కుటుంబం పరువు తీస్తున్న అల్లుడు! | Kris Jenner worried for Kardashians reputation | Sakshi
Sakshi News home page

కుటుంబం పరువు తీస్తున్న అల్లుడు!

Published Sun, Feb 21 2016 11:50 AM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM

కుటుంబం పరువు తీస్తున్న అల్లుడు!

కుటుంబం పరువు తీస్తున్న అల్లుడు!

హాలీవుడ్ టీవీ స్టార్ కిమ్‌ కర్దాషియన్ భర్త కెన్యే వెస్ట్ అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతుండటంతో ఇంటిపెద్ద క్రిస్ జెన్నర్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నదట. కర్దాషియన్ బ్రాండ్‌ను అల్లుడు ఘోరంగా దెబ్బతీస్తున్నాడని ఆమె మథనపడుతున్నది. రియాల్టీ టీవీ షోలు, ఫ్యాషన్ షోలతో క్రిస్ జెన్నర్ హాలీవుడ్‌లో తమ కుటుంబానికి ఒక బ్రాండ్ ఇమేజ్‌ను సృష్టించింది. తన కూతురు కిమ్ భర్త ఆ 'బ్రాండ్ ఇమేజ్‌'ను దెబ్బతీస్తుండటంతో.. అల్లుడి వ్యవహారాలను చూసేందుకు ఆమె ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌ను కూడా నియమించాలని భావిస్తున్నది.

కిమ్‌ కర్దాషియన్, వెస్ట్ దంపతులకు రెండేళ్ల కొడుకు నార్త్‌, రెండు నెలల కూతురు సెయింట్ ఉన్నారు. అయితే ఇటీవల ట్విట్టర్‌లో ఇష్టమొచ్చినట్టు పేలుతూ వెస్ట్ రెచ్చిపోతున్నాడు. ఇటీవల తాను పాడిన కొత్త పాటల్లోనూ పాప్ సింగర్ టైలర్ స్విఫ్ట్‌ను తిడుతూ.. ఆమెను తానే ఫేమస్‌ చేశానని పేర్కొంటూ దుర్భాషలాడాడు. దీంతో అతని అసభ్య వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. అయినా అతను తీరు మార్చుకోకుండా అడ్డూ అదుపులేకుండా ప్రవర్తిస్తుండటంతో వెస్ట్ ను కట్టడి చేయాలని క్రిస్ జెన్నర్ భావిస్తున్నదని ఆమె సన్నిహితులు తెలిపారు.

భార్య కిమ్ కర్దాషియన్ తో వెస్ట్..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement