ఆ నటి.. ఉల్లిగడ్డలు నింపిన సంచట! | Rishi Kapoor compares Kim Kardashian with onions in a mesh bag | Sakshi
Sakshi News home page

ఆ నటి.. ఉల్లిగడ్డలు నింపిన సంచట!

Published Wed, Aug 10 2016 4:40 PM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM

ఆ నటి.. ఉల్లిగడ్డలు నింపిన సంచట! - Sakshi

ఆ నటి.. ఉల్లిగడ్డలు నింపిన సంచట!

కొందరు సినీ ప్రముఖులు, క్రికెటర్లు, ఇతర సెలెబ్రిటీలు మీడియాతో కానీ సోషల్ మీడియాలో కానీ సంబంధంలేని వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇవి తమాషాగా, మరికొన్నిసార్లు వివాదాస్పదంగా ఉంటాయి. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ముడిపెడుతూ పొంతనలేని మాటలు చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే మన రాష్ట్రపతి పేరును కరెక్ట్గా చెప్పకపోవడం, ప్రధాని పేరునేమో రాష్ట్రపతి అని చెప్పిన ప్రముఖులు కూడా ఉన్నారు. మాట్లాడేముందు కనీసం ఆలోచించకుండా ఏవేవో చెప్పేసి ఆనక నాలుక్కరుచుకుంటుంటారు. వీరి తెలివితేటలు చూసి సామాన్యులు షాక్ తింటుంటారు.

ఇలాంటి ప్రముఖుల జాబితాలో బాలీవుడ్ వెటరన్ హీరో రిషీ కపూర్ చేరాడు. రిషీ కపూర్ దృష్టి అమెరికా పాపులర్ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియన్పై పడింది. కర్దాషియన్ను పోల్చడానికి మన వెటరన్ స్టార్కు మనుషులు లేదా జంతువులు ఎవరూ నచ్చలేదేమో కూరగాయలు గుర్తుకొచ్చాయి. కిమ్ కర్దాషియన్ను.. ఉల్లిగడ్డలు నింపిన సంచితో పోల్చాడు. ఉల్లిగడ్డల సంచిని, ఇదే రకం డ్రస్ వేసుకున్న కర్దాషియన్ ఫొటోలను పక్కపక్కనపెట్టి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఏ చోట నుంచైనా స్ఫూర్తి పొందవచ్చని కామెంట్ చేశారు. రిషీ కపూర్ గారి ఉల్లిఘాటు అమెరికాలో ఉన్న కర్దాషియన్కు తగిలిందో లేదో తెలియదు కానీ.. నెటిజెన్లు మాత్రం దీనిపై తెగ జోకులేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement