Kris Jenner
-
కూతురుపై దాడి తల్లికి బిజినెస్!
లాస్ ఏంజిల్స్: కూతురిపై కొందరు దుండగులు దాడి చేశారు. కాళ్లు చేతులు కట్టేసి అందిన కాడికి దోచుకున్నారు. కూతురిపై జరిగిన ఈ దోపిడీ ఘటనను క్యాష్ చేసుకోవాలనుకుంటోంది రియాలిటీ టీవీ స్టార్ క్రిస్ జెన్నర్. క్రిస్ జెన్నర్ కూతురు, ప్రముఖ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్‌పై అక్టోబర్ 3న కొందరు దుండగులు పారిస్ హోటల్లో దోపిడీకి పాల్పడ్డారు. ఆమెను బాత్రూంలో బంధించి నగలు, నగదు దోచుకొని వెళ్లారు. ఈ ఘటనతో తాను తీవ్ర భయభ్రాతులకు గురయ్యానని, రేప్ చేస్తారేమో అని భయమేసిందని కిమ్ వెల్లడించింది. కిమ్‌పై జరిగిన దాడికి ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రచారం లభించడంతో పాటు.. మంచి క్రైమ్ థ్రిల్లర్ అంశాలు ఇందులో ఉండటంతో.. దీనిని సినిమాగా తీస్తే మంచి లాభాలోస్తాయని క్రిస్ బిజినెస్ మైండ్ అంచనావేసింది. ఆలోచన వచ్చిందే తడవుగా క్రిస్ ఈ దిశగా ప్రయత్నాలు మొదలెట్టింది. కిమ్ పాత్ర కోసం మిలా కునిస్ లేదా నటాలియా పోర్ట్‌మెన్ అయితే బాగుంటుందని క్రిస్ ఆలోచిస్తోందట. -
కుటుంబం పరువు తీస్తున్న అల్లుడు!
హాలీవుడ్ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ భర్త కెన్యే వెస్ట్ అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతుండటంతో ఇంటిపెద్ద క్రిస్ జెన్నర్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నదట. కర్దాషియన్ బ్రాండ్‌ను అల్లుడు ఘోరంగా దెబ్బతీస్తున్నాడని ఆమె మథనపడుతున్నది. రియాల్టీ టీవీ షోలు, ఫ్యాషన్ షోలతో క్రిస్ జెన్నర్ హాలీవుడ్లో తమ కుటుంబానికి ఒక బ్రాండ్ ఇమేజ్ను సృష్టించింది. తన కూతురు కిమ్ భర్త ఆ 'బ్రాండ్ ఇమేజ్'ను దెబ్బతీస్తుండటంతో.. అల్లుడి వ్యవహారాలను చూసేందుకు ఆమె ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌ను కూడా నియమించాలని భావిస్తున్నది. కిమ్ కర్దాషియన్, వెస్ట్ దంపతులకు రెండేళ్ల కొడుకు నార్త్, రెండు నెలల కూతురు సెయింట్ ఉన్నారు. అయితే ఇటీవల ట్విట్టర్లో ఇష్టమొచ్చినట్టు పేలుతూ వెస్ట్ రెచ్చిపోతున్నాడు. ఇటీవల తాను పాడిన కొత్త పాటల్లోనూ పాప్ సింగర్ టైలర్ స్విఫ్ట్‌ను తిడుతూ.. ఆమెను తానే ఫేమస్ చేశానని పేర్కొంటూ దుర్భాషలాడాడు. దీంతో అతని అసభ్య వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. అయినా అతను తీరు మార్చుకోకుండా అడ్డూ అదుపులేకుండా ప్రవర్తిస్తుండటంతో వెస్ట్ ను కట్టడి చేయాలని క్రిస్ జెన్నర్ భావిస్తున్నదని ఆమె సన్నిహితులు తెలిపారు. భార్య కిమ్ కర్దాషియన్ తో వెస్ట్.. -
మైకేల్ జాక్సన్ ను తలపిస్తోంది!
