ఆ వీడియోలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది! | Kim Kardashian West's fear for her kids | Sakshi
Sakshi News home page

ఆ వీడియోలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది!

Published Sun, Jul 10 2016 8:39 AM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

ఆ వీడియోలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది! - Sakshi

ఆ వీడియోలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది!

లండన్: రియాల్టీ టీవీ స్టార్, మోడల్ కిమ్ కర్దాషియన్ ఆందోళన చెందుతోంది. అల్టాన్ స్టెర్లింగ్, ఫిలాండ్ కాస్టిల్ కాల్పుల ఘటనల వల్ల ఆమె కాస్త ఆప్ సెట్ అయింది. ఇలా ఎక్కడ పడితే అక్కడ కాల్పులు జరిగి అమాయకులు చనిపోతున్నారని, దీంతో తన ఇద్దరు పిల్లలు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని పేర్కొంది. చిన్నారులు నార్త్(3), సెయింట్(7 నెలలు) కిమ్ సంతానం. కాగా, పోలీసులే కాల్పులు జరిపి ఇద్దరు అమాయక నల్లజాతి వారిని హతమార్చడం చాలా బాధాకరమని ఉద్వేగానికి లోనైంది.

నిజానికి ఆ వీడియోలు చూస్తే కడపు తరుక్కుపోతోందని, మాటలు కరువయ్యాయని చెప్పింది. పోలీసులను చూసి భయపడవద్దని తన పిల్లలకు నేర్పిస్తానంటోంది. ఎందుకంటే ఇటీవల ఘటనను వీడియోలో చూసిన తర్వాత తీవ్ర ఆవేశానికి లోనయ్యానని, మనుషుల రంగు అనేది ఇక్కడి భద్రతా సిబ్బందికి ముఖ్యాంశంగా మారిందని చెప్పింది. అమెరికా ప్రజలందరం కలిసి పోరాడి వ్యవస్థలో మార్పులు తీసుకొస్తేనే భవిష్యత్తు తరాలకు మనుగడ ఉంటుందని తన వ్యక్తిగత వెబ్ సైట్ లో హాలీవుడ్ స్టార్ కిమ్ కర్దాషియన్ రాసుకొచ్చింది. ప్రజల కోసం ప్రాణాలర్పించే పోలీసులు కూడా ఉన్నారని అందుచేత శాంతియుతంగా పోరాటం సాగిద్దామంటూ సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement