
నటి నగల చోరీ కేసులో 16 మంది అరెస్ట్
పారిస్: రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్‌కు చెందిన నగల చోరీ కేసులో 16 మందిని పారిస్ పోలీసులు అరెస్ట్ చేశారు. పారిస్లోని పలు ప్రాంతాల్లో సోమవారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆటోమెటిక్ గన్స్‌తో పాటు లక్షా 40 వేల యూరోలను స్వాధీనం చేసుకుని 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.
కిమ్ బస చేసిన హోటల్ గదిలోకి పోలీసు దుస్తుల్లో దుండగులు చొరబడి భారీ మొత్తంలో విలువచేసే నగలు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. మొహానికి ముసుగులేసుకున్న ఆ దుండగులు.. కిమ్‌ను తుపాకీతో బెదిరించి విలువైన నగలతో ఉడాయించారు.