లేటు వయసులో పెళ్లికి సిద్ధమవుతున్న టీవీ నటి!
లండన్: టీవీ రియాల్టీ స్ట్తార్ క్రిస్ జెన్నీర్, బాయ్ ఫ్రెండ్ కోరీ గ్యాంబెల్ ల ప్రేమాయణం ముదిరి పాకాన పడింది. త్వరలో గ్యాంబెల్ ను పెళ్లి చేసుకోవడానికి 59 ఏళ్ల క్రిస్ సిద్ధమవుతోంది. గ్యాంబెల్ ప్రేమలో మునిగి తేలుతున్న క్రిస్ కు అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ప్రేయసి ఇంట్లోనే ఉంటున్నగ్యాంబెల్ కు అన్నీ తానై చూసుకుంటోంది క్రిస్. ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులకు కూడా గ్యాంబెల్ ను పరిచయం చేసిన క్రిస్.. అతనితో జీవితాన్ని పంచుకోవాలని భావిస్తోంది.
అయితే దీనిపై కుమార్తెలు కిమ్ కర్దాషియన్, కర్టీ కర్దాషియాన్ లు తెగ మదనపడుతున్నారు. 2013 అక్టోబర్ లో బ్రూస్ జెన్నీర్ తో 23 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకున్న క్రిస్ మరో పెళ్లికి సిద్ధమవుతుండటం పట్ల కుమార్తెలు కలత చెందుతున్నారు. 60 ఏళ్లు పై బడిన గ్యాంబెల్ తో ప్రేమాయణం సాగిస్తున్న క్రిస్ 'పెళ్లి అడుగులు' ఎప్పుడు పడతాయో వేచి చూడాల్సిందే.