Kourtney Kardashian
-
'క్షమాపణ' నా పిల్లలకు చెప్పక్కర్లేదు
కోర్ట్నీ కర్దేషియన్ అమెరికన్ మీడియా ప్రముఖురాలు. మోడల్. కాలిఫోర్నియాలో ఉంటారు. అయితే ఏ రోజూ ఆమె గురించి వినని దేశమే ఉండదు. ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. కిమ్, క్లో అని ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ఫ్యాషన్ రంగంలో ప్రసిద్ధులు వాళ్లు. కోర్ట్నీకి 40ఏళ్లుంటాయి. 2006లో పెళ్లయింది. ముగ్గురు పిల్లలు. కొడుకు, కూతురు, మళ్లీ ఒక కొడుకు. భర్త స్కాట్. కోపం వచ్చినప్పుడు భార్యాభర్తలు విడిపోతుంటారు. ఎడబాటుగా అనిపించినప్పుడు తిరిగి కలుస్తుంటారు. జీవితంలో తనకేవీ పశ్చాత్తాపాలు లేవంటారు కోర్ట్నీ. ఈ సంగతిని ఆమె తరచు టీవీ రియాల్టీ షోలలో చెబుతుంటారు. నిన్ననో, మొన్ననో కోర్ట్నీని మళ్లీ ఎవరో అడిగారు. అయితే వేరేలా అడిగారు. ‘‘మీ జీవితంలో మీరు చేసిన.. ‘క్షమాపణ చెప్పనవసరం లేని పని’ ఏమిటో ఒకటి చెప్పండి’’ అని! ఆ ప్రశ్నకు కోర్ట్నీ చెప్పిన సమాధానమే ఆమెను మళ్లీ వార్తల్లోకి తెచ్చింది. ‘‘ఒక పనికి మాత్రం నేను ఎప్పటికీ క్షమాపణ చెప్పనవసరం లేదు’’ అన్నారు! క్షమాపణ చెప్పనవరసం లేని ఆ పనిని కోర్ట్నీ తన పిల్లల విషయంలో చేశారట! బహుశా తండ్రిని అప్పుడప్పుడు పిల్లలకు దూరం చేయడం ఆమె చేసిన‘ క్షమాపణ చెప్పనవసరం లేని పని’ అని మనం అనుకోవచ్చు. కానీ అది కాదట. ‘‘నా పిల్లల్ని నేను వారి మూతిపై ముద్దు పెట్టుకున్నాను. అందుకు మాత్రం వారికి క్షమాపణ చెప్పక్కర్లేదు’’ అని నవ్వేశారు కోర్ట్నీ. తర్వాత పేరెంటింగ్ గురించి కొద్దిసేపు మాట్లాడారు. పదేళ్ల కొడుకు, ఏడేళ్ల కూతురు, ఐదేళ్ల కొడుకు. ఇక కోర్ట్నీ కన్నా పెద్ద పేరెంట్ ఎవరుంటారు? కోర్ట్నీ లాంటి తల్లులు తప్ప. ‘‘ఈ ఏజ్‌లోని పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. పిల్లలు మాట వినరు కదా. నా కష్టమేదో నేను పడుతున్నాను. అప్పటికీ ఎవరో ఒకరు నాకు అక్కర్లేని సలహాలు ఇస్తుంటారు.. పిల్లల్ని అలా పెంచాలి, ఇలా పెంచాలి అని. అప్పుడు నాకు ఒళ్లు మండిపోతుంది’’ అన్నారు కోర్ట్నీ. మండినందుకు కూడా ఆమె క్షమాపణ చెప్పక్కర్లేదు. పిల్లల పెంపకంలో ఒకరి అనుభవం ఇంకొకరికి పనికి రాదు కదా. -
'మా అక్కకు ఒక తోడు కావాలి'
డేటింగ్ వెబ్సైట్లలో చేరి ఒంటరి జీవితానికి ఓ తోడు వెతుక్కోవడం పాశ్చాత్యులకు అలవాటే. అదేరీతిలో ఇప్పుడు అక్క కౌర్ట్నీ కర్దాషియన్ కోసం ఓ తోడును వెతికేందుకు హాలీవుడ్ టీవీ నటి కిలీ జెన్నర్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కౌర్ట్నీ పేరిట 'బంబుల్' అనే డేటింగ్ వెబ్సైట్లో ఓ అకౌంట్ ఓపెన్ చేసింది. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన కౌర్ట్నీ కొన్ని నెలల కిందట తన ప్రియుడు స్కాట్ డిసిక్ తో వేరయింది. అప్పటి నుంచి ఈ అమ్మడు ఒంటరిగా ఉంటోంది. 37 ఏళ్ల కౌర్ట్నీ ఇటీవల తనకంటే చాలా చిన్నవాడైన జస్టిన్ బీబర్ (22)తో చెట్టాపట్టాలేసుకొని తిరిగినట్టు కథనాలు వచ్చాయి. కాగా, కౌర్ట్నీ ఫొటోలు, ఆమె వయస్సు, చదువు, ఇతర వివరాలు తెలియజేస్తూ డేటింగ్ యాప్‌లో కిలీ ప్రొఫైల్ ఏర్పాటుచేసింది. 'నా దగ్గర కౌర్ట్నీ ఫోన్ నంబర్ ఉంది. ఆమె పాస్వర్డ్ నాకు తెలుసు. ఈ అకౌంట్‌కు వచ్చిన మెసెజెస్ నేను మీకు చదివి వినిపిస్తాను. ఆమె మెసెజ్‌లు చదివితే నన్ను చంపేస్తుందేమో. అయినా బంబుల్ (యాప్)లో ఆమె ఉండాల్సిన అవసరముంది' అని 20 ఏళ్ల కిలీ పేర్కొంది. డేటింగ్ యాప్‌లో అక్క అకౌంట్ తెరిచిన సందర్భంగా తన అక్కలు కౌర్టీ, ఖ్లోహి కర్దాషియన్ లతో కలిసి ఈ అమ్మడు పార్టీ కూడా చేసుకుంది. -
మైకేల్ జాక్సన్ ను తలపిస్తోంది!
పారిస్: టీవీ నటి కోట్నీ కర్దాషియన్ తల్లి, టీవీ ప్రొడ్యూసర్ క్రిస్ జెన్నర్ కు పాప్ సంగీత రారాజు మైకేల్ జాక్సన్ కు చాలా దగ్గర పోలికలున్నాయట. క్రిస్ జెన్నర్ అచ్చం మైకేల్ లా ఉందంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దీనికి అసలు కారణం మాత్రం తాజాగా వెలుగు చూసిన ఓ ఫోటోనే. ఆ ఫోటోలో నలుపు, బంగారు రంగు డ్రెస్సులో దర్శనమిచ్చిన జెన్నర్.. మైకేల్ ను మైమరపిస్తుందంటూ మురిసిపోతున్నారు అభిమానులు. అసలు మైకేల్ లా జెన్నర్ ఎలా కనిపిస్తోందని ఒక అభిమాని ప్రశ్నించగా, ఈ మధ్య ఆమె ఎక్కువగా మైకేల్ మాదిరిగానే ఉంటుందని మరో అభిమాని పేర్కొన్నాడు. జెన్నర్ ముఖం ప్లాస్టిక్ లా ఉందంటూ మరో అభిమాని.. ఆమె ఒక మైనపు బొమ్మను తలపిస్తోందని మరో అభిమాని కామెంట్ చేయడం గమనార్హం. ఇంతకీ జెన్నర్ రూపు రేఖల్లో ఆకస్మిక మార్పులు రావడానికి కారణం ఏమిటో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. -
అమ్మ నుంచే నగ్నంగా పోజులివ్వడం నేర్చుకున్నా!
లాస్ ఏంజెల్స్: కొందరు నటులు, గాయనులు నిండు గర్భంతో ఉన్నప్పుడు నగ్నంగా ఫొటోలకు పోజులిచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. టీవీ నటి కోట్నీ కర్దాషియన్, ఆమె తల్లి క్రిస్ జెన్నర్ ఇద్దరూ ఇలాంటి ఫొటోలు దిగారు. నగ్నంగా ఫొటోకు పోజులివ్వడం ఎలాగో అమ్మను చూసి అనుకరించానని కర్దాషియన్ చెబుతోంది. 2009తో కర్దాషియన్ తొలి బిడ్డకు జన్మ ఇచ్చే ముందు నగ్నంగా ఫొటోకు పోజులిచ్చింది. కర్దాషియన్ తాజాగా బాయ్‌ఫ్రెండ్ స్కాట్ డిసిక్ ద్వారా మూడో బిడ్డకు త్వరలో జన్మనివ్వనుంది. గతంలో తల్లి నగ్నంగా దిగిన ఫొటో పక్కన, కర్దాషియన్ తన ఫొటోను ఉంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అమ్మ నుంచే నేర్చుకున్నా అని ఫొటో కింద రాసింది. 1987లో జెన్పర్ కూడా కొడుకు రాబ్‌కు జన్మ ఇచ్చేముందు నగ్నంగా పోజు ఇచ్చింది. రాబ్ 25 వ పుట్టిన రోజు సందర్భంగా 2012లో జెన్నర్ తన బ్లాగ్‌లో ఆ ఫొటోను పోస్ట్ చేసింది.