
Neetu Kapoor and Rishi Kapoor Throwback: బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి, నటుడు రిషీ కపూర్ గతేడాది మరణించిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్లు క్యాన్సర్‌తో పోరాడిన ఆ నటుడు 2020 ఏప్రిల్‌లో చనిపోయాడు. అయితే గతంలో కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరించే కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు. ఆ షోలో తన భార్య నీతూ కపూర్‌తో ప్రేమ, పెళ్లి జీవితం గురించి మాట్లాడాడు. ఆ ఇంటర్వూ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
మీ ప్రేమ బంధం గురించి చెప్పమని షోలో కరణ్ రిషికపూర్‌ణి అడడగా ఆయన అందరూ షాక్ అయ్యే బదులు ఇచ్చాడు. ‘మా కెరీర్ ప్రారంభంలో మంచి స్నేహితులుగా ఉండేవాళ్లం. చాలా సమయం గడిపేవాళ్లం. అనంతరం డేటింగ్ చేశాం. కానీ నీతో సహజీవనం చేస్తాను. కానీ పెళ్లి చేసుకోను’ అని భార్య నీతూతో చెప్పినట్లు నటుడు తెలిపాడు. ఆయన చాలా టఫ్ వ్యక్తినని, ఆయన ఇచ్చిన షాక్‌లను ఆమె తట్టుకొని నిలబడం వల్లే వారు ఇంకా కలిసి ఉండగలిగారని చెప్పాడు.
అయితే ఈ విషయం గురించి మాట్లాడిన నీతూ..‘ రిషి చాలా మంచి భర్త. మంచి తండ్రి. కాబట్టి ఏమి జరిగినా ఆయనతో ఉండాలని నిర్ణయించుకన్నట్లు’ తెలపింది. అయితే 5ఏళ్లు సహజీవనం చేసిన అనంతరం వారిద్దరూ వివాహం చేసుకోగా, కూతురు రిద్ధిమా కపూర్ సాహ్ని, కొడుకు రణ్‌బీర్ కపూర్ పుట్టారు. రణ్‌బీర్ సైతం మంచి సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగాడు.
చదవండి: ‘రణ్‌బీర్ నా దుస్తులను తన గర్ల్‌ప్రెండ్స్‌కు గిఫ్ట్‌గా ఇచ్చేవాడు’
Comments
Please login to add a commentAdd a comment