
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, బ్యూటీఫుల్ హీరోయిన్ కియారా అద్వాణీ జంటగా కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'జగ్ జగ్ జీయో'. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిగ్గజ నటులు అనిల్ కపూర్, నీతూ కపూర్ కీలక పాత్రలు పోషించారు.
JugJugg Jeeyo Trailer: Varun Dhawan Kiara Advani Love Drama: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, బ్యూటీఫుల్ హీరోయిన్ కియారా అద్వాణీ జంటగా కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'జగ్ జగ్ జీయో'. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిగ్గజ నటులు అనిల్ కపూర్, నీతూ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆదివారం (మే 22) మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్‌లో అనిల్ కపూర్ యాక్టింగ్ చూస్తుంటే సినిమాకే హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. వరుణ్ ధావన్, కియరా, నీతూ కపూర్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ లెంగ్త్ కామెడీ తరహాలో సినిమాను తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. హీరోహీరోయిన్ల పెళ్లి, విడాకుల కథాంశంగా సినిమా రూపొందించారు. ఈ సినిమాను యశ్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు. సినిమాలో ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం నవ్వు తెప్పించేలా ఉన్నట్లు తెలుస్తోంది.