Fertile
-
ఆమెలా కనిపించాలనుకోవడమే శాపమయ్యింది! ఎంతో గొప్పదైన..
ఇటీవల కాస్మెటిక్ సర్జరీలు కేవలం ప్రముఖులు, సెలబ్రిటీలకు పరిమితం కాలేదు. సాధారణ వ్యక్తులు, ఓ మోస్తారుగా డబ్బున్నవాళ్లు సైతం ఈ సర్జరీలు వెంటపడుతున్నారు. తీరా చేయించుకుని హాయిగా ఉంటున్నారా అంటే లేదనే చెప్పాలి. పలు సైడ్ ఎఫెక్ట్స్‌తో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలానే ఇక్కడొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ భాలీవుడ్ భామ, అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్స్ కిమ్ కర్దాషియన్ ఉండాలని చేయించుకున్న సర్జరీలు ఆమెకు తీరని బాధను మిగిల్చింది. స్త్రీ జీవితంలో ఎంతో అపరూపమైన దానిపై దెబ్బకొట్టింది. జీవితంలో ఆమె తల్లి అయ్యే అవకాశం లేకుండా చేసింది. అసలేం జరిగిందంటే..బ్రెజిల్ ఇన్ఫ్లుయెన్సర్ జెన్నిఫర్ పాంప్లోన్లా కిమ్ కర్దాషియాన్‌లా కనిపించేందుకు ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చుచేసింది. అయితే తనకు నచ్చిన హీరోయిన్లా మారానన్న ఆనందం ఎంతోసేపు నిలువలేదు. ఎందుకంటే ఆమె కర్దాషియాన్‌లా కనిపించేందుకు అంతలా కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంది. చెప్పాలంటే ఆమెలా తన రూపును మార్చెందుకు శరీరంలో ఏ ఒక్క భాగాన్ని వదలకుండా సర్జరీలతో మార్పులు చేసుకుంది. చెప్పాలంటే సర్జరీలు చేయించుకోవడమే తన పని అన్నంతగా చేయించుకుంది. దీనికి ఆమె శరీరం ప్రతిస్పందించడం మొదలుపెట్టింది. నెమ్మదిగా ఆమె శరీరంలో పలు దుష్ప్రభావాలు చూపించడం మొదలుపెట్టింది. ఇక ఆమె వాటి కోసం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. చెప్పాలంటే చావు అంచులాదాక వెళ్లింది. ఈ కాస్మెటిక్ సర్జరీల్లో బట్ ఫిల్లర్లను వినియోగిస్తారు. ఇది వక్షోజాలు, పిరుదులు ఆకృతిని పెంచేందుకు ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. అయితే ఇందులో వినియోగించే పాలీమిథైల్ మెథాక్రిలేట్ (PMMA) పలు దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అందరికి ఇది సరిపోకపోవచ్చు. ఇక్కడ పాంఫ్లోన్లా విషయంలో అదే జరిగింది. అది ఆమెకు సైడ్ ఎఫెక్ట్ ఇచ్చి ప్రత్యుత్పత్తి అవయవాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా ఆమె సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటోంది. చెప్పాలంటే ఆమె తల్లి అయ్యే అవకాశం చాలా తక్కువ. కర్దాషిలా కనిపించాలనే కోరిక మాతృత్వాన్ని దూరం చేసిందంటూ కన్నీటిపర్యంతమయ్యింది. ఇక ఆమెకు శస్త్ర చికిత్స చేసిన వైద్యుడు సైతం మాట్లాడుతూ.."ఆమెకు ఈ కాస్మెటిక్ సర్జరీ ప్రాణాంతకంగా మారింది. అదృష్టవశాత్తు ధ్యానం, సమతుల్య ఆహారం, చికిత్సతో మరణం అంచుల నుంచి బయటపడింది. కానీ అది ఆమె మాతృత్వాన్ని కోల్పోయేలా చేస్తుందని ఊహించలేదు." అని చెప్పుకొచ్చారు. కాగా, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పాంప్లోన్లా 17 ఏళ్ల వయసు నుంచి ఈ కాస్మోటిక్ సర్జరీలు చేయించుకోవడం ప్రారంభించింది. ఇలా దాదాపు 30 సర్జరీలు చేయించుకుంది. ఫలితంగా 2022లో బాడీ డిస్మోర్ఫియాతో విలవిల్లాడింది. ఇక సర్జరీలు ఆపేయాలని అనుకుంటుండగా శరీరం రియాక్షన్ ఇవ్వడం ప్రారంభించింది. చివరకి అది కాస్తా ఆమె ప్రాణాలనే సంకటంలో పడేసింది. మానసికి ఆరోగ్యంపై దృష్టి సారించి ధ్యానం, యోగా వంటి వాటితో ఆరోగ్య మెరుగు పడేలా చేసుకుంది. అంతేగాదు తనలా ఇలాంటి సర్జరీలు జోలికి వెళ్లి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని సలహాలిస్తోంది. (చదవండి: బాడీబిల్డింగ్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా..?) -
తొందరగా వృద్ధాప్య లక్షణాలు రావడానికి కారణం ఇదే!
మనుషుల్లో కొందరూ చాలా పెద్దాళ్లలా కనిపిస్తారు. తొందరగా వయసు పెరిగిపోయినట్లు వృద్ధాప్య ఛాయలే గాక ఆ వయసు సంబంధిత రుగ్మతలు కూడా కనిపిస్తుంటాయి. ఇలా ఎందువల్ల జరుగుతుందో అనే దిశగా శాస్త్రవేత్తలు ఎన్నాళ్లగానో పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఆ పరిశోధనల్లో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటివల్లే మనిషి వయసు స్పీడ్ అప్ అయ్యి వృద్ధులుగా మారుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అది మనిషి దేహంలోనే ఉంటూ టైం చూసి వయసుపై ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు. దేని వల్ల ఇలా జరుగుతుంది. ఏం చేయాలి తదితరాల గురించి తెలుసుకుందాం!. పిల్లులు, ఎలుకల్లో ఉండే పరాన్నజీవులు(చిన్న బగ్) మనిషి వయసును ప్రభావితం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. యూఎస్‌లోని దాదాపు 15% మంది వ్యక్తులు తమ జీవిత కాలంలో తెలిసి లేదా తెలియకుండానే వాటిలో ఉండే ఏక కణజీవి టోక్సోప్లాస్టో గోండి బారిన పడ్డట్లు తెలిపారు. ఇవి పిల్లుల, ఎలుకలు శరీరంలో ఉంటాయని. అవి మనిషి శరీరంలో చేరి నిద్రాణంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇది దాని జీవితకాలం మనిషి శరీరంలోనే జీవించగలదని చెబుతున్నారు. మనిషికి ఉండే రోగ నిరోధకవ్యవస్థ కారణంగా ఆ పరాన్న జీవి కలిగించే ఇన్ఫెక్షన్స్కి గురికావడం అనేది ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మన వయసును ప్రభావితం చేసి వృద్ధాప్య లక్షణాలు కనిపించేలా.. ఆ వయసులో ఉండే శారీరక బలహీనతలను వేగవంతం చేస్తోందన్నారు. దీన్ని వృద్ధాప్య సిండ్రోమ్ అని పిలుస్తారు. దీని కారణంగా వృద్ధుల మాదిరిగా బరువు తగ్గడం, అలసట, కొద్దిగా కూడా శారీరక శ్రమ చేయలేకపోవడం, బలహీనంగా ఉండటం, తరుచుగా ఆస్పత్రికి వెళ్లడం తదితర లక్షణాలన్నీ ఒక్కసారిగా తలెత్తుతాయన్నారు. ఈ లక్షణాలు 65 ఏళ్లు అంతకంటే పైబడినవారిలో గుర్తించినట్లు తెలిపారు. వృద్ధుల్లో ఈ గోండి ఇన్ఫెక్షన్ కోసం వెతకగా ఇది సంకోచించి ఉండి, ముందుగానే వయసును ప్రభావితం చేసినట్లు గుర్తించామన్నారు. దీని గురించి మరింతగా తెలుసుకునేందుకు దాదాపు 601 మంది స్పానిష్, పోర్చుగ్రీస్ వృద్ధులపై పరిశోధనలు చేయగా 67% మంది ఈ గోండి పరాన్న జీవికి ప్రభావితం అయినట్లు గుర్తించారు. ఈ పరాన్న జీవి నిర్ధిష్ట ప్రతిరోధకాలు వయసును ప్రభావితం చేసి.. సంబంధిత బలహీనత లక్షణాలను పెంచుతున్నట్లు తెలిపారు. అందువల్ల పిల్లి, ఎలుకలు వంటి జీవులకు వాటి వ్యర్థాలకు దూరంగా ఉండమని సూచిస్తున్నారు. ఒక వేళ్ల పెంపుడు జంతువులుగా పెంచుకున్నా.. సురక్షితంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. (చదవండి: భారత్‌లోనే టీబీ కేసులు అత్యధికం!: డబ్ల్యూహెచ్ఓ నివేదిక) -
'ఆమ్లా' తో సారవంతమైన రాజస్థాన్ గ్రామాలు!
ఎడారిని తలపించే అక్కడి భూములు ఇప్పుడు సారవంతంగా మారిపోయాయి. వేసవిలో మండించే ఎండలు, తగినంత నీరు లేక సాధారణ జీవనమే గడపలేని రాజస్థాన్ ప్రాంతంలోని గ్రామాలు నీటి సమస్యకు దూరమయ్యాయి. నీరులేక బీడువారిన పొలాలు ఇప్పుడు సస్యశ్యామలమయ్యాయి. ఒక్క పంటకే దిక్కులు చూడాల్సిన పరిస్థితి మారి...రైతులు ఏడాదికి మూడు పంటలు కూడ పండిస్తున్నారు. పశువుల ద్వారా కుటుంబ సభ్యులు సంవత్సరంలో అదనపు ఆదాయాన్నీఆర్జిస్తున్నారు. ముంబైకి చెందిన మహిళ అద్భుత కృషి ఆ గ్రామాల ముఖచిత్రాన్నే మార్చేసింది. వాటర్ మదర్ గా పేరు తెచ్చుకుంది. సాంప్రదాయ నీటి సంరక్షణ పద్ధతులను అమలు చేసి, చెక్ డ్యామ్ లు నిర్మించి రాజస్థాన్ లో వందకు పైగా గ్రామాల ముఖ చిత్రాన్నే మార్చేసింది ముంబైకి చెందిన మహిళ ఆమ్లా. స్థానిక కమ్యూనిటీల సహకారంతో ఆమెకు అది సాధ్యమైంది. 2లక్షల మంది ప్రజలనుంచి ఏడాదికి మూడు వందల కోట్ల ఆదాయం తెచ్చుకునే స్థాయికి చేరింది. 1999/2000 ప్రాంతంలో రాజస్థాన్ కరువుతోనూ, రైతులు దయనీయమైన స్థితిలోనూ ఉన్నట్లు వార్తా పత్రికలు, టీవీల ద్వారా తెలుసుకున్న ఆమ్లా... సమస్యకు పరిష్కారం దిశగా తీవ్రంగా ఆలోచించింది. ముందుగా వాటర్ ట్యాంకర్ల ద్వారా గ్రామస్థులకు నీటిని అందించాలనుకుంది. ఆకార్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి రాజస్థాన్ లోని నీటి సమస్యను పరిష్కరించేందుకు మార్గాలను అన్వేషించింది. వర్షపు నీటిని వాటర్ హార్వెస్టింగ్ పద్ధతి ద్వారా నిల్వ చేసి అందించడమే సరైన పద్ధతిగా భావించిన ఆమె... ఇందుకు స్థానికుల సహకారం తీసుకొని, విజయవంతంగా ముందుకు దూసుకుపోయింది. ముందుగా చెక్ డ్యామ్ ల నిర్మాణంద్వారా పనులు ప్రారంభించి, మండవార్ గ్రామంలో తన మొదటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ట్రస్ట్ ద్వారా నిర్మించిన రెండు చెక్ డ్యాం లతో ఒక్క సంవత్సరంలోనే మంచి ఫలితాలను పొందడంతో స్థానిక రైతులు సుమారు పన్నెండు కోట్ల రూపాయల వరకూ ఆర్జించగలిగారు. ఆ తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూడలేదు. ప్రస్తుతం ఆకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా యాక్ట్ సంస్థ సారధ్యంలో సుమారు వంద గ్రామాల్లో 200 చెక్ డ్యాంలు నిర్మించారు. వీటి ఆధారంగా రెండు లక్షలమంది ప్రజలు మూడు వందల కోట్ల రూపాయల వరకూ ఆర్జిస్తున్నారు. ఒక్కో చెక్ డ్యాం నిర్మాణానికి సుమారు ఐదు లక్షల రూపాయలు ఖర్చవగా... నలభై శాతం ఖర్చులను రైతులు భరించారు. ప్రతి విషయంలోనూ రైతులకు సహాయ సహకారాలను అందిందిస్తూ, ఖర్చుల్లో భాగం పంచుకోవడంతో పాటు నిరంతర పర్యవేక్షణతో మంచి ఫలితాలు సాధించగలిగామని ఆమ్లా చెప్తోంది. ఆమె అనుకున్నట్లుగా రాజస్థాన్ గ్రామాలను సస్యశ్యామలం చేయగల్గింది. ఇకపై మంచినీటికోసం కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా ఇళ్ళవద్దకే మంచినీటి సౌకర్యం దిశగా అడుగులు వేస్తోంది. పశు సంపదతో కూడా గ్రామాలు వర్థిల్లుతుండటంతో ఇప్పుడు స్థానికులు పట్టణాలకు వలసలు పోవడం తగ్గింది. ఒకప్పుడు ఈ గ్రామాల పురుషులకు తమ కుమార్తెలను ఇచ్చి వివాహం చేసేందుకు వెనుకాడేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆమ్లా చెప్తోంది. ''ఈ విజయం నాకు అంత సులభంగా రాలేదు. నా ప్రయత్నంలో యాక్ట్ భాగస్వామ్యం కూడా అధికంగానే ఉంది. అనేకసార్లు ప్రభుత్వం మోకాలడ్డినా మా బృదం ఛాలెంజ్ గా తీసుకొని సమస్యలను అధిగమించాం.'' అంటోంది ఆమ్లా. భవిష్యత్లులో ఆమ్లా టీమ్ ఇతర రాష్ట్రాల్లోనూ తమ సేవలను అందించేందుకు సిద్ధమౌతోంది. మధ్యప్రదేశ్, మహరాష్ట్రల్లో ఇప్పటికే సమస్యలపై అధ్యయనం ప్రారంభించింది.