పారిస్: టీవీ నటి కోట్నీ కర్దాషియన్ తల్లి, టీవీ ప్రొడ్యూసర్ క్రిస్ జెన్నర్ కు పాప్ సంగీత రారాజు మైకేల్ జాక్సన్ కు చాలా దగ్గర పోలికలున్నాయట. క్రిస్ జెన్నర్ అచ్చం మైకేల్ లా ఉందంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దీనికి అసలు కారణం మాత్రం తాజాగా వెలుగు చూసిన ఓ ఫోటోనే. ఆ ఫోటోలో నలుపు, బంగారు రంగు డ్రెస్సులో దర్శనమిచ్చిన జెన్నర్.. మైకేల్ ను మైమరపిస్తుందంటూ మురిసిపోతున్నారు అభిమానులు. అసలు మైకేల్ లా జెన్నర్ ఎలా కనిపిస్తోందని ఒక అభిమాని ప్రశ్నించగా, ఈ మధ్య ఆమె ఎక్కువగా మైకేల్ మాదిరిగానే ఉంటుందని మరో అభిమాని పేర్కొన్నాడు. జెన్నర్ ముఖం ప్లాస్టిక్ లా ఉందంటూ మరో అభిమాని.. ఆమె ఒక మైనపు బొమ్మను తలపిస్తోందని మరో అభిమాని కామెంట్ చేయడం గమనార్హం. ఇంతకీ జెన్నర్ రూపు రేఖల్లో ఆకస్మిక మార్పులు రావడానికి కారణం ఏమిటో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. -
లేటు వయసులో పెళ్లికి సిద్ధమవుతున్న టీవీ నటి!
లండన్: టీవీ రియాల్టీ స్ట్తార్ క్రిస్ జెన్నీర్, బాయ్ ఫ్రెండ్ కోరీ గ్యాంబెల్ ల ప్రేమాయణం ముదిరి పాకాన పడింది. త్వరలో గ్యాంబెల్ ను పెళ్లి చేసుకోవడానికి 59 ఏళ్ల క్రిస్ సిద్ధమవుతోంది. గ్యాంబెల్ ప్రేమలో మునిగి తేలుతున్న క్రిస్ కు అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ప్రేయసి ఇంట్లోనే ఉంటున్నగ్యాంబెల్ కు అన్నీ తానై చూసుకుంటోంది క్రిస్. ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులకు కూడా గ్యాంబెల్ ను పరిచయం చేసిన క్రిస్.. అతనితో జీవితాన్ని పంచుకోవాలని భావిస్తోంది. అయితే దీనిపై కుమార్తెలు కిమ్ కర్దాషియన్, కర్టీ కర్దాషియాన్ లు తెగ మదనపడుతున్నారు. 2013 అక్టోబర్ లో బ్రూస్ జెన్నీర్ తో 23 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకున్న క్రిస్ మరో పెళ్లికి సిద్ధమవుతుండటం పట్ల కుమార్తెలు కలత చెందుతున్నారు. 60 ఏళ్లు పై బడిన గ్యాంబెల్ తో ప్రేమాయణం సాగిస్తున్న క్రిస్ 'పెళ్లి అడుగులు' ఎప్పుడు పడతాయో వేచి చూడాల్సిందే. -
అమ్మ నుంచే నగ్నంగా పోజులివ్వడం నేర్చుకున్నా!
లాస్ ఏంజెల్స్: కొందరు నటులు, గాయనులు నిండు గర్భంతో ఉన్నప్పుడు నగ్నంగా ఫొటోలకు పోజులిచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. టీవీ నటి కోట్నీ కర్దాషియన్, ఆమె తల్లి క్రిస్ జెన్నర్ ఇద్దరూ ఇలాంటి ఫొటోలు దిగారు. నగ్నంగా ఫొటోకు పోజులివ్వడం ఎలాగో అమ్మను చూసి అనుకరించానని కర్దాషియన్ చెబుతోంది. 2009తో కర్దాషియన్ తొలి బిడ్డకు జన్మ ఇచ్చే ముందు నగ్నంగా ఫొటోకు పోజులిచ్చింది. కర్దాషియన్ తాజాగా బాయ్‌ఫ్రెండ్ స్కాట్ డిసిక్ ద్వారా మూడో బిడ్డకు త్వరలో జన్మనివ్వనుంది. గతంలో తల్లి నగ్నంగా దిగిన ఫొటో పక్కన, కర్దాషియన్ తన ఫొటోను ఉంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అమ్మ నుంచే నేర్చుకున్నా అని ఫొటో కింద రాసింది. 1987లో జెన్పర్ కూడా కొడుకు రాబ్‌కు జన్మ ఇచ్చేముందు నగ్నంగా పోజు ఇచ్చింది. రాబ్ 25 వ పుట్టిన రోజు సందర్భంగా 2012లో జెన్నర్ తన బ్లాగ్‌లో ఆ ఫొటోను పోస్ట్ చేసింది.