాట! బాతులాగా మూతి ముడిచి తీసుకునే సెల్ఫీలు ‘డక్ ఫేస్ సెల్ఫీ’లుగా పాపులర్ అయ్యాయి. స్టైల్స్ విషయాన్ని పక్కన పెడితే, ఫోన్లలో ‘రేంజ్’లు ఉన్నట్లే సెల్ఫీలలో కూడా ఉన్నాయి. సెల్ఫీలలో ఇప్పుడు బాగా నడుస్తున్న ట్రెండ్ 0.5 లేదా అల్ట్రావైడ్ సెల్ఫీ ‘ఇదేమన్నా చిన్నాచితకా సెల్ఫీ అనుకుంటున్నావా ఏంటీ, అల్ట్రావైడ్ సెల్ఫీ’ అనే మాటలు యూత్ నోటి నుంచి తరచుగా వినబడుతున్నాయి. ‘ఈ అల్ట్రావైడ్ సెల్ఫీల ప్రత్యేకత ఏమిటి?’ అనే ప్రశ్నకు జవాబు చెప్పాలంటే... సాధారణ సెల్ఫీలతో పోల్చితే భిన్నంగా కనిపిస్తాయి, నుదురు, గోళ్లు, షూస్, మేకప్... మొదలైనవి హైలెట్ అవుతాయి. కొన్నిసార్లు కామిక్ లుక్‌తో కనిపిస్తాం. వీటిని బ్యాక్‌కెమెరా నుంచి మాత్రమే తీసుకునే వీలు ఉండడం వల్ల ‘ఇలా వస్తుంది’ ‘అలా వస్తుంది’ అని ఊహించడానికి లేదు. ఫైనల్ ఔట్పుట్ ఏమిటో మనకు తెలియదు! 2019లో ఐఫోన్11, శాంసంగ్ గెలాక్సీ ఎస్10లో 0.5 సెల్ఫీలు ‘మేము ఉన్నాం’ అంటూ పరిచయం అయ్యాయి. అప్పట్లో సౌత్ ఫ్లోరిడాకు చెందిన ట్విట్టర్ యూజర్ జెర్మీ ఒకే అరటిపండుకు చెందిన రెండు ఫోటోలను పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. లెఫ్ట్ ఫోటో నార్మల్ కెమెరాతో తీసింది. రైట్ ఫోటో అల్ట్రావైడ్ కెమెరాతో తీసింది. రెండో ఫోటోలోని అరటిపండు ఉన్న సైజు కంటే పెద్దగా, చిత్రంగా కనిపిస్తుంది. అలా ‘వైడ్ యాంగిల్ ఈజ్ క్రేజీ’ అనుకోవడానికి అప్పుడే బీజాలు పడ్డాయి. ఈ సంవత్సరం ఆ క్రేజ్ ట్రెండ్‌గా మారింది. దిల్లీకి చెంది శ్రావ్య ఇంజినీరింగ్ చదువుతోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ నిండా బోలెడు 0.5 సెల్ఫీలు ఉన్నాయి. ఇప్పుడు మిత్రబృందం కూడా తనను అనుసరిస్తోంది. ‘ఇది అల్ట్రావైడ్ సెల్ఫీ అని చెప్పుకోవడంలోనే ప్రత్యేకత ఉంది. తీసిన ఫోటో తీసినట్లుగా వస్తే కిక్ ఏం ఉంటుంది? మన ఊహకు అందకుండా వచ్చినప్పుడు మజా వస్తుంది’ అంటుంది శ్రావ్య. ఇప్పటి మాట కాదు నిజానికి అల్ట్రావైడ్ లెన్స్ అనేది ఇప్పటి మాట కాదు. 1862లో వీటికి తొలిసారిగా పేటెంట్ లభించింది. ల్యాండ్‌స్కేప్, ఆర్కిటెక్చరల్ షాట్స్ కోసం వీటిని వాడేవారు. స్ట్రీట్ఫోటోగ్రఫీలో ఈ లెన్స్‌ను ఎక్కువగా ఉపయోగించేవారు. సెల్ఫీ అనగానే టక్కున గుర్తుకు వస్తుంది హాలీవుడ్ సెలిబ్రిటీ... కిమ్ కర్దాషియాన్. ‘క్వీన్ ఆఫ్ సెల్ఫీస్’గా పేరు తెచ్చుకున్న కిమ్ ‘సెల్ఫీస్’ పేరుతో ఏకంగా ఒక పుస్తకమే రాసింది. ఈ కాఫీ టేబుల్ బుక్‌లో వివిధ సందర్భాలలో కిమ్ తీసుకున్న సెల్ఫీలు ఆకట్టుకుంటాయి. కిమ్ కర్దాషియాన్, పారిస్ హిల్టన్లాంటి సెలిబ్రిటీలు జీరో పాయింట్ ఫైవ్ సెల్ఫీలకు యూత్‌లో క్రేజ్ తీసుకువచ్చారు. ‘కొత్త రకం సెల్ఫీలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి’ అంటుంది కిమ్ కర్దాషియాన్. అది ఆమె మాటే కాదు... కొత్తతరం అనుసరిస్తున్న బాట కూడా! చదవండి: Cyber Crime Prevention Tips: టీమ్వ్యూమర్, ఎనీడెస్క్ వంటివి డౌన్లోడ్ చేయమంటారు? ఓటీపీ చెబితే అంతే సంగతులు! -
పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌కు భారీ షాక్!
అమెరికన్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌కు ఇటాలియన్ సూపర్ కార్ మ్యానిఫ్యాక్చరర్ ఫెరారీ సంస్థ భారీ షాకిచ్చింది. ఈ పాప్ స్టార్ ఫెరారీ కారును వినియోగించేందుకు వీలు లేదని హెచ్చరించింది. ఇటలీకి చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఇల్ జియోర్నాలే నివేదిక ప్రకారం..ఫెరారీ సంస్థ జస్టిన్ బీబర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఫెరారీ కార్ల పట్ల జస్టిన్ బీబర్‌కు నైతిక విలువలు లేవని, వాటిని మెయింటెన్స్ చేయడంలో విఫలం అయ్యాడని,అందుకే ఫెరారీ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియా సంస్థ తెలిపింది. ఫెరారీ సంస్థ తన కార్లను సరైన రీతిలో వినియోగించని సెలబ్రిటీలపై ఆంక్షలు విధించడం సర్వసాధారణం. గతంలో హాట్ మోడలింగ్‌తో గ్లోబల్ వైడ్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కిమ్ కర్దాషియన్‌తో పాటు, నికోలస్ కేజ్, ర్యాపర్ 50సెంట్ వంటి ప్రముఖులు ఫెరారీ కార్లను వినియోగించకుండా నిషేధించింది. తాజాగా ర్యాపర్ జస్టిన్ బీబర్‌పై అదే తరహాలో చర్యలు తీసుకుంది. జస్టిన్ బీబర్‌కు చెందిన ఎఫ్ 458ను నిర్వహణలో అలసత్వం వహించడం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. జస్టిన్ బీబర్ ఫెరారీ రంగును మార్చడం, వేలం వేయడం వంటి అంశాలే ఫెరారీ సంస్థ జస్టిన్ బీబర్‌పై నిషేదం విధించే కారణాల్లో ఇవి కూడా ఉన్నాయి. గతంలో జస్టిన్ బీబర్ తన ఎఫ్ 458ని కొనుగోలు చేసిన కొన్ని నెలల తరువాత బెవర్లీ హిల్స్ నైట్ క్లబ్ వెలుపల పార్కింగ్ చేశాడు. నాటి నుంచి బీబర్‌కు ఫెరారీ కార్ల విషయంలో ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటుంన్నాడు. బెవర్లీ హిల్స్ నైట్ క్లబ్లో పార్కింగ్ చేసిన తర్వాత ఆ కారు మిస్ అవ్వడం కలకలం రేగింది. దీంతో బీబర్ సహాయకుడు ఆ సూపర్ కార్‌ను గుర్తించాడు. కారు అదృశ్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈ కెనడియన్ ర్యాపర్ తన ఫెరారీ కారును తెలుపు రంగును బ్లూకి మార్చాడు. అంతేకాదు కారు స్టీరింగ్ వీల్ మీద గుర్రం సింబల్ రంగును, అల్లాయ్ వీల్స్, రిమ్స్ మీద బోల్ట్ లను మార్చాడు. దీంతో ఫెరారీ సంస్థ బీబర్‌పై గుర్రుగా ఉంది. దీనికితోడు రంగును మార్చి వేలం వేయడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన ఫెరారీ సంస్థ.. ఇకపై బీబర్ తమ సంస్థకు చెందిన కారును వినియోగించే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉టాటా ఎలక్ట్రిక్ వెహికల్,లాంచ్ చేసిందో లేదో.. హాట్ కేకుల్లా బుకింగ్స్ -
ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ డేటా లీక్..కిమ్ కర్దాషియన్ తో పాటు
లక్షల సంఖ్యలో ఇన్ స్ట్రాగ్రామ్, టిక్‌టాక్ యూజర్లు ప్రమాదంలో పడనున్నారు. ఈ రెండు సోషల్ నెట్ వర్క్‌లలో 'ఎలాస్టిక్ సెర్చ్' అనే అన్ సెక్యూర్డ్ సర్వర్ ఉన్నట్లు సేప్టీ డిటెక్టివ్స్ సంస్థ తెలిపింది. ఈ సర్వర్ ద్వారా 2.6 మిలియన్ల యూజర్లకు చెందిన 3.6 జీబీ డేటా లీకైంది. తద్వరా 2 మిలియన్లకు పైగా సోషల్ మీడియా యూజర్లపై ప్రభావం పడనుందని అంచనా వేసింది. ఇక డేటా లీకైన యూజర్లలో ఆలిసియా కీస్ ఆరియానా గ్రాండే, రియాలిటీ టీవీషోలతో, హాట్ మోడలింగ్‌తో గ్లోబల్ వైడ్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కిమ్ కర్దాషియన్‌తో పాటు పలువురు ఫుడ్ బ్లాగర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లు ఉన్నట్లు సేప్టీ డిటెక్టివ్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. జులై 5న గుర్తించింది సోషల్ మీడియా అనలిటిక్స్ సైట్ IGBlade.com సోషల్ మీడియా సైట్స్‌లో ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్‌కు సంబంధించి ఫాలోవర్స్ గ్రోత్, ఎంగేజ్మెంట్, అకౌంట్ పర్మామెన్స్ గురించి తెలుసుకునేందుకు కొన్ని టూల్స్‌ను వినియోగిస్తుంది. ఆ టూల్స్ వినియోగం కోసం ఐజీబ్లేడ్.కామ్ రక్షణలేని సర్వర్లను వినియోగిస్తుందని, అలా చేయడం వల్ల సోషల్ మీడియా అకౌంట్లలో ఉన్న యూజర్ల డేటా లీక్ అవుతుందనే విషయాన్ని ఈ ఏడాది జులై5 న సేప్టీ డిటెక్టివ్ సంస్థ గుర్తించింది. ఆ డేటాలో ఏముంది ఇక ఈ అన్వాంటెడ్ సర్వర్ల కారణంగా లీకైనా సోషల్ మీడియా యూజర్లకు చెందిన బయోడేటా తోపాటు అడ్రస్, కాంటాక్ట్ నెంబర్లు, ప్రొఫైల్ పిక్చర్స్‌కు సంబంధించిన లింకులన్నీ ఈ లీకైన రికార్డుల్లో ఉన్నట్లు సేప్టీ డిటెక్టివ్ నిపుణలు వెల్లడించారు. ఇలా డేటా లీక్ అవ్వడం తొలిసారి కాదని 2020 ఆగస్ట్ నెలలో కంపేరిటచ్ అనే సంస్థ ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్ యూజర్లు 235 మిలియన్ల మందికి పైగా డేటా లీకైనట్లు గుర్తించింది. చదవండి: ఫేస్బుక్ సంచలన నిర్ణయం.. పేరు మార్పు! -
మూడు పెళ్లిళ్లు.. అతనే నా సిసలైన భర్త: నటి
రియాలిటీ టీవీషోలతో, హాట్ మోడలింగ్‌తో గ్లోబల్ వైడ్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కిమ్ కర్దాషియన్. ఈ అమెరికన్ మోడల్ వ్యవహరం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దారి తీసింది. గతంలో రెండుసార్లు విడాకులు తీసుకున్న కిమ్.. ముచ్చటగా మూడోసారి భర్త కన్యెయ్ వెస్ట్ నుంచి విడాకులు కొరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘వెస్ట్ మాత్రమే బెస్ట్’ అని కామెంట్ చేసిన కిమ్.. ‘జీవితంలో తాను ఒక్కసారే నిజమైన పెళ్లి చేసుకున్నాన’ని చెప్పడం నవ్వులాటకు దారితీసింది. కిమ్ తన కర్దాషియన్ ఫ్యామిలీ మెంబర్స్‌తో రియాలిటీ షోలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజా ఎపిసోడ్లో మాట్లాడుతూ.. ‘‘గతం గురించి నాకు అక్కర్లేదు. కానీ, కన్యెయ్తో నా బంధం మాత్రమే బలమైంది. అమేజింగ్ వ్యక్తి అతను. దానిని నేను సిసలైన పెళ్లిగా భావిస్తా. నా పిల్లల మీద నాకంటే అతనికే ఎక్కువ ప్రేమ ఉంది. కన్యెయ్కు నేను ఎప్పటికీ వీరాభిమానని.అతను నా ఫ్యామిలీనే!. అని స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే ఈ స్టేట్మెంట్పై కన్యెయ్ అభిమానులు మండిపడుతున్నారు. అతను సంతోషంగా ఉండడం ఓర్వలేక.. మళ్లీ అతనికి దగ్గరవ్వాలని కిమ్ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. గతంలో దామోన్ థామస్, అమెరికన్ బాస్కెట్‌బాల్ ప్లేయర్(మాజీ) హంపెరిస్ను పెళ్లి చేసుకుని ఎక్కువ కాలం రిలేషన్ కొనసాగించలేక విడిపోయింది. ఇక కిమ్ ఇలా విడాకులకు కోర్టుకు వెళ్లిందో లేదో.. అమెరికన్ ర్యాపర్ కన్యెయ్ వెస్ట్, రష్యన్ మోడల్ ఇరినా షాయ్క్తో డేటింగ్ చేస్తున్నాడు. విడాకులపై ఇప్పటి వరకు పెదవి విప్పని వెస్ట్.. ఇరినాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అయితే కిమ్ టార్చర్‌తో కన్యెయ్ వెస్ట్ ఇన్నేళ్లు మానసిక క్షోభను అనుభవించాడని, ప్రస్తుతం ఇరినాతో అతని జీవితం సంతోషంగా ఉందని అతని అభిమానులు సంబురపడుతున్నారు. డబ్బు మోజున్న కిమ్, కన్యెయ్ను నిర్లక్ష్యం చేసిందనేది వాళ్ల వాదన. అందుకే ఆ జంట విడాకులు తీసుకోబోందని పలు కథనాలు కూడా ప్రచురితం అయ్యాయి. అయితే 40 ఏళ్ల కిమ్ మాత్రం ప్రత్యేకించి కారణం ఏదీ లేదని.. అభిప్రాయభేధాల వల్లే విడిపోతున్నామని ప్రకటించడం విశేషం. చదవండి: విడాకులు రాకున్న ఫర్వాలేదంటున్న కుబేరులు! -
సోదరి బాయ్‌ఫ్రెండ్‌తో నటి లవ్ ఎఫైర్?
హాలీవుడ్ ప్రముఖ జంట కిమ్ కర్దాషియన్, కేన్ వెస్ట్ విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. రెండేళ్ల డేటింగ్ అనంతరం కిమ్, కేన్ 2014లో ఇటలీలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. వైవాహిక బంధంలోనూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ మోస్ట్ పాపులర్ స్టార్ కపుల్‌గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇంతలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఏడేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోదామని ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఈ మేరకు విడాకులు కోరుతూ ఫిబ్రవరిలో కోర్టుకెక్కారు. ఈ సందర్భంగా నలుగురు పిల్లల బాధ్యతలను ఉమ్మడిగా చూసుకుంటామని న్యాయస్థానానికి తెలియజేశారు. దీంతో వీరికి విడాకులు రావడం తథ్యంగా కనిపిస్తోంది. కిమ్ కర్దాషియన్, కేన్ వెస్ట్ ఇదిలా వుంటే కిమ్ కర్దాషియన్ తన సోదరి కోర్ట్నీ బాయ్‌ఫ్రెండ్ ట్రావిస్ బార్కర్‌తో గతంలో డేటింగ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన కిమ్ వాటిని తప్పుడు కథనాలుగా కొట్టిపారేసింది. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. ట్రావిస్, కోర్ట్ ఇద్దరూ వారి రిలేషన్షిప్లో సంతోషంగా ఉన్నారు అని తెలిపింది. కాగా కిమ్ కర్దాషియన్ విడాకులు తీసుకోవడం ఇది మూడోసారి కాగా కేన్‌కు మొదటిది. చదవండి: విడాకులు రాకముందే.. కోటీశ్వరుల క్యూ -
విడాకులు రాకముందే.. కోటీశ్వరుల క్యూ
ఉన్నట్లుండి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అభిమానుల్ని షాక్ గురిచేశారు కేన్ వెస్ట్-కిమ్ కర్దాషియన్ జంట. తమ బంధం ఇక కొనసాగడం కష్టమని ప్రకటిస్తూ టీవీ సెలబ్రిటీ కిమ్ ఫిబ్రవరిలో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఆరేళ్ల బంధాన్ని తెంచుకుంటూ పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు వాళ్లిద్దరూ ఒప్పుకున్నారు. అంతేకాదు నలుగురు పిల్లల బాధ్యతలను జాయింట్‌గా చూసుకుంటామని కోర్టులో ఒక ఒప్పందానికి వచ్చారు కూడా. అయితే విడాకులు మంజూరుకాకముందే ఆమె మరో సెలబ్రిటీతో డేటింగ్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. హై ప్రొఫైల్ సెలబ్రిటీ అయిన కిమ్ కర్దాషియన్‌తో డేటింగ్ కోసం బడా బాబులు ఉవ్విళ్లూరుతున్నారు. కొందరు నేరుగా ఆమెకు మేసేజ్‌లు పెడుతుండగా, మరికొందరు మ్యూచువల్ ఫ్రెండ్స్ సాయంతో ఆమెను కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆమె సన్నిహితవర్గాలు చెప్తున్నాయి. బిలీయనీర్లు, బడా కంపెనీల సీఈవోలు, కొందరు ఏ-లిస్ట్ యాక్టర్లు, రాయల్ ఫ్యామిలీస్ నుంచి కూడా ఆమెకు డేటింగ్ ప్రపోజల్స్ వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పట్లో ఆమెకు డేటింగ్ ఆలోచన లేదని తెలుస్తోంది. కేన్ వెస్ట్‌తో బంధం తెగ్గొట్టుకునే టైంలో ఆమె కుంగుబాటుకి లోనైందని, దాని నుంచి కోలుకున్న తర్వాతే ఏ ఆలోచన అయినా చేస్తానని ఆమె సన్నిహితులతో చెప్పినట్లు పేజ్ సిక్స్ మ్యాగజీన్ కథనం ప్రచురించింది. -
ఏడేళ్ల వివాహ బంధం.. విడాకులు కోరిన స్టార్ కపుల్
హాలీవుడ్లో ప్రముఖ స్టార్ కపుల్ కిమ్ కర్దాషియాన్, కేన్ వెస్ట్ విడిపోతున్నారనే ఊహాగానాలే నిజమయ్యాయి. తమ ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విడాకులు కావాలని కోరుతూ కిమ్ కర్దాషియాన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్టార్ కపుల్ త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారంటూ కొంతకాలంగా మీడియాలో కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ కిమ్ కోర్టును ఆశ్రయించింది. ఇక కేస్‌కు ఇది మొదటిసారి విడాకులు కాగా, కిమ్‌కు ఇది మూడోవది. ఇద్దరి పరస్పర అంగీకారతోనే విడిపోతున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రెండేళ్ల డేటింగ్ అనంతరం కిమ్, కేన్ 2014లో ఇటలీలో అంగరంగ వైభవంగా వీరు పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటూ మోస్ట్ పాపులర్ స్టార్ కపుల్‌గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇద్దరి మధ్యా మనస్పర్థాలు పెరగడంతో తమ ఏడేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. అందుకే గత కొంతకాలంగా వీరిద్దరు వేరేవేరుగా ఉంటున్నారు. కిమ్ కర్దాషియాన్ తన నలుగురు పిల్లల్ని తీసుకొని లాస్ ఎంజెలెస్‌లోని ఉండగా, కేన్ వెస్ట్ ప్రస్తుతం వోమింగ్‌లో ఒంటరిగా ఉంటున్నారు. అయితే వీరి నలుగురు పిల్లల్ని మాత్రం ఉమ్మడి కస్టడీ కావాలని దంపతులిద్దరూ కోరుతున్నట్లు కిమ్ లాయర్లారా వాసర్ తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం నాటి నుంచే వారి దాంపత్య జీవితంలో కలహాలు చోటు చేసుకొన్నాయని సమాచారం. కిమ్‌తో పాటు ఆమె తల్లి కూడా తనను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తన భార్య వింత ప్రవర్తను చాలా బాధ కలిగిస్తుందని కేస్ సోషల్ మీడియాలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అప్పట్నుంచి డిపప్రెషన్లో కూరుకుపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రముఖ టీవీ రియాలిటీ షోతో దగ్గరైన కిమ్-కేస్ రెండేళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి నార్త్(7), సెయింట్(5)తో పాటు 21నెలల కుమారుడు కూడా ఉన్నాడు. చదవండి : (విడాకుల తర్వాత సంతోషంగా ఉన్నాను: నటి) (నేను ‘గే’ని.. విడాకులు తీసుకుంటున్నాం: నటుడు) -
విడాకులు తీసుకోబోతున్న స్టార్ కపుల్
హాలీవుడ్లో ప్రముఖ దంపతులు కిమ్ కర్దాషియాన్, కేన్ వెస్ట్ విడిపోతున్నారనే ఊహాగానాలు గత కొద్దికాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలకు బలం చేకూరేలా వారిద్దరు విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇక ఇప్పటికే గత కొద్దికాలంగా వీరిద్దరి వేరువేరుగా ఉంటున్నట్టు సమాచారం. కిమ్ కర్దాషియాన్ తన నలుగురు పిల్లల్ని తీసుకొని లాస్ ఎంజెలెస్‌లోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నారు. కేన్ వెస్ట్ ప్రస్తుతం వోమింగ్‌లో ఒంటరిగా ఉంటున్నారు. వారి మధ్య విభేదాలు పరిష్కరించుకొలేని స్థాయికి వెళ్లడంతో వారిద్దరి విడిపోవడానికి సిద్ధమవుతున్నారు అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. కిమ్, కేన్ 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఏడేళ్లు కలిసి ఉన్న వీరు త్వరలో విడిపోనున్నారు. (చదవండి: విడాకులు కోరిన ఐఏఎస్ దంపతులు) అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం నాటి నుంచే వారి దాంపత్య జీవితంలో కలహాలు చోటు చేసుకొన్నాయని సమాచారం. అప్పటి నుంచి వారిద్దరూ తరచుగా కలుసుకొంటున్నారు. కిమ్ తల్లిపై కేన్ తీవ్ర మనస్తాపం చెందారు. దాంతో వారిద్దరి మధ్య దూరం పెరిగింది. గత మూడు నెలల క్రితం వారిద్దరు కలిసి మీడియాకు కనిపించిన తర్వాత మళ్లీ ఇప్పటి వరకు వారిద్దరు కలవలేదని సమాచారం. ఇక తన జీవితం గురించి కీలక నిర్ణయం తీసుకోవడానికి కేన్ వెస్ట్ చాలా సమయం వెచ్చిస్తున్నారు. వోమింగ్‌లో ఒంటరి జీవితాన్ని గడుపుతూ తన లైఫ్ గురించి ఆలోచిస్తున్నారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా కిమ్ స్నేహితుడు ఒకరు మాట్లాడుతూ.. ఈ బంధంతో ఆమె చాలా విసిగిపోయింది. ఇక దీన్ని ముగించాలని.. కొంత స్పేస్ తీసుకోవాలని భావిస్తుంది అని తెలిపారు. -
ఫేస్‌బుక్‌కు దూరంగా ప్రముఖులు?
న్యూయర్క్: ప్రపంచంలో అతిపెద్ద సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లపై ద్వేష పూరిత ప్రచారాలు, తప్పుడు సమాచారాలపై చర్యలు తీసుకోవాలంటూ రోజురోజుకు ఒత్తిడి పెరుగుతోంది. ఈ నిరసనలో భాగంగా కిమ్ కర్దషియన్తో సహా ప్రముఖులు 24 గంటల నుంచి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఎలాంటి పోస్ట్ చేయలేదు. లియోనార్డో డికాప్రియో, సాచా బారన్ కోహెన్, కాటి పెర్రీ, మైఖేల్ బి. జోర్డాన్ వంటి స్టార్స్ అందరూ ‘స్టాప్ హేట్ ఫర్ ప్రాఫిట్’ నిర్వహిస్తున్న నిరసనకు మద్దతు ప్రకటించారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో మార్పు కోసం పిలుపునిచ్చారు. ‘ఈ వేదికలు ద్వేషం, తప్పుడు సమాచారం వ్యాప్తిని అనుమతించేటప్పుడు నేను కూర్చుని మౌనంగా ఉండలేను - అమెరికాను విభజించడానికి గ్రూపులను సృష్టించాయి’ అని కర్దషియాన్ తెలిపారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 188 మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫేస్బుక్లో తప్పుడు ప్రచారాన్ని అరికట్టాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 2016 అమెరికా ఎన్నికల సమయంలోనూ రష్యా ప్రచారం చేసిన వార్తలను ఫేస్బుక్ అరికట్టలేకపోయిందని అనేక ఆరోపణలు ఎదుర్కోంది. సెలబ్రెటీలతో పాటు అనేక సంస్థలు కూడా యాడ్స్‌ను ఆపేసి ఫేస్బుక్ మీద నిరసనలు వ్యక్తం చేశాయి. అయిన ఫేస్బుక్ ఆదాయం 5.2 బిలియన్ డాలర్ల విలువైన యాడ్ రెవెన్యూ వచ్చింది. తప్పుడు వార్తలు, ప్రచారాలపై చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియా చెబుతూ, అందుకు తగ్గ చర్యలు తీసుకుంటున్న ఇంకా అలాంటి వార్తలను కట్టడిచేయలేకపోతుంది. చదవండి: చిన్న సంస్థలకు ఫేస్బుక్ రూ. 32 కోట్ల గ్రాంటు -
అలా చేయనందుకు భారీ మొత్తం: నటి
తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అనే నానుడి అమెరికా నటి కిమ్ కర్దాషియన్‌కు సరిగ్గా సరిపోతుంది. సోషల్ మీడియా పోస్టులకు గానూ అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఈ అందాల తార తన భర్త కోరిక మేరకు ఓ భారీ ఆఫర్ తిరస్కరించినప్పటికీ భారీ మొత్తం అందుకోవటమే ఇందుకు ఉదాహరణ. ఇంతకీ విషయమేమిటంటే.. అమెరికాకు చెందిన కిమ్ నటిగా, సూపర్ మోడల్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 151 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్న కిమ్ చేత తమ బ్రాండ్లకు ప్రచారం చేసేందుకు కంపెనీలు పోటీపడతాయి. అలా ఓ ప్రఖ్యాత షూ కంపెనీ తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసేందేకు భారీ మొత్తం ఆఫర్ చేసిందట. అయితే అది తన భర్త, ర్యాపర్ కేన్ వెస్ట్‌కు ప్రత్యర్థి సంస్థ కావడంతో మోడలింగ్ చేయాలా వద్దా అని ఆలోచించిందట. ఈ క్రమంలో వ్యాపార దృక్పథంతో ముందుకు వెళ్లాలని భావించిన సమయంలో.. ఇలా చేయడం వల్ల తన కంపెనీకి నష్టం వాటిల్లుతుందని భర్త చెప్పడంతో తన ఆలోచన విరమించుకుందట. దీంతో తన అభ్యర్థనను మన్నించిన భార్యకు కేన్ మిలియన్ డాలర్ల చెక్కు ఇచ్చి సంతోష పరిచాడట. ఈ విషయం గురించి కిమ్ మాట్లాడుతూ... ‘ ఆయన ఎందుకు నో చెప్పారో నాకు తెలుసు. నా క్రేజ్‌ను ఆయన ప్రత్యర్థి కంపెనీ దుర్వినియోగం చేసే అవకాశం ఉందని నాతో అన్నారు. దీంతో నేను కూడా వెనక్కి తగ్గాను. అయితే మదర్స్ డే సందర్భంగా నాకు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రత్యర్థి కంపెనీకి మోడలింగ్ చేయకుండా తన యీజీ కంపెనీకి అనుకూలంగా ఉన్నందుకు మిలియన్ డాలర్ చెక్కు ఇచ్చారు. అందుకు నా ధన్యవాదాలు తెలిపారు. క్రేజ్ ఉంటే ఇలా కూడా జరుగుతుంది కదా. ఇదే మీకు చెప్పాలనకున్న క్యూట్ స్టోరీ’ అని సరదాగా చెప్పుకొచ్చారు. -
హాట్ కేక్‌ల్లా ‘షేపీ వియర్’ సేల్స్..
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన ప్రముఖ అందాల తార, వ్యాపారవేత్త, మోడల్, 38 ఏళ్ల కిమ్ కర్దాషియన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆమె ‘స్కిమ్’ పేరిట మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసిన శరీరానికి అతుక్కుపోయే మహిళల ‘షేపీ వియర్’పై పెద్ద దుమారమే రేగింది. ఎంత పాశ్చాత్య మహిళలే లక్ష్యంగా ఈ దుస్తులను తయారు చేసినప్పటికీ మరీ ఇంతగా శరీరానికి అతుక్కుపోతే ఎలా ? అన్నవాళ్లు, అమ్మాయిల అవయవ సొంపులను అచ్చంగా బయటపెట్టే ఇలాంటి దుస్తులను నిజంగా అమ్మాయిలు ధరిస్తే అబ్బాయిల గుండెలు జారిపోతాయన్నవాళ్లు, అబ్బాయిలు రెచ్చిపోతే అమ్మాయిలకు జరిగే అనర్థాల గురించి భయాందోళనలు వ్యక్తం చేసిన వాళ్లు లేకపోలేదు. ఇలాంటి మాటలను ఎప్పుడు లెక్కచేయని కర్దాషియన్ తన కొత్త డిజైన్ దుస్తులు ‘స్కిమ్’కు తానే మోడల్‌గా మార్కెటింగ్ చేసింది. మంగళవారం దుస్తులను ఆన్లైన్ ద్వారా సేల్స్‌కు పెట్టగా కొన్ని నిమిషాల్లోనే ఆమెకు ఆర్డర్ల రూపంలో రెండు మిలియన్ డాలర్లు (దాదాపు 15 కోట్ల రూపాయలు) వచ్చి పడ్డాయి. కొనుగోలుదారుల పోటీ పెరగడంతో ఆమె సేల్స్ వెబ్సైట్ కూడా ‘క్రాష్’ అయింది. తొలుత కొన్న వారికి వంద డాలర్లకే డ్రస్ అనడంతో తక్కువ ధరకు స్కిమ్ దుస్తులను దక్కించుకోవాలనుకున్న వారి మధ్య పోటీ పెరిగింది. ప్రముఖ స్కిన్ దుస్తులను తయారుచేసే ప్రముఖ బ్రాండ్ ‘స్పాంక్స్’కు ఏడాదికి 30 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటే అందులో సగం, అంటే 50 శాతం బిజినెస్‌ను కర్దాషియన్ ఒక్క రోజులో సాధించారు. ఈ ‘స్కిమ్’ దుస్తులకు తన పేరు ధ్వనించేలా ‘కిమినో’ పెట్టాలనుకున్నారు. వివాదం తలెత్తడంతో స్కిమ్గానే పేరు మార్చారు. ఆమె ‘డబుల్ ఎక్స్ ఎస్ నుంచి 5 ఎక్స్ ఎల్’ వరకు వివిధ సైజుల్లో, వివిధ రంగుల్లో దుస్తులను విడుదల చేశారు. ఈ దుస్తుల గురించి తన అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి ఎలాంటి విమర్శలు రావడం లేదని, కేవలం విమర్శకుల నుంచి మాత్రమే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయని ఆమె తెలిపారు. తాను డిజైన్ చేసిన ఏ దుస్తుల గురించైనా ఎప్పటికప్పుడు అభిమానుల నుంచి అభిప్రాయలను స్వీకరిస్తానని, ఆ అభిప్రాయల మేరకు అవసరమైతే దుస్తుల డిజైన్ కూడా మారుస్తానని కిమ్ వివరించారు. -
పిల్లలతో ఇవేం ఆటలు.. నటికి క్లాస్
‘ఇదేం పెంపకం. పిల్లలతో ఇలాంటి ప్రమాదకరమైన ఆటలా.. ఇది బాధ్యతారాహిత్యం’ అంటూ నెటిజన్లు.. ప్రముఖ హాలీవుడ్ టీవీ సెలబ్రెటీ కిమ్ కర్దాషియన్‌కు క్లాస్ తీసుకుంటున్నారు. తాజాగా కిమ్ కర్దాషియన్ తన కూతురు షికాగో వెస్ట్ పాముతో ఆడుకుంటున్న వీడియోను పోస్టు చేశారు. ఏమాత్రం భయపడకుండా అరుదైన స్నేక్‌తో ఆ చిన్నారి ఆడుకుంటున్న వీడియో వెంటనే వైరల్ అయింది. ‘మై బ్రేవ్ గర్ల్ షికాగో’ అంటూ ఆమె పోస్టు చేసిన ఈ వీడియోకు కామెంట్లు వెల్లువెత్తాయి. ‘షికాగో చాలా అల్లరి పిల్ల. ఆమె ముఖాన్ని చూడండి. పాము తలను ఎలా చూస్తుందో. ఓ మై గాడ్. ఐ లవ్ మై బ్రేవ్ గర్ల్’ అంటూ కిమ్ సోదరి ఖ్లోయి కర్దాషియన్ ఈ వీడియోపై కామెంట్ చేశారు. అయితే, తెలిసితెలియని చిన్నారి అయిన షికాగో చేతికి పామునిచ్చి ఆటలు ఆడించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. పిల్లలకు ఏవి విషపూరితమైన పాములో, ఏవి కావో అన్నది తెలియదని, వారితో ఇలాంటి ఆటలు ఆడించడం ప్రమాదకరమని నెటిజన్లు కిమ్ తీరుపై మండిపడుతున్నారు. పాములు కూడా ప్రాణమున్న జీవులేనని, వాటిని ఆటవస్తువులుగా పిల్లల చేతికి ఇవ్వడం తప్పని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
బాత్రూం సింక్స్ రూ.18 లక్షలట!
రియాలిటీ టీవీ మొఘల్, అమెరికా నటి కిమ్ కర్దాషియాన్ తన ఇంట్లోని బాత్రూం సింకులకు ఏకంగా రూ.18 లక్షలు చెల్లించందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఓ వీడియో ద్వారా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. బాత్రూం సింక్స్కు రూ.18 లక్షలు ఏంటిరా నాయనా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ డబ్బులతో మధ్యతరగతి కుటుంబాలు మూడు డబుల్ బెడ్రూం ఇళ్లులు నిర్మించుకునేవని నిట్టూరుస్తున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. పూర్తి ఆర్కిటెక్ట్ డిజైన్స్‌తో కూడిన ఈ బాత్రూం బెసిన్స్ చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక ఈ టీవీ మొఘల్ షేర్ చేసిన వీడియోలో.. వాష్ బేసిన్స్కు బేసిన్స్ లేకుండా టాప్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి ఎలా పనిచేస్తాయని నెటిజన్లు ప్రశ్నలు సంధించడంతో ఆమె ట్యాప్‌లు ఆన్ చేసి మరి వాటి పనితీరును చూపించింది. ఈ సింక్‌పై చిన్న చీలక ఉందని, దానిలో నుంచి నీళ్లు వెళ్తాయని, ట్యాప్‌ను ఎంత ప్రెజర్‌తో పెట్టినా నీరు పక్కకు వెళ్లవని, అదే దీని ప్రత్యేకతని చెప్పుకొచ్చింది. తన భర్త, ప్రముఖ రాపర్ కన్యే వెస్ట్, డిజైనర్ ఆక్సెల్ వర్వోడోర్ట్, ఆర్కిటెక్ట్ క్లాడియో సిల్వర్పిన్లు కలిసి సంయుక్తంగా ఈ సింక్స్ను రూపొందించారని పేర్కొంది. View this post on Instagram bathroom tour! A post shared by Kim Kardashian Snapchat 🍑 (@kimkardashiansnap) on Apr 17, 2019 at 12:08pm PDT -
స్త్రీలోక సంచారం
ఎయిర్ ఇండియాలో 38 ఏళ్లపాటు పని చేసి, మంగళవారం నాటి ముంబై–బెంగళూరు–ముంబై ఆఖరి ట్రిప్పుతో పదవీ విరమణ పొందిన క్యాబిన్ బృంద సభ్యురాలు పూజకు.. అదే ఫ్లయిట్లో కో–పైలట్‌గా ఉన్న ఆమె కుమార్తె అశ్రిత, మిగతా సిబ్బంది కలసి.. ముంబైలో ల్యాండ్ అవుతున్న ప్రయాణికుల సమక్షంలో ఉద్వేగభరితమైన వీడ్కోలు పలికారు. ఎయిర్హోస్ట్గా ప్రారంభమైన తల్లి కెరీర్‌లోని ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని చిన్నప్పట్నుంచీ చూస్తూ పెరిగిన అశ్రిత.. తన తల్లిలాగే విమానయాన ఉద్యోగం చేయాలని ఆసక్తిని పెంచుకోవడంతో కూతుర్ని ఆమె చక్కగా చదివించి, పైలట్‌ను చేసిన నేపథ్యంలో.. తల్లి పదవీ విరమణ రోజు ఆమె ఉన్న విమానాన్ని స్వయంగా కూతురే నడపడం ఒక మరుపురాని సందర్భంగా నిలిచింది. మౌనం వీడకుండా, మహిళలు మానసిక హింస (సైకలాజికల్ అబ్యూస్) నుంచి విముక్తి పొందలేరని ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ), ‘లేడీస్ ఆర్గనైజేషన్’ సభ్యులు హాజరైన సభలో ‘ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్’ చైర్పర్సన్ అన్నా చండీ అన్నారు. నటి దీపికా పడుకోన్ సంస్థ అయిన ‘ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్’.. డిప్రెషన్‌పై దేశంలోని వివిధ ప్రాంతాలలో తరచు ఇస్తుండే ప్రసంగాలలో భాగంగా హైదరాబాద్ వచ్చిన అన్నా చండీ.. కుంగుబాటుకు గురవుతున్న మహిళలు ఆ విషయాన్ని బయటికి వెల్లడించడం ద్వారా ఆ విషాదస్థితి నుంచి బయటపడే అవకాశాలు మెరుగవుతాయని సూచించారు. తెలంగాణలో 2 కోట్ల మంది మహిళలు ఉన్నప్పటికీ, కె.సి.ఆర్. మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేకపోవడాన్ని రాష్ట్రంలోని మహిళల దృష్టికి తేవడంతో పాటు, తెలంగాణలో కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే మహిళలకు ఏమేమీ వరాలు ఇవ్వబోతున్నదీ ఈ నెల రెండో వారంలో రాష్ట్రానికి వస్తున్న ఎ.ఐ.సి.సి. అధ్యక్షుడు రాహుల్ గాంధీ రంగారెడ్డి జిల్లాలో జరిగే బహిరంగ సభలో ప్రకటించనున్నారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ నాలుగున్నరేళ్లలో కె.సి.ఆర్. ఒక్కసారి కూడా మహిళా స్వయం సహాయక బృందాలతో సమావేశం కాలేదని ఆరోపిస్తూ, అసలు మహిళా సాధికారతపైనే ఆయనకు సదుద్దేశం లేదని ఉత్తమ్‌కుమార్ విమర్శించారు. ‘స్త్రీ ఒక బిడ్డకు జన్మను ఇవ్వొచ్చు కానీ, ఆలయంలోకి వెళ్లి ప్రార్థనలు జరపకూడదా!’ అని విశ్వహిందూపరిషత్ మహిళా నాయకురాలు సాధ్వి ప్రాచీ విస్మయం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలో ఇటీవల ఒక మహిళ ఆలయ ప్రవేశం చేసినందుకు, ఆలయ నిర్వాహకులు గంగా జలంతో ఆలయాన్ని శుద్ధి చెయ్యడంపై..మధురలోని బంకే బిహారీ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా.. ప్రాచీ పై విధంగా వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాలో లిండా డోక్టార్ అనే 34 ఏళ్ల భగ్నప్రేమికురాలు, ఆ బాధనుంచి ఉపశమనం కోసం అక్కడి గోల్డ్‌కోస్ట్ తీరప్రాంతంలో బాగా సన్నిహితులైన ముగ్గురు స్నేహితుల సమక్షంలో తనని తను వివాహం చేసుకున్నారు! ‘సోలిగమీ’ అనే ఈ స్వీయవివాహ సంప్రదాయం ఆస్ట్రేలియాలో చట్ట విరుద్ధమే అయినప్పటికీ, ప్రేమ విఫలం అయిన అనంతరం సెల్ఫ్–లవ్ చాంపియన్‌గా మారిన లిండా.. నీలం, ఊదా రంగులు కలిసిన కొత్త గౌను ధరించి, చేత్తో అద్దం పట్టుకుని, అందులో తనని తను చూసుకుంటూ ‘నిన్ను ఎప్పటికీ వీడను’ అనే ప్రమాణంతో వివాహ తంతును పూర్తి చేసుకున్నారు. ప్రముఖ అమెరికన్ రియాలిటీ టెలివిజన్ పర్సనాలిటీ కిమ్ కర్దేషియాన్ (37) తన చెల్లెళ్లిద్దరితో కూర్చొని మాట్లాడుతుండగా, ‘నువ్వసలు తింటున్నావా? ఏంటలా చిక్కిపోయావ్?’ అని ఒక చెల్లి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కర్దేషియాన్ పట్టలేనంత ఆనందంతో ‘ఓ మై గాడ్. థాంక్యూ’ అని అనడాన్ని.. సోషల్ మీడియాలో కర్దేషియాన్ పెట్టిన వీడియోలో చూసిన.. వైద్యనిపుణులు ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఆ స్థాయిలో కర్దేషియాన్ వ్యక్తం చేసిన సంతోషం.. ఆమెను ఆరాధించి, ఆదర్శంగా తీసుకునే టీనేజ్ ఆడపిల్లల్ని ’అనొరెక్సియా’ (సన్నపడేలా చేసే) వ్యాధి వైపు నడిపించే ప్రమాదం ఉందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు మరమ్మతులు జరుగుతున్నప్పుడు వాహనదారులను అప్రమత్తం చేయడానికి ‘మెన్ ఎట్ వర్క్’ అని పెట్టే హెచ్చరిక బోర్డులను ఏడేళ్ల చిన్నారి అభ్యంతరం మేరకు ‘న్యూజిలాండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ’.. ఇక నుంచి ‘పర్సన్స్ ఎట్ వర్క్’ అని మార్చబోతోంది. గత నెలలో జో క్యార్యూ అనే పాప తన అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళుతూ, రోడ్డుపై కనిపించిన ‘లైన్మెన్’ అనే బోర్డును చూసి.. ‘లైన్ఉమెన్ కూడా పని చేస్తున్నప్పుడు లైన్మెన్ అని మాత్రమే బోర్డు పెట్టడం సమంజసం కాదని, స్త్రీ పురుషులిద్దరూ సమానమేనని’ ట్రాన్‌పోర్ట్ అథారిటీకి లేఖ రాయడంతో రోడ్డు నిర్వహణ అధికారులు ఈ విధమైన మార్పును చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సహాయ, పునరావాస శిబిరాలలో మహిళలు లైంగిక వేధింపులకు, లైంగిక దోపిడీకి, అత్యాచార యత్నాలకు గురవుతున్నారని బ్రిటిష్ పార్లమెంటు కమిటీ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడయింది. అంతర్జాతీయంగా పెద్ద పెద్ద సహాయ సంస్థల్లో పనిచేసే అధికారులు, వారి సిబ్బంది.. లైంగిక కుంభకోణాల్లో ఉన్నారన్న ఆరోపణలు వస్తున్న క్రమంలో జరిగిన ఈ సర్వేలోని ఫలితాలు ఐక్యరాజ్యసమితిని సైతం దిగ్భ్రాంతికి లోను చేశాయి. -
ఆ సమయంలో నగ్నంగా ఉన్నాను: నటి
హాలీవుడ్ నటి, రియాలిటి టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ తన గ్రాండ్ మదర్ అలైస్ మేరీ జాన్సన్‌కు క్షమాభిక్ష ప్రసాదించమని అభ్యర్థించడం.. అందుకు పెద్ద మనస్సు చేసుకొని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంగీకరించడం తెలిసిందే. ఆ మధ్య ఓ కేసులో శిక్షపడిన బాక్సర్‌కు ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించడంతో.. తన నాయనమ్మపై కూడా కనికరం చూపాలని ఆయనను కిమ్ కోరారు. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ట్రంప్.. నిందితురాలు అలైస్ మేరీ జాన్సన్‌కు క్షమాభిక్ష ప్రసాదించి.. జైలుశిక్ష నుంచి విముక్తి కల్పించారు. అయితే ఈ ఉదంతానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయాన్ని కిమ్ తాజాగా వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆమె.. అప్పట్లో తనతో మాట్లాడటానికి ట్రంప్ ఫోన్ చేశారని, ఆ సమయంలో తాను నగ్నంగా ఉన్నానని ఒకింత సిగ్గుపడుతూ చెప్పారు. తను న్యూడ్ ఫోటో షూట్ చేస్తుండగా.. కాల్ వచ్చిందని.. తీరా చూస్తే అది అమెరికా ప్రెసిడెంట్ నుంచి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ స్టీవెన్ క్లైన్ తన న్యూడ్ ఫోటో షూట్ తీస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. -
కుబేరులకు దిమ్మతిరిగిపోయేలా...
వయసు కేవలం 20 సంవత్సరాలు. అయితేనేం సంపాదనలో మహా మహా మిలీనియర్లతో సైతం పోటీపడింది. చివరకు ఫోర్బ్స్లిస్ట్లో చోటు సంపాదించుకుని కుబేరులకు దిమ్మతిరిగే షాకిచ్చింది. న్యూయార్క్: అమెరికన్ మోడల్ కైలీ జెన్నర్.. వయసు 20 ఏళ్లు మాత్రమే.. కైలీ ఏం చేస్తే అదే ఫ్యాషన్. యువత బ్లైండ్‌గా ఆమె స్టైల్‌ను ఫాలో అయిపోతుంటారు. రెండేళ్ల క్రితం కైలీ కాస్మోటిక్స్ పేరిట ఓ సంస్థను ప్రారంభించగా.. అది కాస్త 630 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయి చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ‘100 పర్సంట్’ పేరిట లిప్ కిట్(29 డాలర్లకు కిట్) అమ్మకాల బిజినెస్‌ను ప్రారంభించి.. రెండేళ్లలో గణనీయంగా ఆదాయాన్ని వెనకేసుకుంది. ప్రస్తుతం ఆమె ఆదాయం టాక్స్ మినహాయింపులుపోనూ సుమారు 900 మిలియన్ డాలర్లపై(భారత కరెన్సీలో 6 వేల కోట్లకుపై మాటే). ఈ మేరకు ఫోర్బ్స్ మాగ్జైన్ ప్రత్యేక శీర్షికలో ఆమె గురించి ఓ వ్యాసం ప్రచురించింది. యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ యూఎస్ బిలినియర్ పేరిట కైలీ గురించి ఆ ప్రత్యేక కథనం ప్రస్తావించింది. గతంలో ఈ రికార్డు ఫేస్బుక్ యాజమాని మార్క్ జుకర్‌బర్గ్(23) పేరిట ఉండగా.. ఇప్పుడు కైలీ(20) ఆ రికార్డు బద్ధలు కొట్టింది. ఇదిలా ఉంటే కైలీ ప్రముఖ మోడల్, నటి కిమ్ కర్దాషియన్‌కు బంధువు. ట్రావిస్ స్కాట్‌తో రిలేషన్ షిప్లో ఉన్న కైలీ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ బిడ్డకు జన్మ కూడా ఇచ్చింది. పలు టీవీ షోలు, సినిమాల్లో సైతం నటించిన ఈ యంగ్ మోడల్‌కు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. -
నటి విజ్ఞప్తి.. కనికరించిన ట్రంప్!
వాషింగ్టన్ : హాలీవుడ్ నటి, రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ అభ్యర్థనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన్నించారు. కర్దాషియన్ గ్రాండ్ మదర్ అలైస్ మేరీ జాన్సన్ (63)కు ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించారు. దీనిపై స్పందించిన నటి కిమ్.. బెస్ట్ న్యూస్ ఎవర్ అని బుధవారం రాత్రి ట్వీట్ చేశారు. డ్రగ్సరాకెట్ కేసులో అరెస్టయిన అలైస్ మేరీ జాన్సన్ రెండు దశాబ్దాలుగా జైలుశిక్ష అనుభవిస్తున్నారు. కాగా, తన గ్రాండ్ మదర్‌కు క్షమాబిక్ష పెట్టాలని ట్రంప్‌ను ఆమె కోరారు. మే 30న నిందితురాలు మేరీ జాన్సన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె మనవరాలు కర్దాషియన్ అధ్యక్షుడు ట్రంప్‌ను కలుసుకున్నారు. ఇటీవల ట్రంప్ ఓ బాక్సర్‌కు క్షమాబిక్ష ప్రసాదించగా.. తన గ్రాండ్ మదర్‌పై కూడా కనికరం చూపాలని నటి కర్దాషియన్ ట్రంప్‌ను కోరారు. నటి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ట్రంప్.. నిందితురాలు అలైస్ మేరీ జాన్సన్‌కు క్షమాభిక్ష ప్రసాదించారని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకూ పలు పర్యాయాలు ట్రంప్ అల్లుడు జరేడ్ కుష్నర్ నటి కర్దాషియన్‌తో మేరీ జాన్సన్ కేసు గురించి చర్చించారు. చివరగా నటి కర్దాషియన్ పోరాటం ఫలించడంతో వారి కుటుంబసభ్యులు ట్రంప్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, డ్రగ్స్ రాకెట్ కేసులో 1996లో అరెస్టయిన అలైస్ జాన్సన్‌కు ఎలాంటి పెరోల్ అవకాశం ఇవ్వకుండానే జీవితఖైదు విధించారు. అలైస్ మేరీ జాన్సన్ -
కనికరించి వదిలేయండి ట్రంప్.. కిమ్ విజ్ఞప్తి!
వాషింగ్టన్ : హాలీవుడ్ రియాలిటీ టీవీ స్టార్, నటి కిమ్ కర్దాషియన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలుసుకున్నారు. తన గ్రాండ్ మదర్‌కు క్షమాబిక్ష పెట్టాలని ట్రంప్‌ను ఆమె కోరారు. అలైస్ మేరీ జాన్సన్ (63)ను అమెరికా పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. అయితే ఇటీవల ట్రంప్ ఓ బాక్సర్‌కు క్షమాబిక్ష ప్రసాదించగా.. తన గ్రాండ్ మదర్‌పై కూడా కనికరం చూపాలని నటి కర్దాషియన్ ట్రంప్‌ను కోరారు. గతేడాది నుంచి ఇప్పటివరకూ పలు పర్యాయాలు ట్రంప్ అల్లుడు జరేడ్ కుష్నర్ నటి కర్దాషియన్‌తో మేరీ జాన్సన్ కేసు గురించి చర్చించారు. తాజాగా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిసి డ్రగ్స్ కేసుపై మరోసారి విచారణ జరిపి మేరీ జాన్సన్‌కు విముక్తి కల్పించాలని కర్దాషియన్ విజ్ఞప్తి చేశారు. కర్దాషియన్‌తో సమావేశం గొప్పగా జరిగిందని, జైలు శిక్ష, సంస్కరణలు మార్పులపై చర్చించినట్లు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. బుధవారం (మే 30న) నిందితురాలు మేరీ జాన్సన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె మనవరాలు కిమ్ కర్దాషియన్ శుభాకాంక్షలు తెలిపారు. 1996లో డ్రగ్స్ కేసు ఆరోపణలతో మోడల్ అయిన జాన్సన్‌కు పెరోల్ కూడా ఇవ్వకుండా జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పిచ్చిన విషయం తెలిసిందే. అయితే గత రెండు దశాబ్దాలుగా జాన్సన్ జైలు శిక్ష అనుభవిస్తున్నారని, ఆమె విషయంలో ఇప్పుడైనా ఓ మంచి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్‌ను కలుసుకున్న నటి కిమ్ కర్దాషియన్ అభిప్రాయపడ్డారు. Great meeting with @KimKardashian today, talked about prison reform and sentencing. pic.twitter.com/uOy4UJ41JF — Donald J. Trump (@realDonaldTrump) 30 May 2018 -
నటిలాగా మారాలనుకుంది, కానీ ప్రాణాలపైకి...
లండన్ : నచ్చిన నటీనటులు లాగా తాము కూడా మారాలని.. వారి మాదిరి స్టైల్‌గా ఆకట్టుకునేలా తయారవ్వాలని కొందరు అభిమానులు తాపత్రయం పడుతుంటారు. దీని కోసం కొందరు ఫుల్‌గా వర్క్వుట్లు చేస్తూ ఉంటే.. మరికొందరు సులుమైన మార్గాల్లో ఏకంగా సర్జరీలే చేయించుకొని ప్రాణాలపైకి తెచ్చుకుంటారు. తాజాగా ఇంగ్లండ్‌కు చెందిన ఓ మహిళ.. అమెరికన్ రియాల్టీ టెలివిజన్ పర్సనాలిటీ కిమ్ కర్దాషియాన్లాగా సెక్సీగా మారాలనుకుంది. దానికోసం టర్కీ లోని ఓ కాస్మోటిక్ క్లినిక్‌ను సంప్రదించింది. నాలుగు రోజులు పాటు శస్త్ర చికిత్స చేసి, మూడు లక్షల బిల్ చేతిలో పెట్టారు. అంతేకాక ఈ శస్త్ర చికిత్స అనంతరం ఏడు రోజుల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. కానీ ఆ జాగ్రత్తలన్నింటిన్నీ ఆమె పెడచెవిన పెట్టింది. శస్త్ర చికిత్స అయిన వెంటనే తాను కూడా కిమ్ కర్దాషియాన్లాగా మారాననే ఆనందంలో రెండు రోజులకే ఇంగ్లండ్‌కు పయనమైంది. డాక్టర్ల సూచనలు పట్టించుకోని ఆమెకు, ఈ శస్త్రచికిత్సే ప్రాణాల మీదకు తెచ్చింది. ఒక్కసారిగా ఇన్ఫెక్షన్కు గురై కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. హుటా హుటిన ఆస్సత్రికి తీసుకెళితే పరీక్షలు చేసిన ఇంగ్లండ్ వైద్యులు ఆమె చేయించుకున్న ఆపరేషన్ వికటించిందని, కిడ్నీలు చెడిపోయాయని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. -
నా కూతురు అధ్యక్షురాలైతే బాగుండేది: కిమ్
సాక్షి, లాస్ ఏంజిల్స్: తన నాలుగేళ్ల కూతురు అమెరికా అధ్యక్షురాలైతే బాగుండేదని ప్రముఖ టీవీ నటి కిమ్ కర్దాషియన్ అన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే తన కూతురు నార్త్ వెస్ట్ అద్భుతంగా పరిపాలిస్తుందని జోక్ చేశారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె ఈ వాఖ్యలు చేశారు. ఇప్పుడున్న అధ్యక్షుడి కంటే వేరే వాళ్లు ఎవరైనా అమెరికాను చక్కగా పరిపాలిస్తారని కిమ్ అన్నారు. తన కూతురైతే ఇంకా బాగా పాలిస్తుందని చెప్పారు. అమెరికా ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలవడానికి దేశ పౌరులు కష్ట పడ్డారని తెలిపారు. అమెరికా గురించి గొప్పగా చెప్పుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయని అన్నారు. అయితే, ట్రంప్ మాత్రం అమెరికాను వెనక్కు తీసుకెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ రోజు ఏం జరుగుతుందనే ఆందోళన ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి ప్రజల్లో నెలకొందని చెప్పారు. -
‘మరోసారి తల్లినవుతా’, డాక్టర్ల వార్నింగ్
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి కిమ్ కార్దాషియాన్‌కు మరోసారి తల్లవ్వాలని ఉందంట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన కొత్త ప్రొమో ‘కీపింగ్ అప్ విత్ కార్దాషియాన్స్’ సందర్భంగా చెప్పారు. అయితే, ఈ సమయంలో తల్లికావడం ఆమెకు శ్రేయస్కరం కాదని, ప్రమాదం పొంచి ఉందని, అందుకే ఆ ఆలోచన మానుకోవాలని వైద్యులు తీవ్రంగా హెచ్చరించారు. ఆమె తల్లి క్రిస్ జెన్నర్ కూడా ఆమెను అలా ప్రమాదానికి వదిలేయలేనంటూ హెచ్చరించింది. 36 ఏళ్ల కిమ్‌కు ఇప్పటికే ఇద్దరు పిల్లలు. కాగా తనకు మూడో బిడ్డ కూడా కావాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పింది. ‘నా పిల్లలకు సోదరసోదరీమణులుంటే నాకు చాలా ఇష్టం. కానీ, వైద్యులు మాత్రం తనకది సురక్షితం కాదని అంటున్నారు. కానీ, నేను మాత్రం మరో బేబి కోసం ప్రయత్నించాలని అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. -
‘రేప్ చేసి చంపేస్తారనుకున్నా’
పారిస్ దోపిడీ ఘటన తర్వాత జీవితం పట్ల తన దృక్కోణం మారిందని రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ వెల్లడించింది. దోపిడీ దొంగలను తనను రేప్ చేసి, చంపేస్తారని భావించానని తెలిపింది. గతేడాది అక్టోబర్ లో పారిస్ హోటల్ లో కర్దాషియన్ ను తుపాకీతో బెదిరించి ఆమె నగలను దుండగులు ఎత్తుకుపోయారు. ఈ ఘటన సందర్భంగా తనను ఎదురైన అనుభవాన్ని తన సోదరీమణులతో పంచుకుంది. ‘అదో భయానక అనుభవం. ఆ క్షణంలో దోపిడీ దొంగలు తుపాకీతో నా తలలో కాలుస్తారని భావించాను. కానీ అలా జరగలేదు. నేను అరవకుండా నోటికి ప్లాస్టర్ వేయడంతో నన్ను రేప్ చేస్తారని అనుకున్నాను. అందుకు మానసికంగా సిద్ధమయ్యాన’ని కర్దాషియన్ వెల్లడించింది. దుండగులు ఆమెకు భౌతికంగా ఎటువంటి హాని తలపెట్టలేదు. ఆమెను స్నానాల గదిలో బంధించి ఆభరణాలు ఎత్తుకుపోయారు. ఈ కేసులో జనవరిలో 16 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నేరం అంగీకరించాడు. -
క్రైమ్ సీన్ ఫొటోలు బయటకు వచ్చాయి
పారిస్: రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ నగల చోరీ కేసుకు సంబంధించిన ఫోటోలను ఫ్రెంచ్ మీడియా బయటపెట్టింది. గతేడాది అక్టోబర్ లో పారిస్ హోటల్ లో కర్దాషియన్ ను తుపాకీతో బెదిరించి ఆమె నగలను దుండగులు ఎత్తుకుపోయారు. 4 మిలియన్ డాలర్లు విలువ చేసే ఉంగరంతో సహా ఖరీదైన ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, సీసీ టీవీ ఫుటేజీని ఫ్రెంచ్ మీడియా నెట్ వర్క్ టీఎఫ్ఐ వెలుగులోకి తెచ్చింది. హోటల్ లో కర్దాషియన్ బసచేసిన గదిలోపలి ఫొటోలు ఇందులో ఉన్నాయి. కర్దాషియన్ ను బంధించేందుకు దుండగులు ఉపయోగించిన డక్ట్ టేపు, ప్లాస్టిక్ తాడు తదితర వస్తువులను కూడా ఫొటోలు తీశారు. దుండగులు హోటల్ లోపలికి ప్రవేశిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీలో కనిపించాయి. ఈ కేసులో 10 మంది నిందితులను జనవరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నేరం అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. -
నటి నగల చోరీ కేసులో 16 మంది అరెస్ట్
పారిస్: రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్‌కు చెందిన నగల చోరీ కేసులో 16 మందిని పారిస్ పోలీసులు అరెస్ట్ చేశారు. పారిస్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆటోమెటిక్ గన్స్‌తో పాటు లక్షా 40 వేల యూరోలను స్వాధీనం చేసుకుని 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. కిమ్ బస చేసిన హోటల్ గదిలోకి పోలీసు దుస్తుల్లో దుండగులు చొరబడి భారీ మొత్తంలో విలువచేసే నగలు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. మొహానికి ముసుగులేసుకున్న ఆ దుండగులు.. కిమ్‌ను తుపాకీతో బెదిరించి విలువైన నగలతో ఉడాయించారు. -
టీవీ నటి ముక్కుకు సర్జరీ!
లాస్ ఏంజిల్స్: ప్రముఖ టీవీ నటి కిమ్ కర్దాషియాన్‌పై పారిస్‌లో దుండగులు దాడి చేసి దోచుకెళ్లిన అనంతరం ఆమె ఎక్కువగా వార్తల్లో ఉండటం మానేశారు. పబ్లిక్ ఈవెంట్లకు కాస్త దూరంగానే ఉంటున్నారు. తాజాగా క్రిస్మస్ ఈవ్ పార్టీలో కనిపించిన ఈ అమ్మడుపై సోషల్ మీడియాలో కామెంట్లు మళ్లీ గుప్పుమన్నాయి. పార్టీలో గోల్డెన్ డ్రెస్‌లో కర్దాషియాన్ తళుక్కుమన్నా.. అభిమానులు మాత్రం ఆమె ముక్కునే ఎక్కువగా పరిశీలిస్తున్నారు. చెల్లి కోలే కర్దాషియాన్‌తో కలిసి ఉన్న వీడియోలో కిమ్ ముక్కులో చాలా మార్పు ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకు ముందు కొంచెం మందంగా ఆమె జాతి మూలాలకు దగ్గరగా ఉన్న ముక్కు ఇప్పుడు 'రీనో ప్లాస్టీ' మూలంగా మరీ సన్నగా మారిందని అంటున్నారు. కాస్మొటిక్ సర్జన్ టీజే ఈషో దీనిపై మాట్లాడుతూ.. సర్జరీ రిజల్ట్ బాగుందన్నారు. గతంలోనూ పలుమార్లు కిమ్‌పై ఇలాంటి వార్తలు వచ్చాయి. -
ప్రముఖ హీరోయిన్‌పై ముసుగు వ్యక్తుల దాడి
ప్రముఖ బాలీవుడ్ నటి మల్లికా షెరావత్‌పై పారిస్‌లో దాడి జరిగింది. ముఖానికి ముసుగు ధరించిన ముగ్గురు దుండగులు పారిస్‌లోని ఆమె అపార్ట్మెంట్ బ్లాక్‌లోకి చొరబడి.. దాడి చేశారు. మొదట టియర్‌గ్యాస్ విడుదల చేసి.. అనంతరం ఆమెపై ముగ్గురు దుండగులు పిడిగుద్దులు కురిపించారు. నెలరోజుల కిందట పారిస్‌లోనే హాలీవుడ్ స్టార్ కిమ్ కర్దాషియన్‌పై దోపిడీ దొంగలు దాడిచేసిన సంగతి తెలిసిందే. ఇదే రీతిలో ఆమెపై దాడి జరిగింది. గత శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో తన ప్రియుడు, ఫ్రెంచ్ వ్యాపారవేత్త సిరిల్ ఆక్సన్‌ఫాన్స్‌తో కలిసి తన ఫ్లాట్‌లోకి వెళ్లిన తర్వాత ముగ్గురు దుండగులు చొరబడి ఈ దాడి చేశారు. ముగ్గురు దుండగులు ముఖానికి మాస్క్‌లు తొడిగారని, ఏమి మాట్లాడకుండా వస్తూనే టియర్‌గ్యాస్ విడుదల చేసి అనంతరం దాడి చేశారని లే పారిసీన్ దినపత్రిక తెలిపింది. ఈ ఘటనతో షాక్ తిన్న మల్లిక వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు కేసు నమోదుచేసుకొని దుండగుల కోసం గాలిస్తున్నారు. -
సరొగసీ ద్వారా బిడ్డను కంటా: హీరోయిన్
ఇప్పటికే ఇద్దరు బిడ్డలున్న హీరోయిన్ కిమ్ కర్దాషియాన్.. ఈసారి సరొగసీ పద్ధతిలో మూడో బిడ్డను కనాలని భావిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది. ఇప్పుడు తాను సరొగసీ విధానాన్ని అవలంబించాలని కచ్చితంగా నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపింది. 'కీపింగ్ అప్ విత్ ద కర్దాషియాన్స్' అనే కొత్త ఎపిసోడ్ ప్రోమో విడుదల సందర్భంగా ఆమె ఈ విషయాన్ని చెప్పింది. అయితే.. కిమ్ నిర్ణయం విని ఆమె తల్లి క్రిస్ జెన్నర్ షాకయ్యారు. కిమ్ కర్దాషియాన్ (36)కు ఇప్పటికే భర్త కేన్ వెస్ట్‌తో కలిసి నార్త్ వెస్ట్ అనే కూతురు, సెయింట్ వెస్ట్ అనే కొడుకు ఉన్నారు. ఇప్పుడు మూడో బిడ్డను కనడానికి గర్భం దాల్చే ఓపిక లేదో ఏమోగానీ.. సరొగసీ విధానం అయితే మంచిదని ఆమె అనుకుంటోంది. -
కూతురుపై దాడి తల్లికి బిజినెస్!
లాస్ ఏంజిల్స్: కూతురిపై కొందరు దుండగులు దాడి చేశారు. కాళ్లు చేతులు కట్టేసి అందిన కాడికి దోచుకున్నారు. కూతురిపై జరిగిన ఈ దోపిడీ ఘటనను క్యాష్ చేసుకోవాలనుకుంటోంది రియాలిటీ టీవీ స్టార్ క్రిస్ జెన్నర్. క్రిస్ జెన్నర్ కూతురు, ప్రముఖ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్‌పై అక్టోబర్ 3న కొందరు దుండగులు పారిస్ హోటల్లో దోపిడీకి పాల్పడ్డారు. ఆమెను బాత్రూంలో బంధించి నగలు, నగదు దోచుకొని వెళ్లారు. ఈ ఘటనతో తాను తీవ్ర భయభ్రాతులకు గురయ్యానని, రేప్ చేస్తారేమో అని భయమేసిందని కిమ్ వెల్లడించింది. కిమ్‌పై జరిగిన దాడికి ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రచారం లభించడంతో పాటు.. మంచి క్రైమ్ థ్రిల్లర్ అంశాలు ఇందులో ఉండటంతో.. దీనిని సినిమాగా తీస్తే మంచి లాభాలోస్తాయని క్రిస్ బిజినెస్ మైండ్ అంచనావేసింది. ఆలోచన వచ్చిందే తడవుగా క్రిస్ ఈ దిశగా ప్రయత్నాలు మొదలెట్టింది. కిమ్ పాత్ర కోసం మిలా కునిస్ లేదా నటాలియా పోర్ట్‌మెన్ అయితే బాగుంటుందని క్రిస్ ఆలోచిస్తోందట. -
అది ఫేక్ అంటావా.. వెబ్‌సైట్‌పై టీవీ నటి కేసు!
న్యూయార్క్: ప్రముఖ టీవీ సెలబ్రిటీ కిమ్ కర్దాషియన్ ఓ వెబ్‌సైట్‌పై పరువునష్టం దావా వేసింది. పారిస్‌లో తనపై జరిగిన సాయుధ దోపిడీ ఉత్త నాటకమేనని, బీమా సొమ్ము నొక్కేసేందుకే కిమ్ ఈ నాటకం ఆడి.. అందరినీ బోల్తా కొట్టించిందని ‘మీడియాటేక్అవుట్.కామ్’ ఓ కథనం ప్రచురించింది. ఈ కథనంపై ఆగ్రహం వ్యక్తంచేసిన కిమ్ న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో పరువునష్టం దావా వేసింది. వదంతులు రాసే ఆ వెబ్సైట్ తనపై జరిగిన దోపిడీ విషయంలో అసత్యాలు ప్రచురించిందని కిమ్ ఆరోపించింది. గత నెల 3న పారిస్‌లోని తన అపార్ట్మెంట్లో కిమ్ కర్దాషియన్‌పై దోపిడీ దొంగలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తుపాకులతో బెదిరించి 10 మిలియన్ డాలర్ల విలువచేసే సొమ్మును దోచేశారు. అయితే, తనకు ఇన్సూరెన్స్ ఉండటంతో దోపిడీకి గురైన సొమ్మును చెల్లించాలమని ఆమె బీమా కంపెనీకి దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దోపిడీ నేపథ్యంలో 35 ఏళ్ల కిమ్ ఇప్పటివరకు టీవీ షోల్లోకానీ, సోషల్ మీడియాలోకానీ కనిపించలేదు. కిమ్ వ్యాఖ్యాతగా ఉన్న ‘కీపింగ్ అప్ విత్ ద కర్దాషియన్స్’ కార్యక్రమాన్ని కూడా నిలిపివేశారు. తనపై జరిగిన దోపిడీ అఘాయిత్యంతో కిమ్ భయభ్రాంతులకు గురైందని, తమ కుటుంబ భద్రతపై తాము తీవ్రంగా మథనపడుతున్నామని కిమ్ సోదరి ఖ్లోషి కర్దాషియన్ పేర్కొంది. -
పోర్న్ హబ్ భారీ ఆఫర్
లాస్ ఏంజిల్స్: అడల్ట్ వెబ్సైట్ పోర్న్ హబ్, అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ చోరీకి సంబంధించి సమాచారం ఇచ్చిన వారికి భారీ ఆఫర్ ఇచ్చింది. చోరీలో పాల్గొన్న దుండగుల సమాచారం ఇచ్చిన వారికి 50వేల డాలర్లు(దాదాపు 33 లక్షలు రూపాయలు) రివార్డుగా ప్రకటించింది. పారిస్‌లో కిమ్ కర్దాషియన్ చోరీకి గురవ్వడం చాలా బాధాకరం అని పోర్న్ హబ్ వైస్ ప్రెసిడెంట్ కోరే ప్రైస్ అన్నారు. పోర్న్ హబ్ కుటుంబంలో కిమ్ ఓ సభ్యురాలుగా భావిస్తున్నాము. ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులను పట్టుకొని కిమ్‌కు న్యాయం జరిగేలా మా వంతు ప్రయత్నం చేస్తాము. చోరీకి సంబంధించి సమిష్టిగా కృషి చేసి దుండగులను పట్టుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోర్న్ హబ్ అభిమానులను ఆయన కోరారు. ఆదివారం తెల్లవారుజామున కిమ్ బస చేస్తున్న హోటల్ గదిలోకి ఇద్దరు దుండగులు చొరబడి.. ఆమెను తుపాకీతో బెదిరించి రూ.45 కోట్ల విలువైన నగలను దోచుకెళ్లిన విషయం తెలిసిందే. -
సోషల్ మీడియా వల్లే హీరోయిన్ ఇంట్లో దోపిడీ?
అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తాను ఎక్కడున్నానో.. ఏం చేస్తున్నానో తన ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో పోస్ట్ చేయడంతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోలు, వివరాలు, స్నాప్‌చాట్‌లో వీడియోలు పెడుతుంది. సరిగ్గా ఇదే అంశం దోపిడీ దొంగలకు బాగా కలిసొచ్చింది. ఫ్యాషన్ వీక్‌లో భాగంగా ప్యారిస్ పర్యటనలో ఉన్న కిమ్ ఆ విషయాన్ని కూడా అప్డేట్ చేస్తూనే ఉంది. దాంతో ఆమె ఉన్న అపార్టుమెంట్ వివరాలు కూడా తెలుసుకున్న దోపిడీ దొంగలు.. ఎంచక్కా అక్కడకు వచ్చారు. దాదాపు రూ. 67 కోట్ల విలువైన నగలు దోచుకెళ్లిపోయారు. పారిస్‌లో తాను బస చేసిన హోటల్లోకి దుండుగులు చొరబడినపుడు భయంతో వణికిపోయానని రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ చెప్పింది. ఓ దుండగుడు తనను లాక్కెళ్లి బాత్‌టబ్‌లో బంధించాడని పోలీసులకు తెలిపింది. దీంతో దుండగులు తనపై లైంగికదాడి చేస్తారని బెదిరిపోయానని చెప్పింది. తనకు పిల్లలు ఉన్నారని, చంపవద్దని ప్రాధేయపడ్డానని, మీకు కావాల్సిన వస్తువులను తీసుకెళ్లాల్సిందిగా వేడుకున్నాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్యారిస్‌లో ఒక లగ్జరీ అపార్టుమెంటులో ఉంటున్న కిమ్.. ఆ విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దాంతోపాటు ఆమె సోదరి కైల్ జెన్నర్ కొన్ని వీడియోలను కూడా స్నాప్‌చాట్‌లో పెట్టింది. దోపిడీ జరగడానికి కొన్ని గంటల ముందే ఇవి పోస్టయ్యాయి. ఎవరైనా సరే వాళ్లకు సంబంధించిన సమాచారాన్ని తరచు పోస్ట్ చేస్తున్నా, సంపదను కూడా ప్రదర్శించినా వాళ్ల మీద ఇలాంటి దాడులు జరిగే అవకాశాలు ఎక్కువ అవుతాయని ఫ్లోరిడాకు చెందిన అంతర్జాతీయ సెక్యూరిటీ కన్సల్టింగ్ సంస్థ మేనేజింగ్ భాగస్వామి క్రిస్టోఫర్ హాగన్ తెలిపారు. ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అనే విషయాలను చెప్పడం సెలబ్రిటీలకు అంత మంచిది కాదని, దానివల్ల వాళ్లు సులభంగా టార్గెట్ అవుతారని అన్నారు. నిజానికి సోషల్ మీడియాలో తనకు వేధింపులు ఎక్కువైపోయాయని ఇటీవలే కిమ్ వాపోయింది. తమ భద్రతను కూడా మరింత పెంచుకోవాల్సి ఉంటుందని ఆమె తల్లి క్రిస్ జెన్నర్ కూడా అన్నారు. -
నటిని తాళ్లతో కట్టేసి, 80 లక్షలు దోచుకెళ్లారు
హాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ కిమ్ కర్ధాషియన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పుడూ హాట్ ఫోటోలతో మీడియాలో హల్ చల్ చేసే ఈ బ్యూటి ఈ సారి మాత్రం ఓ భయానక సంఘటన కారణంగా వార్తల్లోకి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున ఫారిస్లో కిమ్ ఉంటున్న అపార్ట్మెంట్లో దొంగతనం జరిగింది. ఆయుధాలతో దాడి చేసిన దొంగలు లక్షల విలువ చేసే సొత్తును దోచుకెళ్లారు. ఆయుధాలు ధరించిన దాదాపు ఐదుగురు దొంగలు కిమ్ అపార్ట్మెంట్లో ప్రవేశించి ఆమెను తాళ్లతో కట్టేసి బాత్ రూం లో బందించారు. దాదాపు 80 లక్షలకు పైగా విలువ చేసే డబ్బు నగలను దోచుకెళ్లినట్టుగా సమాచారం. దొంగతనం విషయం తెలుసు కిమ్ భర్త, ప్రముఖ రాప్ సింగర్ కన్యే వెస్ట్ తన ప్రొగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని ఇంటికి చేరుకున్నారు. -
టీవీ నటికి తుపాకీతో బెదిరింపులు
పారిస్: హాలీవుడ్ రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. పారిస్ హోటల్ లో బస చేసిన ఆమెను ఆదివారం ఇద్దరు దుండగులు తుపాకీతో బెదిరించారు. పోలీసులు దుస్తులు ధరించి, ముసుగడు వేసుకుని వచ్చిన దుండగులు హోటల్ లోకి చొరబడ్డారని సీఎన్ఎన్ తెలిపింది. ఈ ఘటన జరిగినట్టు కిమ్ కర్దాషియన్ తరపు ప్రతినిధి ఇనా ట్రెకియోకాస్ ధ్రువీకరించారు. దుండగులు తుపాకీతో బెదిరించడంతో ఆమె వణికిపోయిందని వెల్లడించారు. అయితే ఆమెకు ఎటువంటి హాని చేయలేదని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కిమ్ కర్దాషియన్ నుంచి ఏమైనా దోచుకెళ్లారా, లేదా అనేది వెల్లడి కాలేదు. ఫ్యాషన్ వీక్ లో పాల్గొనేందుకు బుధవారం నుంచి ఆమె పారిస్ లో బస చేశారు. తన భార్యను దుండగులు బెదిరించారన్న వార్త తెలియగానే న్యూయార్క్ సిటీఫీల్డ్ లో మ్యూజిక్ అండ్ ఆర్ట్ ఫెస్టివల్ లో పాల్గొన్న కిమ్ కర్దాషియన్ భర్త కాన్ యె వెస్ట్ తన ప్రదర్శనను మధ్యలోనే ఆపేశారు. కుటుంబ సమస్య కారణంగా ప్రదర్శన నిలిపివేస్తున్నట్టు తెలిపారు. -
మళ్ళీ ఆ సెల్ఫీలతో కిమ్ కర్దాషియాన్..!
మియామీః హాలీవుడ్ శృంగార తార, రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ తన నగ్న సెల్ఫీలతో మరోమారు వార్తలకెక్కింది. సోషల్ మీడియా వేదికగా సెల్ఫీలు పోస్టు చేయడంలో పేరొందిన ఆమె.. తాజాగా తన చర్మ సౌందర్యాన్ని ప్రతిబింబించేట్టు తీసుకున్ననగ్న సెల్ఫీలను షేర్ చేసి అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నించింది. ఇటీవల సుమారు 31 కిలోల వరకూ బరువు తగ్గించుకొని మరింత స్లిమ్ గా తయారైన కిమ్... శరీరంపై నూలుపోగు లేకుండా ఓ హోటల్ గదిలో స్వీయ చిత్రాలకు పోజిచ్చింది. అంతేకాక వాటిని సామాజిక మాధ్యమంలో షేర్ చేయడం మరోమారు హాట్ టాపిక్ గా మారింది. ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లలో ఆమె పోస్టు చేసిన లేటెస్ట్ ఫోటోల్లో కిమ్.. పూర్తి శాతం నగ్నంగా కనిపిస్తోంది. అయితే కొన్ని శరీర భాగాలను మాత్రం చేతులతో కవర్ చేసిన ఈ సెల్ఫీ సుందరి.. ముఖానికి సెల్ ఫోన్ అడ్డుపెట్టి పాక్షికంగా కనపడేట్లు పోజిచ్చింది. సెక్సీ పోలారాయిడ్ ఫోటోలే తనకు స్ఫూర్తినిచ్చాయని గతంలో కిమ్ కర్దాషియాన్ చెప్పిన విషయం తెలిసిందే. మార్చి నెలలో ఓసారి సోషల్ మీడియాలో తన నగ్న ఫోటోలను షేర్ చేసి హల్ చల్ చేసిన ఈ 35 ఏళ్ళ ముద్దుగుమ్మ.. వార్తల్లో ప్రధానాంశంగా నిలవడంతో.. ఆమె వైఖరి పట్ల సహ నటులు క్లో మోరెట్జ్, బెట్టే మిడ్లర్ సైతం తీవ్ర విమర్శలు చేశారు. -
మా ఆయన చొక్కాలను దొంగిలించాను: నటి
'మా ఆయన ధరించే చొక్కాలు చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఆయన లేనప్పుడు చూసి వాటిని దొంగిలించి నేను వేసుకుంటాను. నేను వేసుకొనే చొక్కాలు నిజానికి సగం వరకు ఆయనవే' అంటోంది హాలీవుడ్ రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్. 35 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ర్యాపర్ కేన్యే వెస్ట్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా పీపుల్ మ్యాగజీన్ తో కిమ్ మాట్లాడుతూ 'వెస్ట్ తో డేటింగ్ చేయడం ప్రారంభించిన నాటినుంచి నా డ్రెసింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. రోజువారీగా అతని చొక్కాలు దొంగలించడం నాకు అలవాటైంది. చాలావరకు నేను అతని చొక్కాలు వేసుకుంటాను. నేను వేసుకొనే చొక్కాల్లో సగం వరకు అతనివి. సగం నావి ఉంటాయి. బటన్స్ తో కూడిన అతని డెనిమ్ షర్ట్స్ లో నేను బాగుంటాను' అని కిమ్ పేర్కొంది. వెస్ట్ ఫ్యాషన్ సెన్స్ తనను అబ్బురపరుస్తుందని, అతను ఫ్యాషన్ ప్రపంచంలోని ఎంతోమందిని తనకు పరిచయం చేశాడని తెలిపింది. తన బ్రాండెడ్ దుస్తుల్ని, షూలను మార్చమని వెస్ట్ చెప్పినప్పుడు మాత్రం తనకు చాలా బాధేసిందని చెప్పుకొచ్చింది. -
ఆ నటి.. ఉల్లిగడ్డలు నింపిన సంచట!
కొందరు సినీ ప్రముఖులు, క్రికెటర్లు, ఇతర సెలెబ్రిటీలు మీడియాతో కానీ సోషల్ మీడియాలో కానీ సంబంధంలేని వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇవి తమాషాగా, మరికొన్నిసార్లు వివాదాస్పదంగా ఉంటాయి. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ముడిపెడుతూ పొంతనలేని మాటలు చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే మన రాష్ట్రపతి పేరును కరెక్ట్‌గా చెప్పకపోవడం, ప్రధాని పేరునేమో రాష్ట్రపతి అని చెప్పిన ప్రముఖులు కూడా ఉన్నారు. మాట్లాడేముందు కనీసం ఆలోచించకుండా ఏవేవో చెప్పేసి ఆనక నాలుక్కరుచుకుంటుంటారు. వీరి తెలివితేటలు చూసి సామాన్యులు షాక్ తింటుంటారు. ఇలాంటి ప్రముఖుల జాబితాలో బాలీవుడ్ వెటరన్ హీరో రిషీ కపూర్ చేరాడు. రిషీ కపూర్ దృష్టి అమెరికా పాపులర్ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియన్‌పై పడింది. కర్దాషియన్‌ను పోల్చడానికి మన వెటరన్ స్టార్‌కు మనుషులు లేదా జంతువులు ఎవరూ నచ్చలేదేమో కూరగాయలు గుర్తుకొచ్చాయి. కిమ్ కర్దాషియన్‌ను.. ఉల్లిగడ్డలు నింపిన సంచితో పోల్చాడు. ఉల్లిగడ్డల సంచిని, ఇదే రకం డ్రస్ వేసుకున్న కర్దాషియన్ ఫొటోలను పక్కపక్కనపెట్టి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఏ చోట నుంచైనా స్ఫూర్తి పొందవచ్చని కామెంట్ చేశారు. రిషీ కపూర్ గారి ఉల్లిఘాటు అమెరికాలో ఉన్న కర్దాషియన్‌కు తగిలిందో లేదో తెలియదు కానీ.. నెటిజెన్లు మాత్రం దీనిపై తెగ జోకులేసుకుంటున్నారు. -
ఆ వీడియోలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది!
లండన్: రియాల్టీ టీవీ స్టార్, మోడల్ కిమ్ కర్దాషియన్ ఆందోళన చెందుతోంది. అల్టాన్ స్టెర్లింగ్, ఫిలాండ్ కాస్టిల్ కాల్పుల ఘటనల వల్ల ఆమె కాస్త ఆప్ సెట్ అయింది. ఇలా ఎక్కడ పడితే అక్కడ కాల్పులు జరిగి అమాయకులు చనిపోతున్నారని, దీంతో తన ఇద్దరు పిల్లలు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని పేర్కొంది. చిన్నారులు నార్త్(3), సెయింట్(7 నెలలు) కిమ్ సంతానం. కాగా, పోలీసులే కాల్పులు జరిపి ఇద్దరు అమాయక నల్లజాతి వారిని హతమార్చడం చాలా బాధాకరమని ఉద్వేగానికి లోనైంది. నిజానికి ఆ వీడియోలు చూస్తే కడపు తరుక్కుపోతోందని, మాటలు కరువయ్యాయని చెప్పింది. పోలీసులను చూసి భయపడవద్దని తన పిల్లలకు నేర్పిస్తానంటోంది. ఎందుకంటే ఇటీవల ఘటనను వీడియోలో చూసిన తర్వాత తీవ్ర ఆవేశానికి లోనయ్యానని, మనుషుల రంగు అనేది ఇక్కడి భద్రతా సిబ్బందికి ముఖ్యాంశంగా మారిందని చెప్పింది. అమెరికా ప్రజలందరం కలిసి పోరాడి వ్యవస్థలో మార్పులు తీసుకొస్తేనే భవిష్యత్తు తరాలకు మనుగడ ఉంటుందని తన వ్యక్తిగత వెబ్ సైట్ లో హాలీవుడ్ స్టార్ కిమ్ కర్దాషియన్ రాసుకొచ్చింది. ప్రజల కోసం ప్రాణాలర్పించే పోలీసులు కూడా ఉన్నారని అందుచేత శాంతియుతంగా పోరాటం సాగిద్దామంటూ సూచించింది. -
మేకప్ లేకుండా బయటకు వచ్చిన బ్యూటీ!
ఇంటర్నెట్ బ్యూటీ ఐకాన్, సెల్ఫీ క్వీన్ గా పేరొందిన కిమ్ కర్దాషియన్ ఇటీవల తన అభిమానులకు స్వీట్ షాకిచ్చింది. శుక్రవారం ఆమె షేర్ చేసిన స్నాప్‌చాట్ వీడియోలో మేకప్ లేకుండా సహజంగా దర్శనమిచ్చింది. మేకప్ లేకుండా ఇదిగో నేను ఇలా ఉంటానంటూ ఈ 35 ఏళ్ల బ్యూటీ ఈ వీడియోలో కనిపించింది. కారులో తీసిన కిమ్ అభిమానుల్ని బాగానే అలరిస్తోంది. ఇటీవల 'బ్రేక్ ద ఇంటర్నెట్ అవార్డు' గెలుచుకున్న ఈ అమ్మడు.. చనిపోయేవరకు తన 'న్యూడ్ (నగ్న) సెల్ఫీలు' సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ప్రకటించింది. నిత్యం సోషల్ మీడియా దృష్టిని తనవైపు తిప్పుకోవడానికి అనేక జిమ్మిక్కులు చేసే కిమ్ ఆ మధ్య తన న్యూడ్ సెల్ఫీ పోస్టు చేసి కలకలం రేపిన సంగతి తెలిసిందే. -
'ఆమె ఓ సీక్రెట్ ఏజెంట్.. మేం వదలం'
లాస్ ఎంజెల్స్: ప్రముఖ టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియాన్ సామాజిక అనుసంధాన వేధిక ఇన్స్టాగ్రామ్ సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేస్తుందని ఇరాన్‌కు చెందిన నైతిక విలువల సంస్థ ఒకటి ఆరోపించింది. ఇస్లాం మతాన్ని దెబ్బతీసేలా యువకులను ఆకట్టుకునేందుకు ఆమె పలు అసభ్యకరమైన ఫొటోలను అందులో పెడుతోందంటూ ఆ సంస్థ మండిపడింది. ఈ వ్యవహారాన్ని తాము అంత తేలికగా తీసుకోవాలని అనుకోవడం లేదని కూడా స్పష్టం చేసింది. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ కు చెందిన ది ఆర్గనైజడ్ సైబర్ స్పేస్ క్రైమ్స్ విభాగం ఈ మేరకు వివరాలు తెలియజేస్తూ ఒక అజెండాలో భాగంగానే కిమ్ కార్దర్షియాన్ ఇన్ స్టాగ్రామ్ కోసం సీక్రెట్ ఏజెంట్ గా పనిచేస్తుందని.. తన ఫొటోల ద్వారా యువకులను, మహిళలను ఆకర్షించడమే లక్ష్యంగా ఆమె పనిచేస్తోందని.. ఇందుకుగాను ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులు కూడా అందుతున్నాయని ఆ సంస్థ వెల్లడించింది. ఇరాన్లో ఇన్ స్టాగ్రమ్, ఫేస్ బుక్ వాడకంపైన ఇప్పటికీ పరిమితులు ఉన్నాయి. -
చచ్చేవరకూ న్యూడ్ సెల్ఫీలు పోస్టు చేస్తా!
లాస్ ఏంజిల్స్: సెల్ఫీ క్వీన్, హాలీవుడ్ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియన్ తాజాగా అభిమానులకు చిలిపి వరాన్ని ప్రసాదించింది. తాను చనిపోయేవరకు 'న్యూడ్ (నగ్న) సెల్ఫీలు' దిగుతూ.. వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటానని తాజాగా హామీ ఇచ్చింది. 35 ఏళ్ల ఈ ముద్దుగుమ్మను తాజాగా 'బ్రేక్ ద ఇంటర్నెట్ అవార్డు' వరించింది. 20వ వార్షిక వెబ్బీ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా మొట్టమొదటిసారిగా ప్రకటించిన ఈ అవార్డును కిమ్ కర్దాషియన్‌కు ప్రదానం చేశారు. ఈ గౌరవాన్ని అందుకున్న సందర్భంగా ఆమె వేదికపై మాట్లాడుతూ.. తన జీవితాంత నగ్న సెల్ఫీలు దిగి.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని తెలిపింది. నగ్నంగా సెల్ఫీలు దిగడం ఈ భామకు కొత్తకాదు. గత ఏడాది తన నగ్న సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టుచేసి.. కిమ్ పెద్ద దమారమే రేపింది. ఆమె చర్యను పలువురు తప్పుబట్టగా.. మరికొందరు హాలీవుడ్ సినీ స్టార్లు మాత్రం కిమ్ దారిలో సాగుతూ.. తమ న్యూడ్ సెల్ఫీలను అభిమానులతో పంచుకున్నారు. -
ఆమె న్యూడ్ సెల్ఫీ ట్రెండ్ సృష్టించింది..!
హాలీవుడ్ టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియన్ చేసిన ఓ పని న్యూడ్ సెల్ఫీలకు మార్గనిర్దేశం చేసినట్లయింది. తనను విమర్శించిన వారికి జవాబుగా కిమ్ నగ్నంగా దిగిన సెల్ఫీని ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో షేర్ చేయడం.. ఆపై ఈ సెల్ఫీ పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆమె తీరును సోషల్ మీడియాలో పలువురు తప్పుబడుతుండగా, మరికొందరు నగ్నంగా తమ దేహాన్ని చూపిస్తూ ఆమె తరహాలోనే సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 'లిబరేటెడ్' (విముక్తి) అని అనే హ్యాష్‌ట్యాగ్ ను కిమ్ వాడటంతో దీని నుంచి ప్రేరణ పొందినట్లుగా కొందరు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ట్విట్టర్ యూజర్ లెజ్ విత్ అనే వ్యక్తి తాను న్యూడ్ గా సెల్ఫీ దిగి కిమ్ ఫొటోను ఆదర్శంగా తీసుకున్నాడు. ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశాడు. బ్రేక్ ఇంటర్ నెట్ అనే క్యాప్షన్ తో కర్దాషియన్ నెటిజన్లకు తన సత్తా ఏంటో చూపించాలని చేసిన ప్రయత్నం బాగానే వర్క్ అవుట్ అయినట్లుంది. మరోవ్యక్తి కిమ్ తో పాటు తన ఫొటోను కలిపి పోస్ట్ చేసి సంచలనం చేశాడు. బ్రేక్ ద ఇంటర్ నెట్ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో పాటు న్యూడ్ సెల్ఫీ విచిత్రమైన ట్రెండును సృష్టించింది. సెలెస్ట్ బార్బర్ అనే మహిళ కూడా ఈ న్యూడ్ సెల్ఫీ వెర్రికి ప్రయత్నించింది. తాను కూడా ఒంటిపై నూలు పోగు లేకుండా న్యూడ్ గా ఫొటో దిగింది. కిమ్ ఫొటోతో తన ఫొటోను జత చేస్తూ తన బోల్డ్ బాడీపై 'ఐ నీడ్ అటెన్షన్' అని వ్యాఖ్యాన్ని రాసి పోస్ట్ చేసింది. మరికొందరు కిమ్ న్యూడ్ ఫొటోకి సరిపోయే డ్రస్సులను ఫొటోషాప్ చేసి చేసి పోస్ట్ చేశారు. మొత్తానికి 35 ఏళ్ల కిమ్ కర్దాషియన్ తన ఛాతి, ప్రైవేటు అంగాలు కనిపించకుండా రెండు చేతులు అడ్డుపెట్టుకొని దిగిన ఈ ఫొటోను పోస్టు చేయడం.. న్యూడ్ సెల్ఫీ ట్రెండ్ కు ఆధ్యం పోసిందంటూ మరికొందరు ఆమెపై మండిపడుతున్నారు. -
మరో న్యూడ్ ఫొటోతో ఘాటు సమాధానం!
హాలీవుడ్ టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియన్ తన విమర్శకులకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. కిమ్ నగ్నంగా దిగిన సెల్ఫీని ట్విట్టర్లో షేర్ చేయడంపై దుమారం రేగింది. ఆమె తీరును సోషల్ మీడియాలో పలువురు తప్పుబట్టారు. నగ్నంగా దేహాన్ని చూపిస్తూ ఆమె క్రేజ్ తెచ్చుకోవాలని భావిస్తున్నట్టు సెలబ్రిటీలైన బెట్ మిడ్లర్, క్లోహి మోరెట్జ్, పీర్స్ మోర్గాన్ తదితరులు విమర్శించారు. ఈ విమర్శలకు సమాధానంగా కిమ్ కర్దాషియన్ మరో న్యూడ్ ఫొటోను ట్విట్టర్లో పెట్టింది. దీనికి 'లిబరేటెడ్' (విముక్తి) అని అనే హ్యాష్‌ట్యాగ్ జోడించింది. 35 ఏళ్ల కిమ్ కర్దాషియన్ ఈ ఫొటోలో బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్‌లో తన అందాలను క్లాసికల్‌గా చూపించింది. తన ఛాతి, ప్రైవేటు అంగాలు కనిపించకుండా రెండు చేతులు అడ్డుపెట్టుకొని దిగిన ఈ ఫొటోను తన విమర్శకులకు సమాధానంగా పోస్టు చేసింది. తనపై విమర్శలు చేసిన క్లోహి మోరెట్జ్, బెట్ మిడ్లర్‌పై ఘాటుగా విరుచుకుపడుతూ వ్యాఖ్యలు చేసింది. టీన్ స్టార్ క్లోహి మోరెట్జ్ కిమ్ తీరును ట్విట్టర్లో ఏకిపారేసింది. యువతులు గొప్ప లక్ష్యాలు నిర్దేశించుకునేలా మార్గనిర్దేశం చేయాల్సిన అవసరముందని, ఈ విషయాలేవీ చెప్పకుండా అస్తమానం దేహాన్ని ప్రదర్శించడం అంత మంచిది కాదని కిమ్‌కు హితవు పలికింది. సెలబ్రిటీ స్టేటస్‌కు ఎంత గౌరవముంటుందని, దానిని ఇలా బజారుకీడ్చడం సరికాదని, తాను ఇలాంటి పనులు ఎప్పటికీ చేయబోనని 19 ఏళ్ల క్లోహి స్పష్టం చేసింది. -
ప్రసవమైన 13వారాలకే నగ్నంగా సెల్ఫీ!
లాస్ఏంజిల్స్: ధైర్యమంటే తనదేనని టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియన్ మరోసారి నిరూపించింది. ఇటీవలే ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ ముద్దుగుమ్మ నగ్నంగా సెల్ఫీ దిగి.. సోషల్ మీడియాకు కిర్రెక్కించింది. ట్విట్టర్లో షేర్ చేసిన ఈ సెల్ఫీలో కిమ్ ఒంటిపై నూలుపోగులేకుండా దర్శనమిచ్చింది. మార్బుల్ బాత్రూమ్లో అద్దం ముందు నిలబడి తన అందాలను స్వయంగా సెల్ఫీలో బంధించింది ఈ అమ్మడు. అయితే, ఈ ఫొటోలో ప్రైవేటు అంగాలు పూర్తిగా కనబడకుండా రెండు బ్లాక్ మార్క్స్ తో కవర్ చేసింది. 'నేను ఏమీ ధరించకపోవడం మీకిష్టం కదా.. లోల్' అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ పెట్టింది. గతంలోనూ కిమ్ కర్దాషియన్ ఇలాంటి హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే ప్రస్తుతం పెట్టిన సెల్ఫీ కొన్నివారాల కిందటిదై ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో ఆమె పెట్టుకున్న లాంటి విగ్గే .. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లోనూ కిమ్ ధరించింది. కిమ్, కెన్యే వెస్ట్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ దంపతులకు రెండేళ్ల కూతురు నార్త్ ఉండగా.. గత డిసెంబర్లో సెయింట్ అనే మగపిల్లాడు జన్మించాడు. -
కుటుంబం పరువు తీస్తున్న అల్లుడు!
హాలీవుడ్ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ భర్త కెన్యే వెస్ట్ అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతుండటంతో ఇంటిపెద్ద క్రిస్ జెన్నర్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నదట. కర్దాషియన్ బ్రాండ్‌ను అల్లుడు ఘోరంగా దెబ్బతీస్తున్నాడని ఆమె మథనపడుతున్నది. రియాల్టీ టీవీ షోలు, ఫ్యాషన్ షోలతో క్రిస్ జెన్నర్ హాలీవుడ్లో తమ కుటుంబానికి ఒక బ్రాండ్ ఇమేజ్ను సృష్టించింది. తన కూతురు కిమ్ భర్త ఆ 'బ్రాండ్ ఇమేజ్'ను దెబ్బతీస్తుండటంతో.. అల్లుడి వ్యవహారాలను చూసేందుకు ఆమె ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌ను కూడా నియమించాలని భావిస్తున్నది. కిమ్ కర్దాషియన్, వెస్ట్ దంపతులకు రెండేళ్ల కొడుకు నార్త్, రెండు నెలల కూతురు సెయింట్ ఉన్నారు. అయితే ఇటీవల ట్విట్టర్లో ఇష్టమొచ్చినట్టు పేలుతూ వెస్ట్ రెచ్చిపోతున్నాడు. ఇటీవల తాను పాడిన కొత్త పాటల్లోనూ పాప్ సింగర్ టైలర్ స్విఫ్ట్‌ను తిడుతూ.. ఆమెను తానే ఫేమస్ చేశానని పేర్కొంటూ దుర్భాషలాడాడు. దీంతో అతని అసభ్య వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. అయినా అతను తీరు మార్చుకోకుండా అడ్డూ అదుపులేకుండా ప్రవర్తిస్తుండటంతో వెస్ట్ ను కట్టడి చేయాలని క్రిస్ జెన్నర్ భావిస్తున్నదని ఆమె సన్నిహితులు తెలిపారు. భార్య కిమ్ కర్దాషియన్ తో వెస్ట్.. -
వీడు కొంచెం తేడా!
ఆ మధ్య హాలీవుడ్లో పెద్ద దుమారం... స్కాం... బ్లాక్‌మెయిలింగ్ ఎపిసోడ్ నడిచింది. అదే... స్టార్ హీరోయిన్ల ప్రైవేటు నగ్న చిత్రాలు పోస్ట్ చేయడం. ఆ తుంటరెవరో వెబ్సైట్ ఒకటి పెట్టి... చూస్కోండంటూ అందులో కౌంట్‌డౌన్ ఇచ్చి మరీ సదరు పిక్చర్స్ రిలీజ్ చేసి సంచలనం రేపాడు. అప్పుడు బాధిత గుమ్మలంతా కారకులపై తెగ ఫైరయ్యారు. ఇదంతా ఆకతాయిలు నడిపిన ఓ ‘డార్క్’ స్టోరీ! మళ్లీ అలాంటి పిక్చర్సే బయటకు వచ్చాయి. రియాల్టీ షోస్‌తో స్టార్డమ్ తెచ్చేసుకున్న కిమ్ కర్దాషియన్ నగ్న చిత్రాలు ఇప్పుడు సామాజిక సైట్లలో వైరస్‌లా పాకేస్తున్నాయి. ఒకటీ అరా కాదు... నాలుగైదు ఫొటోలు రకరకాల పోజుల్లో అప్లోడ్ అయిపోయాయి. విశేషమేమంటే... ఇవి చూసిన కిమ్ కూడా తెగ మురిసిపోతోంది. పోస్ట్ చేసినందుకు ప్రేమగా థ్యాంక్యూ చెప్పింది. ఇంతకీ ఆ అప్లోడ్ హీరో ఎవరనేగా..! ఇంకెవరు... స్వయానా కిమ్ హజ్బెండ్ కానె వెస్ట్!!! -
కాండీ టచ్!
వింత వింత చేష్టలు... గెటప్‌లతో ఎప్పుడూ న్యూస్‌లో ఉండే అమెరికన్ రియాల్టీ షో స్టార్ కిమ్ కర్దాషియన్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు తన అందచందాలతో అలరించిన అమ్మడు... లేటెస్ట్గా హెయిర్ కలర్ మార్చి, ఆ పిక్చర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేసింది. ఇక చెప్పేదేముంది..! ఒకటే లైకులు... షేర్లు... కామెంట్లు! ‘వాస్తవానికి మడోనా హెయిర్ కలర్ నన్ను బాగా ఇంప్రస్ చేసింది. ఆ ప్రభావంతోనే నేనూ జుట్టు రంగు మార్చుకున్నా. ప్లాటినమ్ హెయిర్డ్ మడోనా పిక్చర్ ఎప్పుడూ నా కంప్యూటర్ రిఫరెన్స్ ఫోల్డర్లో ఉంటుంది. ఈ లుక్ కోసం చాలా రోజులు వేచి చూడాల్సి వచ్చింది. ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయడానికి ప్యారిస్ ఫ్యాషన్ వీక్ కంటే పెద్ద సందర్భం ఏముంటుంది! కానీ... ఈ నిర్ణయం ముందుగా ప్లాన్ చేసుకున్నది కాదు. లాస్ట్ మినిట్‌లో తీసుకున్నది’ అంది కిమ్! -
కేర్ టేకర్!
రియాల్టీ షో స్టార్ కిమ్ కర్డాషియన్ ఏం చేసినా సంచలనమే. నటించినా.. బయట తిరిగినా.. రిలేషన్స్ మెయిన్‌టెయిన్ చేసినా..! చెప్పొచ్చేదేమంటే... గ్లామర్ ఫీల్డ్‌లో పర్సనల్ మ్యాకప్మ్యాన్స్ ఉండటం కామనే. కానీ... ఈ అమ్మడు మరికాస్త ముందుకెళ్లింది. మ్యాకప్ను మరింత పర్సనల్ టచ్‌కు ఉపయోగించుకుంటుందట! అధరాలు, కనుబొమ్మలు, బుగ్గలు... ఓకే! ఈ సెక్సీ తార ఎద సంపదకూ టచప్ల కోసం స్పెషల్‌గా మ్యాకప్ ఉమన్‌ను పెట్టుకుందట! ఇది విని సామాన్యులే కాదు.. హాలీవుడ్ తారలూ కొత్తగా ఫీలయ్యారట. ‘ఇప్పటి వరకు కిమ్ గ్లామర్‌ను ఒక కోణంలోనే చూశారు. నిజానికి ఆమెలో ప్రతిదీ స్పెషలే. మెరుగులు అద్దితే ఈ అందం మరింత వికసిస్తుంది. అందుకే ఈ ప్రయత్నం’ అంటూ ఆమె హబ్బీ కాన్యే వెస్ట్ చెప్పాడన్నది ‘ది సన్’ పత్రిక కథనం. మొత్తానికి తన వంపుసొంపులతో పురుష పుంగవులకు నిద్దర లేని రాత్రులు మిగులుస్తోంది కిమ్! -
లేటు వయసులో పెళ్లికి సిద్ధమవుతున్న టీవీ నటి!
లండన్: టీవీ రియాల్టీ స్ట్తార్ క్రిస్ జెన్నీర్, బాయ్ ఫ్రెండ్ కోరీ గ్యాంబెల్ ల ప్రేమాయణం ముదిరి పాకాన పడింది. త్వరలో గ్యాంబెల్ ను పెళ్లి చేసుకోవడానికి 59 ఏళ్ల క్రిస్ సిద్ధమవుతోంది. గ్యాంబెల్ ప్రేమలో మునిగి తేలుతున్న క్రిస్ కు అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ప్రేయసి ఇంట్లోనే ఉంటున్నగ్యాంబెల్ కు అన్నీ తానై చూసుకుంటోంది క్రిస్. ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులకు కూడా గ్యాంబెల్ ను పరిచయం చేసిన క్రిస్.. అతనితో జీవితాన్ని పంచుకోవాలని భావిస్తోంది. అయితే దీనిపై కుమార్తెలు కిమ్ కర్దాషియన్, కర్టీ కర్దాషియాన్ లు తెగ మదనపడుతున్నారు. 2013 అక్టోబర్ లో బ్రూస్ జెన్నీర్ తో 23 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకున్న క్రిస్ మరో పెళ్లికి సిద్ధమవుతుండటం పట్ల కుమార్తెలు కలత చెందుతున్నారు. 60 ఏళ్లు పై బడిన గ్యాంబెల్ తో ప్రేమాయణం సాగిస్తున్న క్రిస్ 'పెళ్లి అడుగులు' ఎప్పుడు పడతాయో వేచి చూడాల్సిందే. -
కిస్.. పాపులర్!
రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్, కన్యా వెస్ట్స్ వెడ్డింగ్ పిక్చర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో కేక పుట్టిస్తున్నాయి. అన్నింటిలోకి వెడ్డింగ్ డేలో ఇద్దరి ఫస్ట్ కిస్ నెటిజన్లకు తెగ కిక్కు ఇచ్చింది. ఈ దెబ్బకు ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు బద్దలైంది. మొత్తం 2.4 మిలియన్ లైక్స్‌తో సంచలనం రేపింది. ‘2014లో మోస్ట్ లైక్డ్ పోస్ట్’గా కొత్త రికార్డు రాసింది. ఈ ఏడాది మే 24న కిమ్ పెళ్లి జరిగింది. జస్టిన్ బీబర్, సెలెనా గోమేజ్ల ముద్దు 1.9 మిలియన్ పీపుల్‌కు నచ్చిందట. మాజీ డిస్నీ స్టార్ అరియానా గ్రాండే... మిలే సిరస్ బుగ్గపై ముద్దాడుతున్న చిత్రం (1.84 మిలియన్) మూడో స్థానం దక్కించుకుంది. -
టాప్ సెర్చ్!
రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ పాపులారిటీ అంతకంతకూ పెరిగిపోతోంది. టీవీ షోల్లోనే కాదు... సెర్చ్ ఇంజిన్‌లో కూడా అమ్మడు దూసుకుపోతోంది. మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ ‘బింగ్’లో ఈ చిన్నదాని కోసం తెగ వెతికేశారట నెటిజన్లు. ఈ దెబ్బకు బింగ్ 2014 టాప్ సెర్చింగ్ లిస్ట్‌లో కర్దాషియనే టాప్! హాలీవుడ్ మెగాస్టార్లను వెనక్కి నెట్టి మరీ ఈ పొజిషన్ దక్కించుకుంది కిమ్. ఈ టాప్ లిస్టులో బియోన్స్, మిలీ సిరస్, క్యాటీ పెర్రీ, జస్టిన్ బైబర్, జోన్ రివర్స్, జెనిఫర్ లోపెజ్, కిండాల్ జెన్నర్, కాలె కువాకో, రాబిన్ విలియమ్స్ వరుసగా తరువాతి స్థానాల్లో ఉన్నారు. -
'ఆ పెళ్లి నాకు ఓ జీవితపాఠం'
న్యూఢిల్లీ: క్రిస్ హాంప్రస్ ను పెళ్లి చేసుకోవడం.. ఆపై విడాకులు తీసుకోవడం తనకు ఓ జీవితపాఠమని హాలీవుడ్ శృంగార తార, రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ అభిప్రాయపడింది. 2011వ సంవత్సరం ఆగస్టు నెలలో హాంప్రస్ ను పెళ్లాడిన ఈ అమ్మడు.. అదే సంవత్సరం అక్టోబర్ లోనే విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. కేవలం 72 రోజుల పాటు మాత్రమే హాంప్రస్ తో వైవాహిక జీవితాన్ని పంచుకున్న కర్దాషియాన్ తనకు అదో జీవితపాఠంగా మిగిలిపోతుందని పేర్కొంది. ' ప్రతీ ఒక్కరి జీవితంలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ తరహాలోనే ఇది కూడా. వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవాలి' అని కిమ్ వయ్యారాలు ఒలకబోసింది. పెళ్లి అయిన వెంటనే కిమ్ విడాకులు కోరినా.. హాంప్రస్ తో తెగతెంపులకు 2013 ఏప్రిల్ నెల వరకూ ఆగాల్సి వచ్చింది. ప్రస్తుతం సింగర్ కెన్యే వెస్ట్ ను పెళ్లాడటానికి ఈ సెక్సీ సుందరి రెడీ అవుతోంది. -
వీడెవడండీ బాబూ!
వెండి తెరపై కనిపించే తారలను ‘పిచ్చి’గా ప్రేమించే వార్ని చూశాం. కానీ.. వీడెవడండీ బాబు..! ఇంత తేడాగా ఉన్నాడు..! సెలబ్రిటీలపై ‘చేయి’ చేసుకొని దురద తీర్చుకోవడం ఇతగాడి సరదానట! పేరు విటాలీ సెడూక్. లేటెస్ట్గా ప్యారిస్‌లో ఫ్యాషన్ వీక్‌కు వెళ్లిన రియాల్టీ షో స్టార్ కిమ్ కర్దాషియాపై తెగబడ్డాడు. ఆమెను గట్టిగా లాగితే... పాపం కింద పడినంత పనైంది. షాక్ నుంచి తేరుకున్న సెక్యూరిటీ.. అతగాడిని పట్టుకుని చితకబాదారు. తీగ లాగితే.. గతంలో లియో డికాప్రియో, బ్రాడ్ పిట్, విల్‌స్మిత్ వంటి సూపర్స్టార్సపై పడినట్టు గొప్పగా చెప్పుకొంటున్నాడట. -
న్యూ యోగా.. ఓకే!
క్రియేటివిటీని కొత్త పుంతలు తొక్కించాలనుకున్నారో, రొటీన్‌కు కాస్త భిన్నంగా ఫీలవ్వాలనిపిం చిందో.. రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్, ఆమె ర్యాప్‌స్టార్ హజ్బెండ్ కానె వెస్ట్.. యోగాను వినూత్నంగా ఎంజాయ్ చేశారు. మ్యారేజ్ లైఫ్‌లో పరవళ్లు తొక్కుతున్న ప్రేమను ఆసాంతం ఆస్వాదించాలనుకున్న ఈ జంట.. నగ్నంగా యోగా క్లాసుల్లో మునిగితేలింది. ఎప్పుడూ బిజీగా ఉండే మనసులకు కాసింత రిలాక్స్నివ్వాలనే ఆలోచన కిమ్‌ది. దానికి కార్యరూపమే ఇది. అంతేకాదు.. మిగిలిన ‘హోమ్ వర్క్’ కూడా ఇలానే చేసేసి ఫుల్‌గా కూల్ అయిందట ఈ జంట. -
భర్తతో కలసి నటి నగ్న యోగాసనాలు
లాస్ ఏంజిల్స్: నటి, టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో ఉంటుంది. తన భర్తకు ప్రశాంతత చేకూర్చడానికి, వైవాహిక జీవితం సంతోషంగా సాగడానికి ఈ అమ్మడు వినూత్న మార్గం ఎంచుకుంది. కిమ్ తన భర్త కేనీ వెస్ట్‌తో కలసి నగ్నంగా యోగా చేస్తోంది. కిమ్ దంపతులు ప్రత్యేకంగా ఓ యోగా శిక్షకుడిని నియమించుకుని ఇంట్లోనే ఈ తతంగం కానిస్తున్నారని ఓ వెబ్సైట్ పేర్కొంది. వెస్ట్ ఇంతకుముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోలేక ఇబ్బందిపడేవాడట. దీంతో ఇద్దరు కలసి యోగ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని కిమ్ భర్తకు సలహా ఇచ్చింది. కిమ్ ప్రతిపాదన వెస్ట్‌కు నచ్చడంతో ఇద్దరూ ఇంట్లోనే నగ్నంగా యోగా చేస్తున్నారు. దీనివల్ల కిమ్‌కు ప్రశాంతం చేకూరడంతో పాటు మరింత ఉపశమనం లభించింది. అంతేగాక యోగా వారి ప్రేమ జీవితాన్ని ఆనందడోలికల్లో ముంచెత్తుతోందట. -
మరో సారి వార్తల్లోకి 'సెల్ఫీ' గర్ల్!
న్యూయార్క్:అమెరికా సెక్సీ మోడల్ కిమ్ కర్దాషియాన్ పేరు విననివారుండరంటే నమ్మండి. తన అందచందాలతో యాత్ ని ఒక ఊపు ఊపారు. కర్దాషియాన్ తన మనసులోని మాటలను కొన్నింటిని తరుచు బయటపెడుతూ అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. అయితే మొన్నామధ్య 'సెల్పిష్' బుక్ తో వస్తున్నానని ప్రకటించిన కర్దాషియాన్.. ప్రస్తుతం ఆ పనిలోనే నిమగ్నమైందట. ఆ సెల్పీ బుక్ ను తప్పకుండా అభిమానుల ముందుకు తీసుకువస్తానని గారాలు పోతుంది ఈ 33 ఏళ్ల చిన్నది. అసలు తనకు ఈ ఐడియా ఎలా వచ్చిందో కూడా వ్యక్తికరీంచింది. ఒకానొక వాలైంటెన్స్ డే సందర్భంలో చూసిన 'సెక్సీ పొలారాయిడ్'ఫోటోలే తన మదిలో ఆలోచనలో రేకిత్తించాయని.. దాంతోనే ఆ పుస్తకాన్ని రాయడానికి శ్రీకారం చుట్టడానికి పూనుకొంటున్నట్లు తెలిపింది. అయితే వచ్చే ఏడాది కానీ అభిమానుల చెంతకు చేరదు. ఈ 'సెల్ఫిష్' పుస్తకం ఏప్రిల్ 7 వ తేదీ నాటికి విడుదల చేస్తానని కిమ్ స్పష్టం చేసింది. 352 పేజీలు ఉన్న ఈ పుస్తకం ఖరీదు దాదాపు రూ.1,200.