'నా భర్త అందగాడు.. గతాన్ని మర్చిపో'.. హీరోయిన్‌కు సూచన! | Raj Kapoor wife Krishna Made Comfortable Nargis at Rishi Kapoor wedding | Sakshi
Sakshi News home page

ప్రేమికుల మధ్య 24 ఏళ్ల ఎడబాటు.. ఆరోజు హీరో భార్య ఏం చేసిందంటే?

Aug 29 2024 12:53 PM | Updated on Aug 29 2024 1:36 PM

Raj Kapoor wife Krishna Made Comfortable Nargis at Rishi Kapoor wedding

రాజ్‌కపూర్‌- నర్గీస్‌.. వీరి ప్రేమాయణం గురించి అందరూ కథలుకథలుగా చెప్పుకునేవాళ్లు. 18 చిత్రాల్లో కలిసి నటించిన వీరికి ఒకరిపై మరొకరికి అంతులేని ప్రేమ.. కానీ అప్పటికే రాజ్‌ కపూర్‌కు పెళ్లయి, పిల్లలు కూడా ఉన్నారు. దీంతో ఈ ప్రేమ సఫలం కాలేదు. అనంతరం నర్గీస్‌.. సునీల్‌ దత్‌ అనే నటుడిని పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత రాజ్‌ కపూర్‌తో కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. వాళ్లు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు కూడా వెళ్లేది కాదు. 24 ఏళ్లు ఇలాగే గడిచిపోయాయి.

రాజ్‌ కపూర్‌, భార్య కృష్ణ, హీరోయిన్‌ నర్గీస్‌

పెళ్లికి హాజరు
దశాబ్దాల తర్వాత రాజ్‌.. తన కుమారుడు రిషి కపూర్‌ పెళ్లికి రావాలంటూ నర్గీస్‌ను ఆహ్వానించాడు. ఇచ్చిన మాట ప్రకారం తన భర్తను తీసుకుని పెళ్లికి హాజరైంది. కానీ ఎందుకో అదోలా ఉంది. ఆమె ఇబ్బందిని అర్థం చేసుకున్న రాజ్‌ కుమార్‌ భార్య కృష్ణ తనను దగ్గరకు పిలిచింది. నా భర్త అందగాడు, రొమాంటిక్‌ కూడా! అతడు అందరినీ ఆకర్షిస్తాడు. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు.

భార్య కృష్ణతో రాజ్‌ కపూర్‌

గతాన్ని మర్చిపో
దయచేసి గతం గురించి వదిలేయు.. దాన్ని తవ్వుకుంటూ కూర్చుని బాధపడొద్దు. మా ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి వచ్చావు. ఇప్పుడు మనం స్నేహితులం అని చెప్పింది. ఈ విషయాలను రిషి కపూర్‌ తన పుస్తకంలో రాసుకొన్నాడు. అలాగే తన తండ్రి.. హీరోయిన్‌ వైజయంతిమాలతోనూ సన్నిహితంగా ఉండేవాడని పేర్కొన్నాడు. కాగా రాజ్‌ కపూర్‌ 1988లో కన్నుమూశాడు.

చదవండి: ‘సరిపోదా శనివారం’ టాక్‌ ఎలా ఉందంటే..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement