కరోనా లాక్‌డౌన్ తర్వాత సినిమాల చిత్రీకరణలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే చిత్రీకరణ సమయంలో కొందరు కరోనా బారిన పడుతుండటంతో కొన్ని చిత్రాల షూటింగ్‌కి బ్రేకులు పడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ మూవీ ‘జగ్ జగ్ జీయో’ షూటింగ్ కూడా కరోనా వల్ల ఆగిపోయింది. వరుణ్ ధావన్, కియారా అద్వానీ జంటగా రాజ్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జగ్ జగ్ జీయో’. అనిల్ కపూర్, నీతూ కపూర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను చండీగఢ్‌లో ఆరంభించారు. అయితే వరుణ్ ధావన్, నీతూ కపూర్‌తో పాటు దర్శకుడు రాజ్ మెహతా కరోనా బారిన పడటంతో చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారు. అనిల్ కపూర్, కియారా అద్వానీకి మాత్రం నెగటివ్ అని నిర్ధారణ అయింది.
Comments
Please login to add a commentAdd a comment