Kim Kardashian Lookalike Christina Ashten Died Hours After Plastic Surgery - Sakshi
Sakshi News home page

Christina Ashten Gourkani Death: ప్లాస్టిక్‌ సర్జరీ వికటించడంతో మోడల్‌ మృతి

Published Fri, Apr 28 2023 12:40 PM | Last Updated on Fri, Apr 28 2023 1:48 PM

Kim Kardashian Lookalike Christina Ashten Died Hours after Plastic Surgery - Sakshi

చాలామందికి సెలబ్రిటీ అవ్వాలని కోరికగా ఉంటుంది. కానీ కొందరు ఓ అడుగు ముందుకేసి ఏకంగా సెలబ్రిటీలా కనిపించేందుకు ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు సర్జరీలు వికటించడంతో మృత్యువాత కూడా పడుతున్నారు. ఇటీవలే పాప్‌ సింగర్‌ జిమిన్‌లా కనిపించేందుకు 12సార్లు సర్జరీ చేయించుకున్న సెయింట్‌ వాన్‌ మృతి చెందిన విషయం తెలిసిందే! తాజాగా అమెరికన్‌ స్టార్‌ కిమ్‌ కర్దాషియన్‌లా కనిపించేందుకు సర్జరీ చేయించుకున్న ఓ మోడల్‌ గుండెపోటుతో కన్నుమూసింది.

వివరాల్లోకి వెళితే.. మోడల్‌ క్రిస్టినా అస్తెన్‌ గౌర్కానీ(34) అచ్చం కిమ్‌ కర్దాషియన్‌లా మారిపోవాలనుకుంది. ఇందుకోసం ఆమె పలు సర్జరీలు చేసుకోగా అందరూ తనను కర్దాషియన్‌కు జిరాక్స్‌ కాపీలా ఉన్నావని పొగిడేవారు. తాజాగా ఆమె మరో సర్జరీ చేయించుకోగా అది వికటించడంతో గుండె పనితీరుకు అవాంతరం ఏర్పడింది. ఫలితంగా ఆమెకు ఏప్రిల్‌ 20న గుండెపోటు రావడంతో కన్నుమూసింది. ఈ విషయాన్ని క్రిస్టినా కుటుంబం ఆలస్యంగా సోషల్‌ మీడియాలో వెల్లడించింది.

'ఏప్రిల్‌ 20.. ఉదయం 4.31 గంటలకు మాకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. మా కుటుంబ సభ్యులు ఒకరు.. అస్తెన్‌ చనిపోయిందని ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఆ విషాద వార్తను చేరవేశారు. ఆ ఫోన్‌ కాల్‌ మా జీవితాలనే కుదిపేసింది. దురదృష్టవశాత్తూ అస్తెన్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. తను తీసుకున్న చికిత్స వల్లే ఇంతటి ఘోరం జరిగి ఉండవచ్చు' అని క్రిస్టినా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

చదవండి: 15 ఏళ్ల బంధానికి ముగింపు, బాలీవుడ్‌ జంట విడాకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement