ఆమె న్యూడ్ సెల్ఫీ ట్రెండ్ సృష్టించింది..! | nude selfie inspires predictable wave of naked spoofs across social media | Sakshi
Sakshi News home page

ఆమె న్యూడ్ సెల్ఫీ ట్రెండ్ సృష్టించింది..!

Published Wed, Mar 9 2016 8:41 PM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

ఆమె న్యూడ్ సెల్ఫీ ట్రెండ్ సృష్టించింది..!

ఆమె న్యూడ్ సెల్ఫీ ట్రెండ్ సృష్టించింది..!

హాలీవుడ్ టీవీ రియాల్టీ స్టార్‌ కిమ్ కర్దాషియన్‌ చేసిన ఓ పని న్యూడ్ సెల్ఫీలకు మార్గనిర్దేశం చేసినట్లయింది. తనను విమర్శించిన వారికి జవాబుగా కిమ్‌ నగ్నంగా దిగిన సెల్ఫీని ట్విట్టర్‌, ఇన్ స్టాగ్రామ్ లలో షేర్ చేయడం.. ఆపై ఈ సెల్ఫీ పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆమె తీరును సోషల్ మీడియాలో పలువురు తప్పుబడుతుండగా, మరికొందరు నగ్నంగా తమ దేహాన్ని చూపిస్తూ ఆమె తరహాలోనే సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 'లిబరేటెడ్‌' (విముక్తి) అని అనే హ్యాష్‌ట్యాగ్‌ ను కిమ్ వాడటంతో దీని నుంచి ప్రేరణ పొందినట్లుగా కొందరు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు.

ట్విట్టర్ యూజర్ లెజ్ విత్ అనే వ్యక్తి తాను న్యూడ్ గా సెల్ఫీ దిగి కిమ్ ఫొటోను ఆదర్శంగా తీసుకున్నాడు. ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశాడు. బ్రేక్ ఇంటర్ నెట్ అనే క్యాప్షన్ తో కర్దాషియన్ నెటిజన్లకు తన సత్తా ఏంటో చూపించాలని చేసిన ప్రయత్నం బాగానే వర్క్ అవుట్ అయినట్లుంది. మరోవ్యక్తి కిమ్ తో పాటు తన ఫొటోను కలిపి పోస్ట్ చేసి సంచలనం చేశాడు. బ్రేక్ ద ఇంటర్ నెట్ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో పాటు న్యూడ్ సెల్ఫీ విచిత్రమైన ట్రెండును సృష్టించింది.

సెలెస్ట్ బార్బర్ అనే మహిళ కూడా ఈ న్యూడ్ సెల్ఫీ వెర్రికి ప్రయత్నించింది. తాను కూడా ఒంటిపై నూలు పోగు లేకుండా న్యూడ్ గా ఫొటో దిగింది. కిమ్ ఫొటోతో తన ఫొటోను జత చేస్తూ తన బోల్డ్ బాడీపై 'ఐ నీడ్ అటెన్షన్' అని వ్యాఖ్యాన్ని రాసి పోస్ట్ చేసింది. మరికొందరు కిమ్ న్యూడ్ ఫొటోకి సరిపోయే డ్రస్సులను ఫొటోషాప్ చేసి చేసి పోస్ట్ చేశారు.  మొత్తానికి 35 ఏళ్ల కిమ్‌ కర్దాషియన్ తన ఛాతి, ప్రైవేటు అంగాలు కనిపించకుండా రెండు చేతులు అడ్డుపెట్టుకొని దిగిన ఈ ఫొటోను పోస్టు చేయడం.. న్యూడ్ సెల్ఫీ ట్రెండ్ కు ఆధ్యం పోసిందంటూ మరికొందరు ఆమెపై మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement