బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి, నటుడు రిషి కపూర్ మరణించి రెండేళ్లు కావొస్తుంది. సుమారు రెండేళ్లు క్యాన్సర్‌తో పోరాడిన ఆయన 2020 ఏప్రిల్‌లో చనిపోయారు. అయితే తన భర్త మరణం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ట్రోల్ చేస్తున్నారని రిషి కపూర్ భార్య నీతూ కపూర్ తెలిపారు. రిషి కపూర్ ఇక లేరన్న బాధలో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమె కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే భర్త చనిపోయాడన్న బాధ లేకుండా ఇలా పోస్ట్‌లు పెట్టడంపై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారట.
దీంతో ఈ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చింది నీతూ కపూర్. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న నీతూ మాట్లాడుతూ 'నేను ఇలా ఉండటాన్ని ఇష్టపడుతున్నాను, ఆస్వాదిస్తున్నాను. నేను నా ఫాలోవర్స్‌ను ప్రేమిస్తున్నాను. నన్ను ట్రోల్ చేసేవారిని బ్లాక్ చేస్తున్నాను. ఎందుకంటే భర్త చనిపోయాక కూడా ఎంజాయ్ చేస్తుందని కొందరు అంటున్నారు. నేను ఏడుస్తూ, బాధపడుతూ, విధవలా ఉండటాన్ని చూడాలనుకుంటున్నవారిని నేను బ్లాక్ చేస్తాను. నేను ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. ఇలాగే ఉంటాను.' అని తెలిపారు.
ఇంకా 'ఇలా ఉండటం వల్ల బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది. కొందరు ఏడుస్తూ, మరికొందరూ నవ్వుతూ బాధ నుంచి కోలుకుంటారు. నేను నా భర్తను మరచిపోలేను. అతను ఎప్పుడూ ఇక్కడ నాతో, నా పిల్లలతో జీవితాంతం ఉంటాడు. ఇప్పుడు కూడా నాతోనే ఉన్నాడు. భోజనానికి వచ్చి సగం సమయం అతని గురించే మాట్లాడుతున్నాం. రణ్‌బీర్ ఇప్పటికీ తన మొబైల్ స్క్రీన్‌సేవర్‌లో అతని ఫొటోనే ఉంది. అంటే మేము అతన్ని ఎంతగా మిస్ అవుతున్నామో అర్థం చేసుకోండి. కానీ మేము అతన్ని మిస్ అవుతున్నందుకు దిగులుగా లేదు. మేము అతన్ని మిస్ అవడాన్ని కూడా సంతోషంగా భావిస్తాం. అతను ఎంతో గొప్ప వ్యక్తి అని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాం' అని పేర్కొన్నారు నీతూ కపూర్.
Comments
Please login to add a commentAdd a comment