మైకేల్ జాక్సన్ ను తలపిస్తోంది! | She looks like Michael Jackson, Kris Jenner's fans | Sakshi
Sakshi News home page

మైకేల్ జాక్సన్ ను తలపిస్తోంది!

Published Tue, Jan 27 2015 9:06 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

మైకేల్ జాక్సన్ ను తలపిస్తోంది!

మైకేల్ జాక్సన్ ను తలపిస్తోంది!

పారిస్: టీవీ నటి కోట్నీ కర్దాషియన్ తల్లి,  టీవీ ప్రొడ్యూసర్ క్రిస్ జెన్నర్ కు పాప్ సంగీత రారాజు మైకేల్ జాక్సన్ కు  చాలా దగ్గర పోలికలున్నాయట. క్రిస్ జెన్నర్ అచ్చం మైకేల్ లా ఉందంటూ ఫ్యాన్స్  అభిప్రాయపడుతున్నారు.  దీనికి అసలు కారణం మాత్రం తాజాగా వెలుగు చూసిన ఓ ఫోటోనే. ఆ ఫోటోలో నలుపు, బంగారు రంగు డ్రెస్సులో దర్శనమిచ్చిన జెన్నర్..  మైకేల్ ను  మైమరపిస్తుందంటూ మురిసిపోతున్నారు అభిమానులు.

 

అసలు మైకేల్ లా జెన్నర్ ఎలా కనిపిస్తోందని ఒక అభిమాని ప్రశ్నించగా,  ఈ మధ్య ఆమె  ఎక్కువగా మైకేల్ మాదిరిగానే ఉంటుందని మరో అభిమాని పేర్కొన్నాడు. జెన్నర్ ముఖం ప్లాస్టిక్ లా ఉందంటూ మరో అభిమాని.. ఆమె ఒక మైనపు బొమ్మను తలపిస్తోందని మరో అభిమాని కామెంట్ చేయడం గమనార్హం.  ఇంతకీ జెన్నర్ రూపు రేఖల్లో ఆకస్మిక మార్పులు రావడానికి కారణం ఏమిటో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement