ఇటీవల కాస్మెటిక్ సర్జరీలు కేవలం ప్రముఖులు, సెలబ్రిటీలకు పరిమితం కాలేదు. సాధారణ వ్యక్తులు, ఓ మోస్తారుగా డబ్బున్నవాళ్లు సైతం ఈ సర్జరీలు వెంటపడుతున్నారు. తీరా చేయించుకుని హాయిగా ఉంటున్నారా అంటే లేదనే చెప్పాలి. పలు సైడ్ ఎఫెక్ట్స్‌తో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలానే ఇక్కడొక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ భాలీవుడ్ భామ, అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్స్ కిమ్ కర్దాషియన్ ఉండాలని చేయించుకున్న సర్జరీలు ఆమెకు తీరని బాధను మిగిల్చింది. స్త్రీ జీవితంలో ఎంతో అపరూపమైన దానిపై దెబ్బకొట్టింది. జీవితంలో ఆమె తల్లి అయ్యే అవకాశం లేకుండా చేసింది.
అసలేం జరిగిందంటే..బ్రెజిల్ ఇన్‌ఫ్లుయెన్సర్ జెన్నిఫర్ పాంప్లోన్లా కిమ్ కర్దాషియాన్‌లా కనిపించేందుకు ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చుచేసింది. అయితే తనకు నచ్చిన హీరోయిన్‌లా మారానన్న ఆనందం ఎంతోసేపు నిలువలేదు. ఎందుకంటే ఆమె కర్దాషియాన్‌లా కనిపించేందుకు అంతలా కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంది. చెప్పాలంటే ఆమెలా తన రూపును మార్చెందుకు శరీరంలో ఏ ఒక్క భాగాన్ని వదలకుండా సర్జరీలతో మార్పులు చేసుకుంది. చెప్పాలంటే సర్జరీలు చేయించుకోవడమే తన పని అన్నంతగా చేయించుకుంది. దీనికి ఆమె శరీరం ప్రతిస్పందించడం మొదలుపెట్టింది.
నెమ్మదిగా ఆమె శరీరంలో పలు దుష్ప్రభావాలు చూపించడం మొదలుపెట్టింది. ఇక ఆమె వాటి కోసం ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. చెప్పాలంటే చావు అంచులాదాక వెళ్లింది. ఈ కాస్మెటిక్ సర్జరీల్లో బట్ ఫిల్లర్లను వినియోగిస్తారు. ఇది వక్షోజాలు, పిరుదులు ఆకృతిని పెంచేందుకు ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. అయితే ఇందులో వినియోగించే పాలీమిథైల్ మెథాక్రిలేట్ (PMMA) పలు దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అందరికి ఇది సరిపోకపోవచ్చు. ఇక్కడ పాంఫ్లోన్లా విషయంలో అదే జరిగింది.
అది ఆమెకు సైడ్ ఎఫెక్ట్ ఇచ్చి ప్రత్యుత్పత్తి అవయవాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా ఆమె సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటోంది. చెప్పాలంటే ఆమె తల్లి అయ్యే అవకాశం చాలా తక్కువ. కర్దాషిలా కనిపించాలనే కోరిక మాతృత్వాన్ని దూరం చేసిందంటూ కన్నీటిపర్యంతమయ్యింది. ఇక ఆమెకు శస్త్ర చికిత్స చేసిన వైద్యుడు సైతం మాట్లాడుతూ.."ఆమెకు ఈ కాస్మెటిక్ సర్జరీ ప్రాణాంతకంగా మారింది. అదృష్టవశాత్తు ధ్యానం, సమతుల్య ఆహారం, చికిత్సతో మరణం అంచుల నుంచి బయటపడింది. కానీ అది ఆమె మాతృత్వాన్ని కోల్పోయేలా చేస్తుందని ఊహించలేదు." అని చెప్పుకొచ్చారు.
కాగా, ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాంప్లోన్లా 17 ఏళ్ల వయసు నుంచి ఈ కాస్మోటిక్ సర్జరీలు చేయించుకోవడం ప్రారంభించింది. ఇలా దాదాపు 30 సర్జరీలు చేయించుకుంది. ఫలితంగా 2022లో బాడీ డిస్మోర్ఫియాతో విలవిల్లాడింది. ఇక సర్జరీలు ఆపేయాలని అనుకుంటుండగా శరీరం రియాక్షన్ ఇవ్వడం ప్రారంభించింది. చివరకి అది కాస్తా ఆమె ప్రాణాలనే సంకటంలో పడేసింది. మానసికి ఆరోగ్యంపై దృష్టి సారించి ధ్యానం, యోగా వంటి వాటితో ఆరోగ్య మెరుగు పడేలా చేసుకుంది. అంతేగాదు తనలా ఇలాంటి సర్జరీలు జోలికి వెళ్లి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని సలహాలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment