nude selfie
-
రుణాలకు తాకట్టుగా న్యూడ్ సెల్ఫీలు.. లీక్!
బీజింగ్: ఆన్లైన్లో రుణాల కోసం తాకట్టు పెట్టిన మహిళల నగ్నఫొటోలు, వీడియోలు తాజాగా వెలుగుచూడటం చైనాలో కలకలం రేపుతోంది. ఆన్లైన్లో అప్పులు ఇచ్చేందుకు జెడీ క్యాపిటల్ అనే సంస్థ 2015లో జీడాయ్బావో అనే ఇంటర్నెట్ వేదికను ప్రారంభించింది. ఈ వేదికలో అప్పులు ఇచ్చేవారు తమ వివరాలను రహస్యంగా ఉంచుతారు. అప్పులు తీసుకునేవాళ్లు మాత్రం తమ పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళల అవసరాలను ఆసరాగా చేసుకొని కొందరు దుర్మార్గులు వారి నగ్న సెల్ఫీలు, వీడియోలు పెట్టుకొని రుణాలు ఇచ్చినట్టు వెలుగుచూసింది. దాదాపు 160 మంది యువతులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు.. దాదాపు 10 గిగాబైట్ ఫైళ్లు ఇంటర్నెట్లో లీకయ్యాయి. బ్యాంకులు, ఇతర సంప్రదాయ రుణ వేదికల నుంచి అప్పులు తీసుకోవడం కష్టంగా మారిన నేపథ్యంలో ప్రజలు ఇలా ఆన్లైన్ రుణాల వేదిక సేవల వైపు మొగ్గుచూపుతున్నారని, ఈ నేపథ్యంలో "న్యూడ్ లోన్స్' ఊపందుకున్నాయని, వారానికి 30శాతం వడ్డీతో ఇవి నడుస్తున్నాయని చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఆన్లైన్ వేదికల్లో అప్పులు తీసుకొనేందుకు ముందుకొస్తున్న వారిని.. రుణదాతలు పూచీకత్తు కింద వారి నగ్నఫొటోలు, వీడియోలు ఇవ్వాలని అడుతున్నారు. ఒకవేళ రుణాలు తిరిగి ఇవ్వకుంటే వాటిని మీ స్నేహితులకు, బంధువులకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అప్పులు తీసుకున్న వారి నుంచి లైంగిక లబ్ధులను కూడా రుణదాతలు కోరుతున్నట్టు సోషల్ మీడియాలో వెలుగుచూసిన ఫొటోలను బట్టి తెలుస్తున్నది. ఈ బాగోతంపై స్పందించిన జీడాయ్బావో ఇలా అక్రమంగా రుణాలు ఇచ్చి వేధిస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నట్టు చైనా అధికారిక ట్విట్టర్ వీబోలో ప్రకటించింది. -
సెలబ్రిటీల్లో ఆ 'పిచ్చి' ముదిరితే ప్రమాదం!
లండన్: అమెరికా, బ్రిటన్ సెలబ్రిటీల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. నగ్నంగా సెల్ఫీలు తీసుకోవడం వాటిని ఆన్లైన్లో పోస్ట్ చేయడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. అమెరికా రియాలిటీ టీవీ పర్సనాలిటీ కిమ్ కర్దాషియన్‌తో ఈ ట్రెండ్ మొదలైందని చెప్పవచ్చు. ఆ తర్వాత అమెరికా మోడల్, హాలివుడ్ సినీ తార ఎమిలీ రటాజ్కోస్కీ, మరో సినీ తార మార్నీ సింప్సన్, మోడల్, టీవీ పర్సనాలిటీ, కాలమిస్ట్, రైటర్ విక్కీ పట్టిసన్లు వరుసగా నగ్నంగా సెల్ఫీలు తీసుకొని ఆన్లైన్లో పోస్ట్ చేశారు. వీరికన్నా తానేమి తక్కువ తినలేదంటూ అమెరికా సింగర్, సినీ తార మిలీ సైరస్ ముప్పావు నగ్నంగా ఎంటీవీ అవార్డుల కార్యక్రమానికే హాజరై సంచలనం సష్టించారు. నిజానికి ఇది కొత్త ట్రెండ్గానీ, ఫ్యాషన్గానీ కాదని, ఇదోరకమైన ఫోబియా అని, దీన్ని జనిటల్ ఫోబియా అని పిలువచ్చని లండన్‌లోని క్వీన్స్ గైనకాలజి క్లినిక్‌లో పనిచేస్తున్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ అహ్మద్ ఇస్మాయిల్ తెలిపారు. ఈ పిచ్చి ముదిరితే ప్రమాదకరమని, ఈ ఫోబియాను ఎంత త్వరగా వదులుకుంటే అంత మంచిదని ఆయన సెలబ్రిటీలను హెచ్చరించారు. తోటివారి సెక్స్ గురించి, వారి ఎఫైర్ల గురించి బహిరంగంగా చర్చించే అవకాశం ఉన్న అమెరికా, బ్రిటన్ సెలబ్రిటీల్లోనే ఈ ఫోబియా ఎక్కువగా కనిపిస్తోందని ఇస్మాయిల్ చెప్పారు. పొత్తి కడుపు కింది భాగం ఆకర్షణీయంగా లేదనే పొరపాటు అభిప్రాయం కారణంగా ఈ ఫోబియా పుట్టుకొస్తుందని ఆయన అన్నారు. ఆ భాగం ఆకర్షణీయంగా లేకపోవడం వల్ల బాయ్ ఫ్రెండ్‌ను మెప్పించలేనని, అభిమానులను ఆకట్టుకోలేక పోతానేమోననే భయంతో వారు నగ్నంగ్ సెల్ఫీలు తీసి ఆన్లైన్ పోస్ట్ చేస్తున్నారని, తద్వారా వచ్చే హిట్స్ చూసి అమ్మయ్య! ఫర్వాలేదనుకొని ఆత్మ సంతప్తి పొందుతున్నారని ఆయన చెప్పారు. ఈ ట్రెండ్‌ను ఇలాగే కొనసాగిస్తూ పోతుంటే ఇందులోనూ పోటీ పెరిగి విపరీత పరిణామాలకు దారితీస్తుందని డాక్టర్ ఇస్మాయిల్ హెచ్చరించారు. ముఖం బాగోలేదనుకొని ముఖానికి ప్లాస్టిక్ సర్జరీలు చేసుకున్నట్లుగా మున్ముందు జనిటల్ సర్జరీలకు ఈ ట్రెండ్ దారితీస్తుందని ఆయన అన్నారు. పాప పుట్టిన తర్వాత కిమ్ కర్దాషియన్ నగ్న సెల్ఫీని పోస్ట్ చేయడం వెనక, తల్లైన తర్వాత కూడా తన శరీరాకృతి బాగా ఉందని అభిమానుల మన్ననలను పొందేందుకే ఆమె అలా చేశారని ఆయన భాష్యం చెప్పారు. -
ఆమె న్యూడ్ సెల్ఫీ ట్రెండ్ సృష్టించింది..!
హాలీవుడ్ టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియన్ చేసిన ఓ పని న్యూడ్ సెల్ఫీలకు మార్గనిర్దేశం చేసినట్లయింది. తనను విమర్శించిన వారికి జవాబుగా కిమ్ నగ్నంగా దిగిన సెల్ఫీని ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో షేర్ చేయడం.. ఆపై ఈ సెల్ఫీ పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆమె తీరును సోషల్ మీడియాలో పలువురు తప్పుబడుతుండగా, మరికొందరు నగ్నంగా తమ దేహాన్ని చూపిస్తూ ఆమె తరహాలోనే సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 'లిబరేటెడ్' (విముక్తి) అని అనే హ్యాష్‌ట్యాగ్ ను కిమ్ వాడటంతో దీని నుంచి ప్రేరణ పొందినట్లుగా కొందరు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ట్విట్టర్ యూజర్ లెజ్ విత్ అనే వ్యక్తి తాను న్యూడ్ గా సెల్ఫీ దిగి కిమ్ ఫొటోను ఆదర్శంగా తీసుకున్నాడు. ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశాడు. బ్రేక్ ఇంటర్ నెట్ అనే క్యాప్షన్ తో కర్దాషియన్ నెటిజన్లకు తన సత్తా ఏంటో చూపించాలని చేసిన ప్రయత్నం బాగానే వర్క్ అవుట్ అయినట్లుంది. మరోవ్యక్తి కిమ్ తో పాటు తన ఫొటోను కలిపి పోస్ట్ చేసి సంచలనం చేశాడు. బ్రేక్ ద ఇంటర్ నెట్ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో పాటు న్యూడ్ సెల్ఫీ విచిత్రమైన ట్రెండును సృష్టించింది. సెలెస్ట్ బార్బర్ అనే మహిళ కూడా ఈ న్యూడ్ సెల్ఫీ వెర్రికి ప్రయత్నించింది. తాను కూడా ఒంటిపై నూలు పోగు లేకుండా న్యూడ్ గా ఫొటో దిగింది. కిమ్ ఫొటోతో తన ఫొటోను జత చేస్తూ తన బోల్డ్ బాడీపై 'ఐ నీడ్ అటెన్షన్' అని వ్యాఖ్యాన్ని రాసి పోస్ట్ చేసింది. మరికొందరు కిమ్ న్యూడ్ ఫొటోకి సరిపోయే డ్రస్సులను ఫొటోషాప్ చేసి చేసి పోస్ట్ చేశారు. మొత్తానికి 35 ఏళ్ల కిమ్ కర్దాషియన్ తన ఛాతి, ప్రైవేటు అంగాలు కనిపించకుండా రెండు చేతులు అడ్డుపెట్టుకొని దిగిన ఈ ఫొటోను పోస్టు చేయడం.. న్యూడ్ సెల్ఫీ ట్రెండ్ కు ఆధ్యం పోసిందంటూ మరికొందరు ఆమెపై మండిపడుతున్నారు.